Hyundai cars launch : 2024 కోసం హ్యుందాయ్ క్రేజీ లైనప్.. ఆ ఈవీ హైలైట్!
Hyundai cars launch in 2024 : వచ్చే ఏడాదిలో 3 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్స్.. ఓ ఈవీని లాంచ్ చేయనుంది హ్యుందాయ్. ఆ వివరాలు..
Hyundai cars launch in 2024 : 2024 కోసం భారీగానే ప్లాన్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్స్. వివిధ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌తో పాటు ఓ ఎలక్ట్రిక్ వెహికిల్‌ని ఇండియాలో లాంచ్ చేయాలని ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్:-
Hyundai Creta facelift launch : ఇండియాలో హ్యుందాయ్‌కి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది క్రేటా. ఈ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని త్వరలోనే తీసుకురాబోతోంది సంస్థ. 2024 జనవరి 16న ఇది లాంచ్కానుంది. ఆన్లైన్లో లీక్ అయిన ఫొటోలను చూస్తే.. ఎస్‌యూవీకి భారీ మార్పులే చేసినట్టు కనిపిస్తోంది. ఫ్రెంట్ ఫేస్ చాలా కొత్తగా ఉండనుంది. పారామెట్రిక్ గ్రిల్, వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్ వంటివి వస్తాయి. 17 ఇంచ్ అలాయ్ వీల్స్, సరికొత్త టెయిల్‌లైట్‌తో పాటు రేర్‌లో కనెక్టెడ్ ఎల్ఈడీ వంటివి ఉంటాయి. కేబిన్‌లో కూడా మార్పులు కనిపిస్తాయట. 360 డిగ్రీ వ్యూ కెమెరా, డ్యూయెల్ స్క్రీన్, అడాస్ ఫీచర్ వంటివి ఉంటాయి. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌కు గట్టి పోటీనిచ్చే విధంగా ఈ హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ ఉండనుంది.
హ్యుందాయ్ క్రేటా ఈవీ..
Hyundai Creta EV launch : క్రేటా ఫేస్‌లిఫ్ట్‌తో పాటు ఈవీ వర్షెన్‌ని కూడా హ్యుందాయ్ సిద్ధం చేస్తోందని టాక్ నడుస్తోంది. 2024లో దీనిని సంస్థ రివీల్ చేస్తుందని రిపోర్టులు సూచిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. అనేకమార్లు ఇండియా రోడ్లపై దర్శనమిచ్చింది. కానీ ఈ ఈవీ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇప్పటికే ఇండియాలో ఉన్న హ్యుందాయ్ కోనా, ఐయానిక్ 5 సరసన చేరుతుంది హ్యుందాయ్ క్రేటా ఈవీ.
2024 హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్..
2021లో అల్కజార్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసింది హ్యుందాయ్. ఇదొక 3- రో ఎస్యూవీ. సేల్స్ పరంగా హ్యుందాయ్ అల్కజార్ మంచి నెంబర్లే ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో 3- రో సెగ్మెంట్లో పోటీ విపరీతంగా పెరుగుతోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700, టాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్ వంటి మోడల్స్ నుంచి అల్కజార్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే.. అల్కజార్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తీసుకొచ్చి.. కస్టమర్లను ఆకర్షించాలని చూస్తోంది సంస్థ.
2024 హ్యుందాయ్ అల్కజార్‌లో డిజైన్ పరంగా పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు. కాస్మొటిక్స్ మాత్రమే మారుతాయని తెలుస్తోంది. ఇంజిన్ కూడా మారకపోవచ్చు.
2024 హ్యుందాయ్ టుక్సాన్ ఫేస్‌లిఫ్ట్..
Hyundai cars launch : న్యూ జనరేషన్ టుక్సాన్ని ఏడాది క్రితం లాంచ్ చేసింది హ్యుందాయ్. ఇందులో ఏడీఏఎస్ ఫీచర్స్ వచ్చాయి. ఇక ఈ ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని 2024లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అప్డేటెడ్ గ్రిల్, బంపర్, హెడ్‌లైట్స్ వంటివి కనిపించొచ్చు. కేబిన్‌లో కూడా మార్పులు చూడొచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కొత్తగా ఉండనుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం