Citroen C3 Aircross vs Kia Seltos : ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది వాల్యూ ఫర్ మనీ!
08 October 2023, 15:30 IST
- Citroen C3 Aircross vs Kia Seltos : సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ వర్సెస్ కియా సెల్టోస్.. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది వాల్యూ ఫర్ మనీ!
Citroen C3 Aircross vs Kia Seltos : ఇండియాలో సీ3 ఎయిర్‌క్రాస్‌ను ఇటీవలే లాంచ్ చేసింది సిట్రోయెన్ సంస్థ. ఈ ఎస్యుూవీ.. కియా సెల్టోస్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెటర్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు కార్స్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇవే..
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో 1.2 లీటర్ ప్యూర్‌టెక్ 110 ఇంజిన్ ఉంటుంది. ఇది 108 బీహెచ్పీ పవర్‌ను, 190 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ వస్తోంది. ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు.
Citroen C3 Aircross price Hyderabad : ఇక కియా సెల్టోస్‌లో 2 పెట్రోల్, 1 డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్.. 113 హెచ్‌పీ పవర్‌ను, 144 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ టీ-జీడీఐ పెట్రోల్ ఇంజిన్.. 157 హెచ్‌పీ పవర్‌ను, 253 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 1.5 లీటర్ సీఆర్డీఐ వీజీటీ డీజిల్ ఇంజిన్.. 114 హెచ్‌పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
సిట్రోయెన్ సీ3లో 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే 5 సీటర్, 7 సీటర్ ఎస్‌యూవీని పొందొచ్చు. కియా సెల్టోస్‌లో మాత్రం 5 సీటర్ ఆప్షన్ మాత్రమే ఉంది.
ఈ రెండు ఎస్‌యూవీల ధరల వివరాలు..
Kia Seltos price Hyderabad : ఇండియాలో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షలు- రూ. 11.99లక్షల మధ్యలో ఉంటుంది. ఇక కియా సెల్టోస్ ఎక్స్‌షోరూం ధర రూ. 10.90లక్షలు- రూ. 20.30 లక్షలుగా ఉంది.
అంటే.. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ టాప్ ఎండ్ మోడల్ ధర.. కియా సెల్టోస్ ఎంట్రీ లెవల్ మోడల్‌కు దాదాపు సమానంగా ఉన్నాయి. కానీ సిట్రోయెన్ కొత్త మోడల్‌తో పోల్చుకుంటే.. సెల్టోస్‌లో వివిధ ఇంజిన్ ఆప్షన్లు, ట్రాన్సిమిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.
హైదరాబాద్‌లో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
సీ3 ఎయిర్‌క్రాస్ యూ 1.2 5 ఎస్టీఆర్- రూ. 11.92లక్షలు
ప్లస్ 1.2 5 ఎస్టీఆర్- రూ. 13.97లక్షలు
Citroen C3 Aircross on road price Hyderabad : ప్లస్ 1.2 7 ఎస్టీఆర్- రూ. 14.39లక్షలు
మ్యాక్స్ 1.2 5 ఎస్టీఆర్- రూ. 14.76లక్షలు
మ్యాక్స్ 1.2 7 ఎస్టీఆర్- రూ. 15.18లక్షలు