Citroen C3 Aircross : సీ3కి.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కి ఉన్న తేడా ఇదే!-how will citroen c3 aircross differ from c3 suv see launch date and full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen C3 Aircross : సీ3కి.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కి ఉన్న తేడా ఇదే!

Citroen C3 Aircross : సీ3కి.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కి ఉన్న తేడా ఇదే!

Sharath Chitturi HT Telugu
Apr 21, 2023 01:36 PM IST

Citroen C3 Aircross : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ త్వరలోనే లాంచ్​ కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

సీ3కి.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కి​ ఉన్న తేడా ఏంటి?
సీ3కి.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కి​ ఉన్న తేడా ఏంటి? (Citroen)

Citroen C3 Aircross launch : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​పై ఫోకస్​ పెంచింది జర్మనీకి చెందిన సిట్రోయెన్​ సంస్థ. వరుస లాంచ్​లతో దూసుకెళుతోంది. ఇక ఇప్పుడు సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ను ఇండియాలో లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 27న ముహుర్తం ఫిక్స్​ చేసింది. ఈ నేపథ్యంలో.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​కు, మార్కెట్​లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సిట్రోయెన్​ సీ3కి మధ్య ఉన్న తేడాలు తెలుసుకుందాము..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. సీ3కి మంచి!

Citroen C3 Aircross launch date : డిజైన్​లో స్వల్ప మార్పులను తప్పిస్తే.. సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. సీ3ని పోలి ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఎస్​యూవీలో బంపర్​ మౌంటెడ్​ హెడ్​లైట్స్​ విత్​ స్ప్లిట్​ టైప్​ డీఆర్​ఎల్స్​, స్లీక్​ గ్రిల్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​, రేక్​డ్​ విండ్​ స్క్రీన్​, రూఫ్​ రెయిల్స్​, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ ఉండున్నాయి. రేర్​లో.. రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​, వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​ కూడా వస్తున్నాయి.

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్- కేబిన్​..

Citroen C3 Aircross price : ప్రస్తుతం ఉన్న సిట్రోయెన్​ సీ3.. ఒక 5 సీటర్​ వెహికిల్​. ఇక కొత్త ఎస్​యూవీ.. 7 సీటర్​గా వస్తోంది. ఇక కొత్తగా వస్తున్న ఎస్​యూవీలో డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, ప్రీమియం ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, కీలెస్​ ఎంట్రీ, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, రేర్​ ఏసీ వెంట్స్​, మల్టిపుల్​ యూఎస్​బీ పోర్ట్స్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ ప్యానెల్​ వస్తున్నాయి.

ప్యాసింజర్​ సేఫ్టీ కోసం మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​ లభిస్తాయి.

ఇదీ చూడండి:- Citroen C3 Aircross : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. వచ్చేస్తోంది! లాంచ్​ డేట్​ ఇదే

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్- ఇంజిన్​..

సిట్రోయెన్​ సీ3లో ఉన్న ఇంజిన్​నే ఈ కొత్త సీ3 ఎయిర్​క్రాస్​లోనూ వినియోగించే అవకాశం ఉంది. అంటే.. ఇందులో 1.2 లీటర్​, లిక్విడ్​ కూల్డ్​, టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది.

Citroen C3 Aircross price Hyderabad : ఏప్రిల్​ 27 లాంచ్​ అనంతరం ఈ సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వస్తాయి. అయితే.. సీ3 కన్నా ఈ ఎస్​యూవీ ధర కాస్త ప్రీమియంగా ఉండే అవకాశం ఉంది. స్పేషియస్​ కేబిన్​, డీసెంట్​ ఫీచర్స్​- ఇంజిన్​ స్పెసిఫికేషన్స్​తో పాటు కుటుంబం మొత్తానికి సరిపోయే ఎస్​యూవీని తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్న వారికి ఈ వెహికిల్​ సూట్​ అయ్యే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం