How to become rich : కోటీశ్వరులు అవ్వాలన్న మీ కలలను నెరవేర్చుకోండి ఇలా..-how to become rich 5 investment options in 20s to become a millionaire in 30s ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How To Become Rich, 5 Investment Options In 20s To Become A Millionaire In 30s

How to become rich : కోటీశ్వరులు అవ్వాలన్న మీ కలలను నెరవేర్చుకోండి ఇలా..

Sharath Chitturi HT Telugu
Aug 23, 2022 10:44 AM IST

How to become rich : మీకు 20ఏళ్లు పైబడ్డాయా? మరో 10ఏళ్లల్లో ధనికులు అవ్వాలని కలలు కంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.

20ఏళ్ల వయస్సులో పెట్టుబడి.. 10ఏళ్లలో కోటీశ్వరులు అవ్వడింలా!
20ఏళ్ల వయస్సులో పెట్టుబడి.. 10ఏళ్లలో కోటీశ్వరులు అవ్వడింలా!

How to become rich : 'ధనం మూలం ఇదం జగత్​'.. ఈ మాటను చాలా మంది సీరియస్​గా తీసుకుంటారు. కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటారు. ముఖ్యంగా యువతలో ఈ ఆశలు ఎక్కువగా ఉంటాయి. రిస్క్​ తీసుకునే యేజ్​ కూడా వారికి ఉంది కాబట్టి.. కలలను వారు నెరవేర్చుకునే అవకాశాల ఎక్కువగా ఉంటాయి. మీరు 20ఏళ్లు పైబడి.. కోటీశ్వరులు అవ్వాలని ఆశిస్తున్నారా? 20ఏళ్లకు ఇన్​వెస్ట్​మెంట్​ మొదలుపెట్టి.. మీకు 30ఏళ్లు వచ్చేసరికి కోటీశ్వరులు అయ్యే 5 మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

కమర్షియల్​ రియల్​ ఎస్టేట్​:-

20ఏళ్లుపై బడి.. 30ఏళ్లకు ధనికులు అవ్వాలని ఆశిస్తున్న వారికి 'కమర్షియల్​ రియల్​ ఎస్టేట్​' ఆప్షన్​ ఉత్తమం అని అంటున్నారు దేవీకా గ్రూప్​ ఎండీ అంకిత్​ అగర్వాల్​.

"ఆఫీసులు, రీటైల్​, వేర్​హౌస్​లు వంటి కమర్షియల్​ అసెట్స్​.. సేఫ్​ బెట్​ అని చెప్పుకోవచ్చు. వాటితో రెంటల్​ ఆదాయం వస్తుంది. రిటర్నులు అధికంగా ఉంటాయి. గ్రేడ్​-ఏ ఆఫీసు స్థలం ఉంటే.. సులభంగా 6-7శాతం సగటు యీల్డ్​ని తీసుకొస్తుంది," అని ఆయన అన్నారు.

సిస్టమాటిక్​ ఇన్​వెస్ట్​మెంట్​ ప్లాన్స్​:-

సిస్టమాటిక్​ ఇన్​వెస్ట్​మెంట్​ ప్లాన్స్​ని 'సిప్'​ అంటారు. స్వల్ప కాలంలో డబ్బులను రెట్టింపు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి!

How to become Crorepati : "25ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి సిప్​లు స్టార్ట్​ చేయాలి. ఆ వయస్సుకి వారికి ఉద్యోగాలు వస్తాయి కదా. ఆలస్యం చేయకూడదు. తక్కువ వయస్సులో సిప్​ను మొదలుపెట్టి.. నిలకడగా దానిని ముందుకు తీసుకెళితే.. అద్భుతాలను సృష్టిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు," అని ఎస్​ఏజీ ఇన్ఫోటెక్​ ఎండీ పేర్కొన్నారు.

దేశంలో ఎన్నో మ్యూచువల్​ ఫండ్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని ఎంచుకుని సిప్​ను మొదలుపెట్టవచ్చు.

Index mutual fund వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Large cap mutual funds వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Multi cap mutual funds వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడికి ముందు తెలుసుకోవాల్సిన అంశాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పీపీఎఫ్​:-

పీపీఎఫ్​ అంటే పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​. దీర్ఘకాలంలో ఫిక్సడ్​ రిటర్నులు పొందేందుకు ఇది ఉత్తమమైన మార్గం. ఇందులో ఎన్నో ట్యాక్స్​ బెనిఫిట్​లు కూడా ఉంటాయి. పైగా.. ఇది ప్రభుత్వ ఆధారిత ఫండ్​ కాబట్టి.. పూర్తిగా భద్రం కూడా!

క్రిప్టో అసెట్స్​:-

How to become wealthy : క్రిప్టో కరెన్సీకి ఆ మధ్యకాలంలో డిమాండ్​ విపరీతంగా పెరిగింది. రిస్క్​ చేయగలను అని అనుకునే వారు.. వారి డబ్బులో కొంత భాగాన్ని క్రిప్టోలో పెట్టుబడి పెట్టవచ్చు. అది కూడా సరైన ప్రణాళికలు ఉండాల్సిందే. 'బై ఆన్​ డిప్​' పద్ధతిని అనుసరించి, నిలకడగా పెట్టుబడులు పెట్టవచ్చు. తక్కువ ధరకు క్రిప్టోలు దొరికితే మంచిదే. కానీ ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొంటే రిస్క్​ ఇంకా ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి.

స్టాక్​ మార్కెట్​:-

తక్కువ కాలంలో ఎక్కువ సంపద సృష్టించి, ధనికులు అయ్యేందుకు స్టాక్​ మార్కెట్​ అనేది అత్యంత ఉత్తమమైన ఆప్షన్​! స్టాక్​ మార్కెట్​తో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవచ్చు.

Stock market investment : గత 20ఏళ్లల్లో.. నిఫ్టీ50 సూచీ.. 14శాతం సీఏజీఆర్​తో వృద్ధిచెందడం విశేషం.

అయితే.. స్టాక్​ మార్కెట్​లో డైరక్ట్​ పెట్టుబడుల కన్నా ముందు.. కాస్త హోం వర్క్​ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి పట్టుసాధిస్తే.. భావి తరం 'రాకేశ్​ ఝున్​ఝున్​వాలా' మీరే..!

(గమనిక: ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇది కేవలం సమాచారం కోసం ప్రచురించిన కథనం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు.. మీ ఫైనాన్షిల్​ఎడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం.)

IPL_Entry_Point

సంబంధిత కథనం