Citroen C3 Aircross vs MG hector plus : సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ హెక్టార్​ ప్లస్​- ఏది బెస్ట్​?-citroen c3 aircross vs mg hector plus check detailed comparison of features and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen C3 Aircross Vs Mg Hector Plus : సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ హెక్టార్​ ప్లస్​- ఏది బెస్ట్​?

Citroen C3 Aircross vs MG hector plus : సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ హెక్టార్​ ప్లస్​- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
May 20, 2023 11:20 AM IST

Citroen C3 Aircross vs MG hector plus : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్​. ఈ రెండింట్లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి.

సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ హెక్టార్​ ప్లస్
సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ హెక్టార్​ ప్లస్ (HT AUTO)

Citroen C3 Aircross vs MG hector plus : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ ఎస్​యూవీ ఈ ఏడాదిలోనే ఇండియాలో లాంచ్​ అవుతుంది. 5 సీటర్​, 7 సీటర్​ ఆప్షన్స్​ ఇందులో ఉన్నాయి. ఇక ఈ ఎస్​యూవీ.. ఇప్పటకే మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న ఎంజీ హెక్టార్​ ప్లస్​కు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​ అన్నది చూద్దాము..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్- డైమెన్షన్స్​​..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ పొడవు 4,300ఎంఎం. వెడల్పు 1,796ఎంఎం. ఎత్తు 1,654ఎంఎం. మరోవైపు హెక్టార్​ ప్లస్​ ఎస్​యూవీ.. సీ3 ఎయిర్​క్రాస్​ కన్నా 300ఎంఎం పొడవు, 40ఎంఎం వెడల్పు, 105ఎంఎం ఎత్తు ఎక్కువగా ఉంటుంది.

Citroen C3 Aircross price India : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వీల్​బేస్​ 2,671ఎంఎం. ఎంజీ హెక్టార్​ ప్లస్​తో పోల్చుకుంటే ఇది 120ఎంఎం ఎక్కువ. పైగా.. సీ3 ఎయిర్​క్రాస్​లోని మూడో రోను డిటాచ్​ చేసుకోవచ్చు. వేరే ఏ రైవల్​ కారులోనూ ఈ ఆప్షన్​ లేదు. ఇక సిట్రోయెన్​ సీ3 గ్రౌండ్​ క్లియరెన్స్​ 200ఎంఎం. హెక్టార్​ ప్లస్​తో పోల్చుకుంటే 8ఎంఎం ఎక్కువ.

ఎంజీ హెక్టార్​ ప్లస్​లో 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వస్తుండగా.. సిట్రోయెన్​ ఎస్​యూవీలో 17 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి.

ఇదీ చూడండి:- C3 Aircross vs Hyundai Creta : సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ హ్యుందాయ్​ క్రేటా.. ఏది బెస్ట్​?

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్​- ఫీచర్స్​..

MG Hector plus on road price Hyderabad : సిట్రోయెన్​ ఎస్​యూవీలో 10 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వస్తుంది. ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే వంటి కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీస్​ ఉంటాయి. ఫాస్ట్​ ఛార్జింగ్​ను సపోర్ట్​ చేసే విధంగా 5 యూఎస్​బీ పోర్ట్​లు వస్తున్నాయి. అయితే ఇందులో సన్​రూఫ్​ లేకపోవడం మైనస్​ పాయింట్​గా కనిపిస్తోంది. రేర్​ రోలలో రూఫ్​ మౌంటెడ్​ ఏసీ వెంట్స్​ వస్తుండటంతో సన్​రూఫ్​కు ఆస్కారమే లేకుండా పోయింది.

మరోవపు హెక్టార్​ ప్లస్​లో పానారోమిక్​ సన్​రూఫ్​ వస్తోంది. 14 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​తో పాటు ఇతర అప్డేటెడ్​ ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. ఏడీఏఎస్​ టెక్నాలజీ వస్తుండటం హైలైట్​గా నిలుస్తోంది.

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్​- ఇంజిన్​..

Citroen C3 Aircross on road price Hyderabad : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​లో 1.2 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. మేన్యువల్​, ఆటోమెటిక్​ వేరియంట్​ ఆప్షన్స్​ ఉండొచ్చు. మరోవైపు ఎంజీ హెక్టార్​ ప్లస్​లో 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ వస్తోంది.

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్​- ధర..

ఇండియాలో ఎంజీ హెక్టార్​ ప్లస్​ ఎక్స్​షోరూం ధర రూ. 17.5లక్షల నుంచి రూ. 22.43లక్షల వరకు ఉంది. మరోవైపు సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ మిడ్​ సైజ్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం