2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: ఈ బైక్‍లు ఎలా ఉన్నాయి! ఏ అంశంలో ఏది బెస్ట్?
2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: ఈ రెండు 160cc బైక్‍ల ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇవే. రెండింటిని పోల్చి చూస్తే ఏ అంశంలో ఏది మెరుగ్గా ఉందో చూడండి.
2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: పల్సర్ ఎన్ఎస్ లైనప్‍ను బజాజ్ ఆటో ఇటీవలే అప్‍డేట్ చేసింది. ఇందులో భాగంగానే 2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 అడుగుపెట్టింది. కొన్ని అప్‍గ్రేడ్లతో లాంచ్ అయింది. ఈ బైక్‍కు ప్రధానంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ పోటీగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బైక్‍లను పోల్చి చేస్తూ ఎలా ఉన్నాయి, ఏ విషయంలో ఏది మెరుగ్గా ఉందో ఇక్కడ చూడండి.
లుక్స్ ఇలా..
2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: ఈ రెండు బైక్‍లు నేక్డ్ స్ట్రీట్‍ఫైటర్స్ లుక్‍ను కలిగి ఉన్నాయి. స్పోర్టీగా కనిపిస్తాయి. అయితే 2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 హెవీ డిజైన్‍తో అగ్రెసివ్ లుక్‍తో వచ్చింది. పల్సర్‌తో పోలిస్తే హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ కాస్త మినిమలిస్టిక్ డిజైన్‍ను కలిగి ఉంది. అయితే, ఎలాంటి లుక్ ఉన్న బైక్ తీసుకోవాలన్నది వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుంది.
ఇంజిన్, స్పెసిఫికేషన్లు
2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్‍తో పోలిస్తే 2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 కాస్త పవర్‌ఫుల్‍గా ఉంది. 160cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‍ను పల్సర్ ఎన్ఎస్160 కలిగి ఉంది. ఈ ఇంజిన్ 16.96 bhp గరిష్ట పవర్, 14.6 Nm పీక్ టార్క్యూను ఉత్పత్తి చేయగలదు. ఇక హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్.. 163cc ఇంజిన్‍ను కలిగి ఉండగా.. 15 bhp పవర్, 14 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూజ్ చేయగలదు. ఈ రెండు బైక్‍లు 5-స్పీడ్ యూనిట్ గేర్ బాక్సును కలిగి ఉన్నాయి.
హార్డ్‌వేర్
2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: ఫ్రంట్‍లో 33 mm అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్‍ను 2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 కలిగి ఉంది. పెరిమీటర్ ఫ్రేమ్ కూడా గత మోడల్‍తో పోలిస్తే అప్‍డేట్ అయింది. ముందు 300 mm డిస్క్, వెనుక 230 mm డిస్క్ బ్రేకింగ్ కోసం ఉన్నాయి.
హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ సస్పెన్షన్ కోసం ముందు 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెను 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం, ఫ్రంట్‍లో 276 mm పెటల్ డిస్క్, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ట్యుబులర్ డైమండ్ ఫ్రేమ్‍తో ఈ బైక్ వస్తోంది.
ఫీచర్లు
2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: ఎల్ఈడీ లైటింగ్, యూఎస్‍బీ చార్జర్, డిజిటల్ ఇన్‍స్ట్రుమెంట్ క్లస్టర్, హీరో కనెక్ట్ లాంటి ఫీచర్లను హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ కలిగి ఉంది. పల్సర్ ఎన్160 ఇంకా హాలోజెన్ లైటింగ్‍తోనే వచ్చింది. అయితే ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ కాస్త అప్‍గ్రేడ్ అయింది. ఫీచర్ల విషయంలో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మెరుగ్గా ఉంది.
ధరలు ఇలా..
2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: 2023 బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ధర రూ.1.35లక్షలుగా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ధర రూ.1.18లక్షల నుంచి రూ.1.29లక్షల మధ్య ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
సంబంధిత కథనం