Tata Punch vs Nissan Magnite : ఆటోమెటిక్​ కారు కొనాలా? ఈ ఎస్​యూవీల్లో బెస్ట్​ ఏదంటే..!-nissan magnite amt vs tata punch amt check detailed comparison of features and price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Vs Nissan Magnite : ఆటోమెటిక్​ కారు కొనాలా? ఈ ఎస్​యూవీల్లో బెస్ట్​ ఏదంటే..!

Tata Punch vs Nissan Magnite : ఆటోమెటిక్​ కారు కొనాలా? ఈ ఎస్​యూవీల్లో బెస్ట్​ ఏదంటే..!

Sharath Chitturi HT Telugu
Oct 14, 2023 07:20 AM IST

Tata Punch vs Nissan Magnite : టాటా పంచ్​ వర్సెస్​ నిస్సాన్​ మాగ్నైట్​.. ఈ రెండు ఎస్​యూవీల్లోని ఏఎంటీ మోడల్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..

ఈ ఎస్​యూవీల్లో బెస్ట్​ ఏదంటే..!
ఈ ఎస్​యూవీల్లో బెస్ట్​ ఏదంటే..!

Tata Punch vs Nissan Magnite : నగరాల్లో ట్రాఫిక్​ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. వాహనదారులు మేన్యువల్​ కార్లు కాకండా.. ఆటోమెటిక్​ మోడల్స్​పై ఫోకస్​ పెంచుతున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? టాటా పంచ్​ ఏఎంటీ, నిస్సాన్​ మాగ్నైట్​ ఏఎంటీల్లో ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

టాటా పంచ్​ ఏఎంటీ వర్సెస్​ నిస్సాన్​ మాగ్నైట్​ ఏఎంటీ..

టాటా పంచ్​లో స్పోర్టీ బంపర్​ మౌంటెడ్​ ప్రొజెక్టర్​ హెడ్​లైట్స్​, క్లామ్​షెల్​ బానెట్​, స్లీక్​ బ్లాక్​డ్​ ఔట్​ గ్రిల్​, రూఫ్​ రెయిల్స్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​, 15 ఇంచ్​ డైమెండ్​ కట్​ అలాయ్​ వీల్స్​ లభిస్తున్నాయి.

Nissan Magnite on road price Hyderabad : నిస్సాన్​ మాగ్నైట్​లో క్రోమ్​ సరౌండర్స్​తో కూడిన హెక్సాగొనల్​ గ్రిల్​, సిల్వర్​ స్కిడ్​ ప్లేట్​, స్వెప్ట్​ బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, బంపర్​ మౌంటెడ్​ ఎల్​ షేప్​ డీఆర్​ఎల్స్​, బ్లాక్​డ్​ ఔట్​ పిల్లర్స్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, 16 ఇంచ్​ డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

ఈ రెండు ఎస్​యూవీల ఫీచర్స్​ ఇవే..

టాటా పంచ్​ ఎస్​యూవీలోని 5 సీటర్​ స్పేషియస్​ కేబిన్​ల ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​ బటన్​, కూల్డ్​ గ్లోవ్​బాక్స్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, 7 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్​, ఐఆర్​ఏ కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీలు లభిస్తున్నాయి.

మరోవైపు.. నిస్సాన్​ మాగ్నైట్​ స్పేషియల్​ 5 సీటర్​ కేబిన్​లో కీలెస్​ ఎంట్రీ, స్టార్ట్​ ఫంక్షన్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, ప్రీమియం అప్​హోలిస్ట్రీ, 8.0 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, జీబేఎల్​ ఆధారిత సౌండ్​ సిస్టెమ్​ వంటివి వస్తున్నాయి.

ఈ రెండు ఎస్​యూవీల ఇంజిన్​ వివరాలు..

Tata Punch on road price in Hyderabad : టాటా పంచ్​లో 1.2 లీటర్​ రివట్రాన్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 87 హెచ్​పీ పవర్​ను, 115 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ దీని సొంతం.

ఇక నిస్సాన్​ మాగ్నైట్​లో 1.0 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 71 హెచ్​పీ పవర్​ను, 96 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులోనూ 5 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

ఈ రెండు వాహనాల ధరలు ఇవే..

Tata Punch price Hyderabad : నిస్సాన్​ మాగ్నైట్​ ఏఎంటీ ఎక్స్​షోరూం ధర రూ. 6.5లక్షలు- రూ. 8.9లక్షల మధ్యలో ఉంటుంది. ఇక టటా పంచ్​ ఏఎంటీ ఎక్స్​షోరూం ధర రూ. 7.5లక్షలు- రూ. 10.09లక్షలుగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం