How to open NPS account : ఎన్పీఎస్ ఖాతా ఓపెన్ చేయడం ఎలా?
06 February 2024, 12:29 IST
- How to Open NPS Account : ఎన్పీఎస్ ఖాతా తెరవాలని చూస్తున్నారా? మీకు ఆ ప్రాసెస్ తెలియదా? అయితే ఇది మీ కోసమే..
ఎన్పీఎస్ ఖాతా ఓపెన్ చేయడం ఎలా?
How to Open NPS Account : ప్రభుత్వం మద్దతున్న ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్)కు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. ఈక్విటీ, డెట్‌లో పెట్టుబడుల కారణంగా దీర్ఘకాలంలో ఇందులో మంచి రిటర్నులు వస్తాయని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎన్పీఎస్ ఖాతాను ఓపెన్ చేయడం ఎలా? అన్న వివరాలను ఓసారి తెలుసుకుందాము.
ఎన్పీఎస్ అకౌంట్..
ఎన్పీఎస్ ఖాతా రెండు రకాలుగా ఉంటుంది.
ఎన్పీఎస్ టయర్-1 అకౌంట్:- ఇందులో పెట్టుబడులతో సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. సాధారణంగా ఎన్పీఎస్ అకౌంట్ అంటే రూ. 1.50లక్షల వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఈ తరహా అకౌంట్‌ను తీసుకుంటే.. అదనంగా మరో రూ. 50వేల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. కానీ విత్‌డ్రా సమయంలో పలు నిబంధనలు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
National Pension Scheme account open in Telugu : ఎన్పీఎస్ టయర్- 2 అకౌంట్:- ఇది ఆప్షనల్ రిటైర్మెంట్/ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. టయర్ 1 అకౌంట్ ఉన్న ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. ఇందులో ఎలాంటి విత్‌డ్రా నిబంధనలు ఉండవు.
ఎన్పీఎస్ ఖాతాను తెరవడం ఎలా?
ఎన్పీఎస్ ఖాతాను తెరవడం కోస రెండు మార్గాలు ఉన్నాయి. 1. ఆన్లైన్ 2. ఆఫ్‌లైన్.
ఆన్లైన్ ప్రక్రియ..
స్టెప్ 1:- ముందుగా PFRDA అఫీషియల్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
స్టెప్ 2:- రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ విత్ ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3:- ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వెళుతుంది.
స్టెప్ 4:- ఓటీపీతో పాటు మీ వ్యక్తిగత సమాచారం, నామినీ వివరాలు, బ్యాంక్ వివరాలను నింపాల్సి ఉంటుంది.
Open NPS account in Telugu : స్టెప్ 5:- ఇచ్చిన వివరాలను మళ్లీ చెక్ చేసుకుని సబ్మీట్ చేయాలి. ఆ తర్వాత మీకు పీఆర్ఏఎన్(పర్మనెంట్ రిటైర్మెంట్ అలాట్మెంట్ నెంబర్) అలాట్ అవుతుంది.
స్టెప్ 6:- ఈ- సిగ్నేచర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెళుతుంది.
స్టెప్ 7:- ఓటీపీని ఎంటర్ చేసి, సిగ్నేచర్‌ను వెరిఫై చేయాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి.
NPS withdrawal process పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్‌లైన్ ప్రక్రియ..
స్టెప్ 1:- ఆఫ్‌లైన్‌లో ఎన్పీఎస్ ఖాతాను ఓపెన్ చేసేందుకు సమీపంలోని పీఓపీఎస్(పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్) కార్యాలయానికి వెళ్లాలి. (ఎన్పీఎస్ స్కీమ్ కోసం కస్టమర్లకు సేవలందేంచేందుకు కొన్ని బ్యాంక్‌లు, ఆర్థిక వ్యవస్థలను ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటు చేసింది. వాటిని పీఓపీఎస్ అని పిలుస్తారు.)
స్టెప్ 2:- అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్‌ను తీసుకోవాలి. వివరాలను ఫిల్ చేసి, కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
ఎన్పీఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం ఎలా?
How to login to your NPS account for the first time : ఎన్ఎస్డీఎల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఎన్పీఎస్ అకౌంట్లోకి లాగిన అవ్వొచ్చు. హోం పేజీలో లాగిన్ మెన్యూ వద్ద ఎన్పీఎస్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఎన్పీఎస్కు ప్రత్యేకంగా ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ పీఆర్ఏఎన్, పాస్‌వర్డ్‌ను టైప్ చేసి అకౌంట్లోకి లాగిన అవ్వాల్సి ఉంటుంది.