Electric cars : 2024లో లాంచ్​కు రెడీగా ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాలు ఇవే.. ఈవీ లవర్స్​కి పండుగే!-maruti evx to tata harrier ev electric cars to launch in india 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Cars : 2024లో లాంచ్​కు రెడీగా ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాలు ఇవే.. ఈవీ లవర్స్​కి పండుగే!

Electric cars : 2024లో లాంచ్​కు రెడీగా ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాలు ఇవే.. ఈవీ లవర్స్​కి పండుగే!

Sharath Chitturi HT Telugu
Dec 19, 2023 07:20 AM IST

Electric cars launch in 2024 : వచ్చే ఏడాదిలో పలు ఆసక్తికర ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ లాంచ్​కానున్నాయి. మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి మహీంద్రా కొత్త ఈవీ వరకు.. లైనప్​ బలంగా ఉంది. పూర్తి వివరాలు..

2024లో లాంచ్​కు రెడీగా ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాలు ఇవే
2024లో లాంచ్​కు రెడీగా ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాలు ఇవే

Electric cars launch in 2024 : 2023లో సరికొత్త లాంచ్​లతో ఇండియా ఆటోమొబైల్​ రంగంలోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​ కళకళలాడిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాదిలో సేల్స్​ కూడా దూసుకెళ్లాయి. ఇదే జోష్​ని 2024లో కూడా కొనసాగించాలని ఆటోమొబైల్​ సంస్థలు ప్లాన్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర మోడల్స్​ని లాంచ్​ చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఆ వివరాలు..

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​..

Maruti Suzuki EVX launch : 2024.. మారుతీ సుజుకీకి చాలా ముఖ్యం! ఇప్పటివరకు ఈ సంస్థ నుంచి ఒక్క ఎలక్ట్రిక్​ వెహికిల్​ కూడా లాంచ్​ అవ్వలేదు. మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీతో ఆ లోటును భర్తీ చేసేందుకు కృషి చేస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. 2024లో ప్రొడక్షన్​ మొదలుపెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. 2024లోనే ఈ మోడల్​ లాంచ్​ అవుతుంది. 60 కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయాన్​ బ్యాటరీ ఉన్న ఈ ఈవీ రేంజ్​ 550 కి.మీలు!

టాటా హారియర్​ ఈవీ..

Tata Harrier EV launch : మచ్​ అవైటెడ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఈ టాటా హారియర్​ ఈవీ ఒకటి. టెస్టింగ్​ దశలో ఉన్న ఈ మోడల్​ ఫొటోలు ఇప్పటికే చాలాసార్లు వైరల్​ అయ్యాయి. కానీ ఈ ఈవీ రేంజ్​, బ్యాటరీ, ఫీచర్స్​ వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. ఇటీవలే హారియర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ బయటకొచ్చింది. ఇక 2024లో ఈవీ వర్షెన్​ లాంచ్​కానుంది.

టాటా కర్వ్​ ఈవీ..

2023 ఆటో ఎక్స్​పోలో టాటా మోటార్స్​ సంస్థ ప్రదర్శించిన కర్వ్​ ఈవీ.. అందరి దృష్టిని ఆకర్షించింది. సరికొత్త డిజైన్​తో అట్రాక్షన్​గా నిలిచింది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ కూడా 2024లోనే లాంచ్​ కానుంది. దీని రేంజ్​ 400కి.మీల నుంచి 500 కి.మీల మధ్యలో ఉంటుందని తెలుస్తంది. అయితే.. టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో వాడిన బ్యాటరీనే ఇందులో కూడా వాడుతున్నారా? అన్న విషయంపై క్లారిటీ లేదు.

టాటా హారియర్​ ఈవీ, టాటా కర్వ్​ ఈవీతో పాటు టాటా పంచ్​ ఈవీ కూడా 2024లోనే లాంచ్​ అవుతుందని టాక్​ నడుస్తోంది. వాస్తవానికి ఈ మోడల్​ అక్టోబర్​లోనే లాంచ్​ అవ్వాల్సి ఉంది. కానీ ఇంకా అవ్వలేదు. డిసెంబర్ చివర్లో లాంచ్​ ఈవెంట్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. మరి ఈ మోడల్​ ఎప్పుడు బయటకొస్తుందో చూడాలి.

కియా ఈవీ9..

Kia EV9 price in India : కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని 2024లో ఇండియాలో లాంచ్​ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది కియా మోటార్స్​. ఇందులో 541 కి.మీ రేంజ్​ని ఇచ్చే బ్యాటరీ ఉంటుందని సమాచారం. అంతేకాకుండా.. అల్ట్రా స్పీడ్​ ఛార్జింగ్​ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే. 15 నిమిషాలు ఛార్జ్​ చేస్తే.. దాదాపు 240 కి.మీల దూరం ప్రయాణించవచ్చట! కియా ఈవీ9కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మహీంద్రా ఎక్స్​యూవీ.ఈ8..

మహీంద్రా అండ్​ మహీంద్రాకు ప్రస్తుతం మార్కెట్​లో ఎక్స్​యూవీ400 ఈవీ ఒక్కటే ఉంది. అయితే.. ఈవీ లైనప్​ మాత్రం పటిష్ఠంగా ఉంది. కొత్త మోడల్స్​తో పాటు థార్​ ఈవీని కూడా తీసుకొచ్చేందుకు సంస్థ ప్లాన్​ చేస్తోంది. ఇందులో భాగంగా.. తొలుత లాంచ్​ అయ్యే వెహికిల్​.. మహీంద్రా ఎక్స్​యూవీ.ఈ8 అని సమాచారం. 2024లో ఇది బయటకొస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం