తెలుగు న్యూస్ / ఫోటో /
Smartphones with best battery life : బ్యాటరీ లైఫ్‌లో.. ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
Smartphones with best battery life : మంచి బ్యాటరీ లైఫ్ కూడిన ఫోన్‌ను కొనాలని భావిస్తున్నారా? టాప్-5 ది బెస్ట్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ ఇదే..
(1 / 5)
Samsung Galaxy M32 5G: ఈ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 8 జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22,989గా ఉంది. ఇందులో 48ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 6.5ఇంచ్ డిస్ప్లే దీని సొంతం.(Amazon India)
(2 / 5)
Oppo Reno 8 5G: ఇందులో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, 50ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఇందులో ఉన్నాయి. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ దీని సొంతం. దీని ధర రూ.29999.(Oppo)
(3 / 5)
iPhone 13: ఐఫోన్ 13లో 3240ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా పనిచేస్తుంది. 128జీబీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 65,999గా ఉంది. ఐఓఎస్ 15, ఏ15 బయోనిక్ చిప్సెట్తో ఇది పనిచేస్తుంది.(Unsplash)
(4 / 5)
Samsung Galaxy M13: ఇందులో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. శాంసంగ్ అంటేనే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఒక్క రోజు కన్నా ఎక్కువ సేపు ఇది పనిచేస్తుంది. 15వాట్ ఛార్జింగ్ సెటప్ ఇందులో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ డివైజ్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13690గా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ మీద పనిచేస్తుంది.(Samsung)
(5 / 5)
Realme Narzo 50A: ఇందులో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఉంది. 18 వాట్ క్విక్ ఛార్జ్ ఇందులో ఉంటుంది. ఇందులో రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అంటే.. ఈ ఫోన్‌తో ఇతర ఫోన్లు, ఏఎల్ఓటీ డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ డివైజ్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11,499గా ఉంది.(Realme)
ఇతర గ్యాలరీలు