Ola S1 X electric scooter : ఓలా ఎస్1 ఎక్స్‌లో రెండు కొత్త వేరియంట్లు.. ధరలు ఎంతంటే..
Ola S1 X variants : ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎక్స్‌లో రెండు కొత్త వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వాటి ఫీచర్స్, రేంజ్, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Ola S1 X on road price in Hyderabad : దేశీయ దిగ్గజ 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. తన పోర్ట్‌ఫోలియోను ఎక్స్‌ప్యాండ్ చేసుకునే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో.. ఓలా ఎస్1 ఎక్స్‌లో తాజాగా రెండు కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది. వీటి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫీచర్స్, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త వేరియంట్లు..
ఓలా ఎస్1 ఎక్స్‌లోని రెండు కొత్త వేరియంట్లకు డ్యూయెల్ టోన్ డిజైన్ వస్తోంది. డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, రైజ్డ్ హ్యాండిల్‌బార్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ పీస్ సీట్, 12 ఇంచ్ స్టీల్ వీల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటివి వస్తున్నాయి.
రైడర్ సేఫ్టీ కోసం.. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కు డ్రమ్ బ్రేక్స్ (ఫ్రెంట్- రేర్ వీల్స్), కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్, టెలిస్కోపిక్ ఫ్రెంట్ ఫోర్క్స్, డ్యూయెల్ రేర్ షాక్ అబ్సార్బర్స్ వంటివి వస్తున్నాయి.
Ola S1 X new variants : ఓలా ఎస్1 ఎక్స్ ఒక వేరియంట్లో 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇంకో దానిలో 4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ రెండు కూడా.. 6కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్కి కనెక్ట్ చేసి ఉంటాయి. మొదటి బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 143 కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. రెండో వేరియంట్ రేంజ్ 190కి.మీలు అని అంటోంది.
ఓలా ఎస్1 ఎక్స్ కొత్త వేరియంట్లు- వాటి ధరలు..
ఓలా ఎస్1 ఎక్స్ 3కేడబ్ల్యూ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 89,999. 4కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,09,999. బుకింగ్స్ ఇప్పటికే మొదలవ్వగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Best electric scooters in India : అంతేకాకుండా.. బ్యాటరీ వారెంటీపై కీలక ప్రకటన చేసింది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. తమ పోర్ట్‌ఫోలియోలోని వాహనాలపై 8ఏళ్ల బ్యాటరీ వారెంటీని ఇస్తామని పేర్కొంది. ఇండియా ఆటోమొబైల్లోని 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఇదే తొలిసారి! క్వాలిటీ, సర్వీస్‌కి కట్టుబడి, ఎక్స్టెండెడ్ వారెంటీని కూడా ఇస్తామని అంటోంది.
మరోవైపు.. తమ పబ్లిక్ ఛార్జింగ్ నెట్వర్క్ని ఎక్స్‌ప్యాండ్ చేస్తామని కూడా చెబుతోంది ఓలా ఎలక్ట్రిక్. ప్రస్తుతం 1000 ఛార్జర్స్ ఉండగా.. వచ్చే త్రైమాసికానికి దానిని 10,000 ఛార్జర్స్‌గా మారుస్తామని చెప్పింది.
Ola electric latest launches : ఇవన్నీ చూస్తుంటే.. 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొని, నెంబర్.1 గా కొనసాగేందుకు ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టమవుతోంది!
సంబంధిత కథనం