Citroen C3 Aircross : సీ3 ఎయిర్​క్రాస్​ను ఆవిష్కరించిన సిట్రోయెన్​.. హైలైట్స్​ ఇవే!-citroen c3 aircross unveiled in india check feature launch and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen C3 Aircross : సీ3 ఎయిర్​క్రాస్​ను ఆవిష్కరించిన సిట్రోయెన్​.. హైలైట్స్​ ఇవే!

Citroen C3 Aircross : సీ3 ఎయిర్​క్రాస్​ను ఆవిష్కరించిన సిట్రోయెన్​.. హైలైట్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Apr 28, 2023 06:25 AM IST

Citroen C3 Aircross : సిట్రోయెన్​ సంస్థ.. భారత ఆటోమొబైల్​ మార్కెట్​లోకి మరో వెహికిల్​ను తీసుకొచ్చింది. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ను అధికారికంగా రివీల్​ చేసింది. పూర్తి వివరాలు..

సి3 ఎయిర్​క్రాస్​ను ఆవిష్కరించిన సిట్రోయెన్
సి3 ఎయిర్​క్రాస్​ను ఆవిష్కరించిన సిట్రోయెన్ (HT AUTO)

Citroen C3 Aircross launch : సీ3 ఎయిర్​క్రాస్​ను అధికారికంగా ఆవిష్కరించింది సిట్రోయెన్​ ఇండియా. సీ3 హ్యాచ్​బ్యాచ్​కు మిడ్​-సైజ్​ ఎస్​యూవీ వర్షెన్​ అయిన సీ3 ఎయిర్​క్రాస్​.. సేల్​కు వచ్చింది. డెలివరీ/ లాంచ్​ ఈ ఏడాది రెండో భాగంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్త ఎస్​యూవీలో 5+2 సీటింగ్​ ఆప్షన్​ ఉండనుంది. కస్టమర్ల కంఫర్ట్​ను దృష్టిలో పెట్టుకును ఎస్​యూవీని రూపొందించినట్టు సంస్థ చెబుతోంది.

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​..

ఇండియా మార్కెట్​లో సిట్రోయెన్​కు సీ3 ఎలక్ట్రిక్​ వాహనంతో పాటు సీ3, సీ5 ఎయిర్​క్రాస్​ మోడల్స్​ ఉన్నాయి. ఇక ఇప్పుడు.. సిట్రోయెన్​ పోర్ట్​ఫోలియోలోకి సీ3 ఎయిర్​క్రాస్​ కూడా వచ్చింది. సి3 ఎయిర్​క్రాస్​తో ఇండియాలో గట్టి పోటీ ఉన్న మిడ్​- సైజ్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లోకి అడుగుపెట్టింది సిట్రోయెన్​.

Citroen C3 Aircross India : ఇక సి3 ఎయిర్​క్రాస్​ డిజైన్​.. సీ3తో పోలి ఉంది. ఇందులో స్కల్ప్​టెడ్​ క్లాంషెల్​ బానెట్​, స్ప్లిట్​ టైప్​ డీఆర్​ఎల్స్​తో కూడిన బంపర్​- మౌంటెడ్​ హెడ్​లైట్స్​, స్లీక్​ గ్రిల్​ విత్​ డబుల్​ చెవ్రాన్​ లోగో, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​, రూఫ్​ రెయిల్స్​, ఫ్లార్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. రేర్​లో వ్రాప్​- అరౌండ్​ టెయిల్​గేట్స్​, రూఫ్​- మౌంటెడ్​ స్పాయిలర్​ లభిస్తున్నాయి.

ఇదీ చదవండి:- Citroen C3 Aircross : సీ3కి.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కి ఉన్న తేడా ఇదే!

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​- ఫీచర్స్​..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​లో 5 సీటర్​- 7 సీటర్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి. కాగా కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, ప్రీమియం ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ వస్తున్నాయి.

Citroen C3 Aircross SUV : కీలెస్​ ఎంట్రీ, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, రూఫ్​ మౌంటెడ్​ రేర్​ ఏసీ వెంట్స్​, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ ప్యానెల్​, ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే కనెక్టివిటీ వంటివి ఈ ఎస్​యూవీలో ఉన్నాయి.

ప్యాసింజర్​ సేఫ్టీ కోసం మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​, ఈబీడీ, రేర్​ వ్యూ కెమెరా వంటివి వస్తున్నాయి.

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​- ఇంజిన్​..

ఈ కొత్త ఎస్​యూవీలో 1.2 లీటర్​, లీక్విడ్​ కూల్డ్​, టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 108.4 హెచ్​పీ పవర్​ను, 190 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ వస్తోంది.

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​- ధర..

Citroen C3 Aircross price in India : సీ3 ఎయిర్​క్రాస్​ ధరకు సంబంధించిన వివరాలను సిట్రోయెన్​ సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. ఈ మిడ్​ సైజ్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

లాంచ్​ తర్వాత.. ఈ సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. హ్యుందాయ్​ క్రేటా, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం