Maruti Suzuki electric car : మారుతీ సుజుకీ తొలి ఈవీ.. ఇదిగో!-maruti evx electric suv spotted in india for the first time check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Maruti Evx Electric Suv Spotted In India For The First Time. Check Details

Maruti Suzuki electric car : మారుతీ సుజుకీ తొలి ఈవీ.. ఇదిగో!

Sharath Chitturi HT Telugu
Nov 11, 2023 12:00 PM IST

Maruti Suzuki eVX : టెస్ట్​ రన్​ దశలో ఉన్న మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు..

మారుతీ సుజుకీ తొలి ఈవీ.. ఇదిగో!
మారుతీ సుజుకీ తొలి ఈవీ.. ఇదిగో!

Maruti Suzuki eVX : ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కు క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. కానీ.. ఈ సెగ్మెంట్​లో ఇప్పటికీ ఒక్క మోడల్​ని కూడా లాంచ్​ చేయలేదు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఈ లోటును భర్తీ చేసేందుకు గట్టి ప్లాన్లే వేసింది. ఇందులో భాగంగా.. ఈవీఎక్స్​ పేరుతో ఓ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని తీసుకొస్తోంది. 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో ఈ మోడల్​ని ప్రదర్శించింది. ఆ తర్వాత.. అనేక దేశాల్లో ఈ ఎస్​యూవీ చక్కర్లు కొడుతూ కనిపించింది. తాజాగా.. ఇండియా రోడ్లపైనా ఈ ఈవీ దర్శనమిచ్చింది. టెస్ట్​ రన్​ దశలో ఉన్న ఈ కారు ఫొటోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​..

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ టెస్ట్​ రన్​ ఇటీవలే ఇండియాలో జరిగింది. కాగా.. వెహికిల్​ మొత్తానికీ బ్లాక్​ టేప్​ కట్టి, టెస్ట్​ రన్​ నిర్వహించింది మారుతీ సుజుకీ. ఇతర వాహనాల టెస్ట్​ రన్​ కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఫలితంగా.. ఈ మోడల్​ కీలకమైన ఫీచర్స్​ రివీల్​ అవ్వలేదు. ఫొటోలను చూస్తే.. ఫ్రెంట్​ డిజైన్​లోని హెడ్​ల్యాంప్​ మాత్రమే కనిపిస్తోంది.

Maruti Suzuki eVX electric : ఈ ఈవీఎక్స్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సరికొత్త ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తోంది మారుతీ సుజుకీ. ఇందుని వీల్స్​ కార్నర్స్​లో ఉంటాయి. ఫ్లోర్​బోర్డ్​పై బ్యాటరీలు ఉంటాయి. ఫలితంగా కేబిన్​లో స్పేస్​ మరింత పెరుగుతుంది.

ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ పొడవు 4,300ఎంఎం. వెడల్పు 1,800ఎంఎం. ఎత్తు 1,600ఎంఎం. ఇందులో 60 కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయాన్​ బ్యాటరీ ఉంటుందని ఇదివరకే చెప్పింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. దీని రేంజ్​ 550 కిలోమీటర్​ ఉంటుందని వెల్లడించింది.

మారుతీ సుజుకీ ఈవీఎక్స్
మారుతీ సుజుకీ ఈవీఎక్స్

Maruti Suzuki eVX launch in India : ఇటీవలే జరిగిన జపాన్​ మొబిలిటీ షోలో ఈ ఈవీఎక్స్​ ఈవీని ప్రదర్శించింది సంస్థ. ఇంటీరియర్​లో డ్యూయెల్​ స్క్రీన్​ సెటప్​, టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, సింగల్​ ఫరీస్టాండింగ్​ యునిట్​, ఫ్లాట్​ బాటమ్​ స్పోర్టీ స్టీరింగ్​ వీల్​, రోటరీ డయల్స్​, టచ్​ ప్యానెల్స్​ వంటివి ఉంటాయని సమాచారం.

ఇండియాలో.. ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్​.. 2025లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

కొత్త ఫీచర్స్​తో సుజుకీ డిజైర్​​..!

2024 స్విఫ్ట్​తో పాటు 2024 డిజైర్​ని కూడా సిద్ధం చేస్తోంది మారుతీ సుజుకీ సంస్థ. 2024 మారుతీ సుజుకీ డిజైర్​ 9 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​ ఉండనుంది. వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో, బిల్ట్​-ఇన్​ నేవిగేషన్​తో పాటు ఇతర కూల్​ ఫీచర్స్​ ఇందులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel