Flex fuel car launch in India : ‘ఫ్లెక్స్ ఫ్యూయెల్’ కారు అంటే ఏంటి?
Flex fuel car launch in India : ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు ఇండియాలో లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఈ కొత్త రకం వాహనం పూర్తి వివరాలు, ఇందులోని ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి.
Flex fuel cars in India : ఇండియాలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు బుధవారం లాంచ్ కానుంది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును టయోటా సంస్థ.. ఇండియాకి తీసుకురానుంది. అసలు ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు అంటే ఏంటి? దీనితో ప్రత్యేకంగా ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా?
ట్రెండింగ్ వార్తలు
ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అంటే ఏంటి?
పేరుకు తగ్గట్టుగానే.. ఇందులో ఇంధనం ఆప్షన్లు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. పెట్రోల్ వాహనాల్లో పెట్రోల్ మాత్రమే పోయాల్సి ఉంటుంది. అయితే.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారులో 83శాతం వరకు పెట్రోల్, ఇథనాల్ కలయికతో కూడిన ఇంధనాన్ని వినియోగించుకోవచ్చు.
What is a flex fuel car : ఇతర వాహనలతో పోల్చితే.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లు సమర్థవంతమైనవిగా గుర్తింపు పొందాయి. వీటితో యాక్సలరేషన్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడినట్టు నివేదికలు చెబుతున్నాయి.
పెట్రోల్ కార్లకు.. ఫ్లెక్స్ ఫ్యూయెల్కు తేడా ఏంటి?
ఈ రెండు వాహనాలు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. అయితే.. ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారులోని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌లో పెట్రోల్, లేదా ఇథనాల్‌తో కూడుకున్న దాని మిశ్రమాన్ని వినియోగించవచ్చు.
Features of Flex fuel car : ఇందుకోసం ఫ్యూయెల్ పంపు, ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్‌లో పలు మార్పులు చేస్తారు. ఇథనాల్‌లో అధిక మొత్తంలో ఉండే ఆక్సీజన్‌ను తీసుకునేందుకు.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల్లో ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఫ్యూయెల్ మిశ్రమం, ఇగ్నీషన్ టైమింగ్, ఎమిషన్ సిస్టమ్‌లను ఇది పర్యవేక్షిస్తుంది. వెహికిల్ ఆపరేషన్, ఇంజిన్ సెఫ్టీ వంటిని కూడా ఈ కంట్రోల్ మాడ్యూల్ చూసుకుంటుంది.
ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లతో ప్రయోజనం ఉందా?
పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఫలితంగా ప్రజల జేబుకు చిల్లు పడుతూనే ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లలో ఇథనాల్‌ని కూడా వాడుకోవచ్చు కాబట్టి, పెట్రోల్‌పై ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇండియాలో.. పెట్రోల్‌తో పోల్చుకుంటే ఇథనాల్ ధర చాలా చవకగా ఉంది.
ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్ల వినియోగం పెరిగితే.. పెట్రోల్ దిగుమతులను కూడా తగ్గించుకోవచ్చు!
India's first flex fuel car : ఈ తరహా ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లు.. అమెరికా, బ్రెజిల్, కెనడా రోడ్ల మీద ఉన్నాయి. 2018 నాటికి.. అమెరికాలో 21మిలియన్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లు ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.
ఇక ఇప్పుడు.. ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లు ఇండియాలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం.. ఈ తరహా కార్లను టయోటా అమ్ముతోంది. అయితే.. టయోటాకు పోటీగా ఇతర ఆటో సంస్థలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్