Mahindra recalls ScorpioN, XUV700: ఈ వాహనాలను రీకాల్ చేస్తున్న మహింద్ర!
Mahindra recalls ScorpioN, XUV700: ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాలను మహింద్ర అండ్ మహింద్ర సంస్థ రీ కాల్ చేస్తోంది.
Mahindra recalls ScorpioN, XUV700: క్లచ్ ప్లేట్లలో సమస్యను గుర్తించడంతో స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాలను మహింద్ర సంస్థ వెనక్కు తీసుకుంటోంది. ఆయా వాహనాలను కొనుగోలు చేసిన వారిని డీలర్లు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, వివరాలు తెలియజేస్తున్నారు.
Mahindra recalls ScorpioN, XUV700: క్లచ్ లో ప్రాబ్లం
క్వాలిటీ కంట్రోల్ గుర్తించని సమస్యను, వాహనాలు మార్కెట్లోకి వెళ్లిన తరువాత గుర్తించడంపై మహింద్ర సంస్థ దృష్టి పెట్టింది. 2022 జులై 1 నుంచి 2022 నవంబర్ 11 మధ్య ఉత్పత్తి చేసిన స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాల క్లచ్ భాగంలోని రబ్బర్ బెల్లోలో సమస్యను గుర్తించారు. దాంతో, ఆ సమయంలో ఉత్పత్తి చేసిన స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాల కొనుగోలు దారులను సంప్రదించాలని సంస్థ డీలర్లను ఆదేశించింది. కార్లను వెనక్కు తీసుకుని, సమస్య ఉంటే, ఆ సమస్యను పరిష్కరించి, తిరిగివ్వాలని సూచించింది. ఇందుకు గానూ కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయరాదని స్పష్టం చేసింది.
Mahindra recalls ScorpioN, XUV700: ఎన్ని వాహనాలు..
2022 జులై 1 నుంచి నవంబర్ 11 మధ్య ఉత్పత్తి చేసిన, క్లచ్ రబ్బర్ బెల్లోలో సమస్య ఉండే అవకాశం ఉన్న 6,618 స్కార్పియో ఎన్(Scorpio-N) కార్లను 12,566 ఎక్స్ యూవీ 700(XUV700) కార్లను వెనక్కు తీసుకోనున్నారు. ఇవన్నీ కూడా మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ కార్లే. స్కార్పియో ఎన్(Scorpio-N) మోడల్ ను ఈ సంవత్సరం జూన్ లో మార్కెట్లో ప్రవేశపెట్టారు. అలాగే, ఎక్స్ యూవీ 700(XUV700) ను 2022 అక్టోబర్ లో మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ రెండు మోడళ్లలో కూడా 2.2 లీటర్ ఎంహాక్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ను అమర్చారు. Scorpio-N బుకింగ్స్ ను ప్రస్తుతానికి నిలిపేశారు. ఇప్పటికే, ఆ మోడల్ కు రెండు సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అలాగే, Mahindra XUV700 మోడల్ కు సంవత్సరం వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
టాపిక్