Tata Harrier facelift : టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​లో కనిపించే 7 భారీ మార్పులు..!-tata harrier facelift launching on october 17 whats new ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Harrier Facelift : టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​లో కనిపించే 7 భారీ మార్పులు..!

Tata Harrier facelift : టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​లో కనిపించే 7 భారీ మార్పులు..!

Sharath Chitturi HT Telugu
Oct 15, 2023 11:50 AM IST

Tata Harrier facelift : కొత్త టాటా హారియర్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. హారియర్​ ఫేస్​లిఫ్ట్​లో కనిపించే 7 భారీ మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాము..

టాటా హారియర్​ ఫేస్​లిఫ్​ట్​లో కనిపించే మార్పులివే!
టాటా హారియర్​ ఫేస్​లిఫ్​ట్​లో కనిపించే మార్పులివే!

Tata Harrier facelift : దేశీయ ఆటోమొబైల్​ ఇండస్ట్రీలో ఇప్పుడు.. టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​ టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. ఈ నెల 17న లాంచ్​ అవుతున్న ఈ ఎస్​యూవీపై మార్కెట్​లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే.. ఈ మోడల్​కు సంస్థ భారీ మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాము..

టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​లో కనిపించే మార్పులు..

టాటా మోటార్స్​ సంస్థ మంచి జోరు మీద ఉంది! కొన్ని వారాల క్రితమే.. టాటా నెక్సాన్​, టాటా నెక్సాన్​ ఈవీలకు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను లాంచ్​ చేసిన సంస్థ.. ఇప్పుడు హారియర్​పై ఫోకస్​ చేసింది.

రీడిజైన్డ్​ ఎక్స్​టీరియర్​:- టాటా నెక్సాన్​లో జరిగినట్టే.. హారియర్​ ఎక్స్​టీరియర్​లో కూడా డిజైన్​ పరంగా భారీ మార్పులే జరిగాయి! ఫ్రెంట్​, రేర్​ మారిపోయాయి. ఇందులో వర్డికల్​ బంపర్​ మౌంటెడ్​ బ్లాక్​ హౌజింగ్​ ఉండనుంది. బంపర్​ మీద కనిపించే.. రేడియేటర్​ గ్రిల్​- వైడర్​ ఎయిర్​ ఇంటేక్​లు మరింత పెద్దగా అయ్యాయి. ఈ ఎస్​యూవీకి ఇప్పుడు స్లీక్​ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​ వస్తున్నాయి. ఎల్​ఈడీ టర్న్​ ఇండికేటర్స్​కు సీక్వెన్షియల్​ పాటర్న్​లు వస్తున్నాయి. 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ టాటా హారియర్​ సొంతం.

Tata Harrier facelift launch date: కనెక్టెడ్​ ఎల్​ఈడీ స్ట్రిప్స్​:- ఈ మధ్యకాలంలో వస్తున్న వాహనాలకు ఫ్రెంట్​, రేర్​లో కనెక్టెడ్​ ఎల్​ఈడీ స్ట్రిప్స్​ సాధారణంగా మారిపోయాయి. సరికొత్త టాటా హారియర్​లో కూడా వీటిని చూడొచచు. ఈ మోడల్​ ఫ్రెంట్​, రేర్​లో కూడా కనెక్టెడ్​ ఎల్​ఈడీ స్ట్రిప్స్​ వస్తున్నాయి.

సరికొత్త కలర్స్​:- టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​లో 7 వివిధ ఎక్స్​టీరియర్​ కలర్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. అవి.. సన్​లిట్​ యెల్లో, పెబుల్​ గ్రే, సీవీడ్​ గ్రీన్​, యాష్​ గ్రే, ఒబేరాన్​ బ్లాక్​, లూనార్​ వైట్​, కోరల్​ రెడ్​. మొదటి మూడు కొత్తగా వస్తున్నవి.

వేరియంట్ల పేర్లు:- హారియర్​ వేరియంట్ల పేర్లు కూడా మారిపోయాయి. ఇప్పటివరకు వీటిని.. ఎక్స్​ఈ, ఎక్స్​ఎం, ఎక్స్​ఎంఎస్​, ఎక్స్​టీ, ఎక్స్​జెడ్​ అని పిలిచేవారు. ఇక ఇప్పుడు ఇవి.. ప్యూర్​, అడ్వెంచర్​, స్మార్ట్​, ఫియర్​లెస్​, డార్క్​గా పేరు మార్చుకున్నాయి. టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​కి కూడా ఇదే జరిగింది.

Tata Harrier facelift price in Hyderabad : ఇంటీరియర్​లో ఇలా:- 12.2 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 10.2 ఇంచ్​ ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​లు కొత్తగా వస్తున్నాయి. సరికొత్త 10-స్పీకర్​ జేబీఎల్​ ఆడియో సిస్టెమ్​ లభిస్తోంది. పవర్డ్​- వెటిలేటెడ్​ సీట్స్​ (ముందు రెండింటికి), సన్​ బ్లైండ్స్​, ఎయిర్​ ప్యూరిఫయర్​ వంటివి కొత్తగా లభిస్తున్నాయి.

సేఫ్టీ ఫీచర్స్​:- టాటా హారియర్​ ఫేస్​లిఫ్ట్​లో నీ (మోకాలు) ఎయిర్​బ్యాగ్​తో పాటు మొత్తం 7 ఎయిర్​బ్యాగ్స్​ వస్తున్నాయి. ఫ్రెంట్​ పార్కింగ్​ సెన్సార్స్​, 360 డిగ్రీ కెమెరా, టైర్​ ప్రెజర్​ మానిటర్​, 3 పాయింట్​ సీట్​బెల్ట్​, క్రూజ్​ కంట్రోల్​తో కూడిన 11 ఏడీఏఎస్​ ఫంక్షన్స్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కొత్త హారియర్​ సొంతం.

ఇంజిన్​:- టాటా హారియర్​లో డీజిల్​ ఇంజిన్​ మాత్రమే ఉంటుంది. ఇందులోని 2.0 లీటర్​ ఇంజిన్​.. 168 బీహెచ్​పీ పవర్​ను, 350 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇదొక బీఎస్​6 ఫేజ్​ 2 కంప్లైంట్​. 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ లభిస్త్తున్నాయి.

సంబంధిత కథనం