Engine oil : బైక్‌లోని ఇంజిన్ ఆయిల్‌ను ఎప్పుడు మార్చాలి? సంకేతాలివే..
When to change engine oil in bike : బైక్‌కి ఇంజిన్ ఆయిల్ చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు ఆయిల్‌ని మారుస్తూ ఉండాలి. అయితే.. ఇందుకు కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటంటే..
When to change engine oil in bike : మనిషి బ్రతకడానికి గుండె ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మోటార్‌సైకిల్‌కి ఇంజిన్ కూడా అంతే కీలకం. మన బైక్ లైఫ్‌సైకిల్.. ఇంజిన్‌పైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి ఇంజిన్‌కు.. 'ఇంజిన్ ఆయిల్' ఎంతో అవసరం. ఈ లుబ్రికెంట్ వల్ల ఇంజిన్‌తో పాటు ఇంజిన్ భాగాలు స్మూత్‌గా పనిచేస్తాయి. ఇంజిన్ భాగాలు వేర్ అండ్ టేర్‌కు గురికాకుండా ఈ ఆయిల్ కాపాడుతుంది. అందుకే.. ఇంజిన్ ఆయిల్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాలి. సరైన ఆయిల్‌ని వినియోగిస్తూ.. ఇంజిన్ పనితీరును పెంచుకోవాలి.
బైక్‌లో ఇంజిన్ ఆయిల్ ఒకసారి పోస్తే సరిపోదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండాలి. లేకపోతే.. ఆయిల్ పాడైపోతుంది. దాని కెమికల్ వాల్యూస్ను కోల్పోతుంది. ఫలితంగా ఇంజిన్ పనితీరు దెబ్బతింటుంది. అయితే.. ఇంజిన్ ఆయిల్ మార్చెందుకు కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటంటే..
ఇంజిన్ సౌండ్ పెరిగినప్పుడు..
Engine oil for bikes : మోటార్‌సైకిల్ ఇంజిన్ సాధారణం కన్నా ఎక్కువ సౌండ్ చేస్తుంటే.. ఆయిల్ మార్చాలని అర్థం. ఇంజిన్ బ్లాక్‌లో ఫ్రెష్ ఆయిల్ పోస్తే.. మెటల్ భాగాలకు రక్షణ లభిస్తుంది. అయితే.. ఆయిల్ పాతదైపోతూ ఉంటుంది. అప్పుడు.. మెటల్ భాగాలు ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. అప్పుడు మళ్లీ సౌండ్ పెరుగుతుంది. అప్పుడు మళ్లీ ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి.
ఆయిల్ రంగు చూడండి..
కొన్ని టూ వీలర్స్‌లో.. కారులో ఉన్నట్టుగానే డిప్‌స్టిక్ ఉంటుంది. అందులో ఇంజిన్ కలర్ తెలిసిపోతుంది. ఆయిల్ ఫ్రెష్‌గా ఉంటే అది లైట్ బ్రౌన్ రంగులో కనిపిస్తుంది. కానీ మెల్లిగా అది నల్లగా, మందంగా మారిపోతుంది. వేళ్లతోనూ ఆయిల్ థిక్‌నెస్‌ను తెలుసుకోవచ్చు. ఆయిల్ స్మూత్‌గా లేకపోతే.. కొత్తది పోయాల్సి ఉంటుంది.
ఆయిల్ లెవల్స్ చూసుకోండి..
When to change engine oil : ఇంజిన్ బ్లాక్ పక్కనే ఇంజిన్ ఆయిల్ లెవల్‌ను చూపిస్తూ ఓ ఇండికేటర్ ఉంటుంది. అందులో.. 'మినిమం లెవల్' కన్నా తక్కువగా ఉంటే.. ఇంజిన్ ఆయిల్‌ను వెంటనే మార్చాల్సి ఉంటుంది.
డాష్‌బోర్డ్‌లో కనిపిస్తున్న సిగ్నల్‌తో అలర్ట్ అవ్వండి..
Importance of engine oil in bikes : కొత్తగా వస్తున్న 2 వీలర్స్‌లో.. అనేక సెన్సార్లు ఉంటున్నాయి. బండిలో ఏదైనా తేడాగా ఉంటుంటే.. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో తెలిసిపోతోంది. ఇంజిన్ ఆయిల్ విషయంలోనూ ఇంతే! మీ బైక్‌లోనూ ఇంజిన్ ఆయిల్ ఇండికేటర్‌కు ప్రత్యేక సింబల్ ఉంటుంది. దానిని తెలుసుకోవాలి. ఆ సింబల్.. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై కనిపిస్తుంటే.. వెంటనే అలర్ట్ అవ్వాలి.
ఈ విధంగా.. మీ ఇంజిన్ ఆయిల్‌ను ఎప్పుడు మార్చుకోవాలో తెలుసుకుని.. ఇంజిన్ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.
సంబంధిత కథనం