2024 Hyundai Creta : హ్యుందాయ్ క్రేటా బుకింగ్స్ షురూ.. ఇంటీరియర్ టీజర్ రిలీజ్
2024 Hyundai Creta : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మరోవైపు కొత్త ఎస్యూవీ ఇంటీరియర్‌ని సంస్థ రివీల్ చేసింది.
2024 Hyundai Creta : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌పై బజ్ నెలకొంది. భారీ అంచనాల మధ్య.. ఈ ఎస్యూవీ, ఈ నెల 16న ఇండియాలో లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో.. ఈ వెహికిల్ బుకింగ్స్‌ని కూడా సంస్థ తాజాగా ప్రారంభించింది. రూ. 25వేల టోకెన్ అమౌంట్‌తో 2024 క్రేటాని హ్యుందాయ్ డీలర్షిప్షోరుమ్స్, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మరోవైపు లాంచ్ టైమ్ సమీపిస్తుండటంతో ఒక్కొక్క టీజర్‌ని విడుదల చేస్తోంది సంస్థ. తాజాగా వచ్చిన ఓ టీచర్.. హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌ని రివీల్ చేస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 హ్యుందాయ్ క్రేటా..
కొత్త హ్యుందాయ్ క్రేటా ఎక్స్టీరియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లో భారీ మార్పులే కనిపిస్తాయని టాక్ నడుస్తోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ ప్రకారం.. కేబిన్ మినిమలిస్టిక్‌గా ఉంటుందని స్పష్టమైంది. ఇందులో.. 10.25 ఇంచ్ డ్యూయెల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. హ్యుందాయ్ అల్కజార్లోని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని క్రేటాలో కూడా వాడుతోంది సంస్థ.
Hyundai Creta facelift booking : 2024 హ్యుందాయ్ క్రేటా ఎస్‌యూవీలో సెంటర్ కన్సోల్ కూడా మారింది. సెంటర్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కనిపిస్తోంది. దాని కిందే.. క్లైమేట్ కంట్రోల్ సిస్టెమ్ ఉంటుంది. టచ్ కంట్రోల్ ప్యానెల్స్ కూడా వస్తున్నాయి. గేర్ లెవర్ని కూడా రీ-డిజైన్ చేయడం జరిగింది. ఏసి వెంట్స్ స్లిమ్‌గా కనిపిస్తున్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, క్లైమేట్ కంట్రోల్ సెటప్ మధ్యలో ఇవి ఉంటాయి. అంతేకాకుండా.. ఈ క్రేటా ఫేస్‌లిఫ్ట్‌లో బాక్లిట్ స్విచెస్, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, డ్యూయెల్- టోన్ థీమ్, యాంబియెంట్ లైటింగ్ వంటివి వస్తున్నాయి.
7 వేరియంట్లలో హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్..!
2024 హ్యుందాయ్ క్రేటా ఎస్‌యూవీలో మొత్తం 7 వేరియంట్లు ఉంటాయని సంస్థ ప్రకటించింది. అవి.. ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్(ఓ). 6 మోనో టోన్, 1 డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి.
2024 Hyundai Creta launch in India : వీటిటో పాటు ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీలో 3 ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. అవి. 1.5లీటర్ ఎంపీఐ పెట్రోల్, 1.5లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్, 1.5లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్లు.
ఇండియాలో హ్యుందాయ్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటి క్రేటా. ఇప్పటివరకు 9.5లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి.
"క్రేటా బ్రాండ్ అంటే.. ఎస్యూవీ మాత్రమే కాదు. క్రేటా అంటే ఒక ఏమోషన్. గత 8ఏళ్లల్లో అమ్ముడుపోయిన మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో 3వది క్రేటానే!," అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు.
Hyundai Creta facelift price in Hyderabad : ఇక లాంచ్ తర్వాత ఈ హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, ఎంజీ ఆస్టర్, టాటా హారియర్, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్ వంటి ఎస్‌యూవీలకు గట్టిపోటీనిస్తుంది మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక 2024 హ్యుందాయా క్రేటా ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కాగా.. ఈ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 10.87లక్షలు- రూ. 19.2లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత కథనం