NPS Withdrawal Process : ఎన్​పీఎస్​ నుంచి నగదును ఉపసంహరించుకోవడం ఎలా?-what is nps withdrawal process what are its rules see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  What Is Nps Withdrawal Process, What Are Its Rules, See Full Details Here

NPS Withdrawal Process : ఎన్​పీఎస్​ నుంచి నగదును ఉపసంహరించుకోవడం ఎలా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 03, 2022 11:58 AM IST

What is NPS withdrawal process : ఎన్​పీఎస్​ నుంచి నగదును ఉపసంహరించుకోవాలని చూస్తున్నారా? మీకు ఆ ప్రక్రియ తెలియదా? అయితే ఇది మీ కోసమే..

ఎన్​పీఎస్​ నుంచి నగదును ఎలా ఉపసంహరించుకోవాలి?
ఎన్​పీఎస్​ నుంచి నగదును ఎలా ఉపసంహరించుకోవాలి?

What is NPS withdrawal process : నేషనల్​ పెన్షన్​ సిస్టమ్​(ఎన్​పీఎస్​)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం మద్దతున్న ఎన్​పీఎస్ పెన్షన్​ ప్లాన్​లో పెట్టుబడుల ప్రవాహం.. ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఈక్విటీ, డెట్​ ఆప్షన్లు కలిగి ఉండటంతో ఈ ఎన్​పీఎస్​ స్కీమ్​ మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే.. కొన్ని కారణాల వల్ల ఎన్​పీఎస్​ నుంచి అత్యవసరంగా నగదును విత్​డ్రా చేయాల్సి వస్తుంది. ఎన్​పీఎస్​ నుంచి నగదు ఉపసంహరణ ప్రక్రియ, నిబంధనల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

ఎన్​పీఎస్​ నగదు ఉపసంహరణ నిబంధనలు..

పాక్షికంగా నగదును ఉపసంహరించుకోవాలంటే..

కొన్ని అనారోగ్య సమస్యలకు చికిత్స, ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, పిల్లల పైచదువుల కోసమే.. పాక్షికంగా నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం..

  • పాక్షికంగా నగదును ఉపసంహరించుకోవాలంటే కనీసం 3ఏళ్లు అయినా ఎన్​పీఎస్​లో ఖాతా ఉండాలి.
  • 25శాతం నగదును మాత్రమే ఉపసంహరించుకోగలరు.

రిటైర్మెంట్​ కోసం..

  • NPS Withdrawal : ఎన్​పీఎస్​ ద్వారా జమ అయిన కార్పస్​ మొత్తం విలువ రూ. 2లక్షల లేదా అంత కన్నా తక్కువగా ఉంటే.. మొత్తం ఫండ్​ను ఉపసంహరించుకోవచ్చు.
  • కార్పస్​ విలువ రూ. 2లక్షలు దాటితే.. ఇందులో 40శాతం యాన్యుటీ ప్లాన్ కొనుగోలుకు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన నగదును లంప్​సమ్​ రూపంలో ఉపసంహరించుకోవచ్చు. లేదా.. 70ఏళ్లు వచ్చేంత వరకు కూడా ఎదురుచూడవచ్చు.

వాలంటరీగా తప్పుకుంటే..

సబ్​స్క్రైబర్లు.. వాలంటరీగా ఎన్​పీఎస్​ నుంచి తప్పుకోవచ్చు. అయితే..

  • కనీసం 10ఏళ్లు అయినా ఎన్​పీఎస్​ ఖాతా​ను హోల్డ్​ చేసి ఉండాలి.
  • కార్పస్​ విలువ రూ. 1లక్ష లేదా అంత కన్నా తక్కువగా ఉంటే.. పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
  • కార్పస్​ విలువ రూ. 1లక్ష దాటితే.. 80శాతం అమౌంట్​ అనేది యాన్యుటీ ప్లాన్​ కొనుగోలుకు వెళుతుంది.

ఎన్​పీఎస్​ నుంచి నగదు ఉపసంహరణ ప్రక్రియ..

NPS Withdrawal process : ఈ ప్రక్రియ.. టయర్​-1 అకౌంట్​కు, టయర్​-2 అకౌంట్​కు వేరువేరుగా ఉంటుంది.

టయర్​-1 అకౌంట్​:-

ఆన్​లైన్​ మోడ్​:

స్టెప్​-1 : NSDL- CRA అఫీషియల్​ వెబ్​సైట్​కు వెళ్లాలి.

స్టెప్​-2 : మీ యూజర్​ ఐడీ(పీఆర్​ఏఎన్​), పాస్​వర్డ్​ను టైప్​ చేసి లాగిన్​ అవ్వాలి.

స్టెప్​-3 : ట్రాన్సాక్ట్​ ఆన్​లైన ట్యాబ్​లో విత్​డ్రావెల్​ ఆప్షన్​ను క్లిక్​ చేయాలి.

స్టెప్​-4 : ఉన్న ఆప్షన్స్​లో 'పార్షియల్​ విత్​డ్రావెల్​ ఫ్రం టయర్​-1' ను ఎంచుకోవాలి.

స్టెప్​-5 : పీఆర్​ఏఎన్​ను చూసి.. సబ్మీట్​ చేయాలి.

స్టెప్​-6 : నగదును ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? ఎంత నగదును బయటకు తీస్తున్నారు(పర్సెంటేజ్​లో)? వంటివి చెప్పాలి.

స్టెప్​-7 : సబ్మీట్​ మీద క్లిక్​ చేయాలి.

How to withdraw money from NPS : దీని తర్వాత.. ఓ ఫామ్​ వస్తుంది. ఈ ఫామ్​ను.. ఒరిజినల్​ ప్రాన్​ కార్డ్​, కేవైసీ డాక్యుమెంట్లు, అకౌంట్​ హోల్డర్​ సంతకం చేసి రెవెన్యూ స్టాంప్​తో కూడిన అడ్వాన్స్​ స్టాప్​ రెసిప్ట్​, బ్యాంక్​ లెటర్​హెడ్​, బ్యాంక్​ పాస్​బుక్​, కన్సిల్​ చేసిన చెక్​, బ్యాంక్​ ఐఎప్​ఎస్​సీ కోడ్​, అండర్​టేకింగ్​ ఫామ్​తో కలిపి.. నోడల్​ ఆఫీసర్​కు సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది.

అఫ్​లైన్​ మోడ్​:-

సంబంధిత ఫామ్​ను డౌన్​లోడ్​ చేసుకుని, వివరాలను రాసి, సంబంధిత డాక్యుమెంట్లతో జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. సమీపంలోని ప్రిసెనస్​ సర్వీస్​ ప్రొవైడర్(పీఓపీ/పీఓపీ- ఎస్​పీ)​ వద్ద ఫామ్​ను సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది.

టయర్​ 2 నగదు ఉపసంహరణ ప్రక్రియ..

ఆఫ్​లైన్​ మోడ్​లో నగదును ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం.. యూఓఎస్​-ఎస్​12 ఫామ్​ను నింపి.. సంబంధిత పత్రాలతో జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పీఓపీ-ఎస్​పీకి సబ్మీట్​ చేయాలి. మూడు రోజుల్లోగా నగుదు మీ చేతికి వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం