NPS : 'ఎన్పీఎస్'తో మీ పెన్షన్ ప్లాన్ పదిలం- రిస్క్ తక్కువ.. రిటర్నులు ఎక్కువ!
06 August 2022, 10:37 IST
- NPS scheme : రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం చాలా మంది.. ముందు నుంచే ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వారికోసమే ఈ ఎన్పీఎస్. ఇందులో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి.
'ఎన్పీఎస్'తో మీ పెన్షన్ ప్లాన్ పదిలం- స్కీమ్‌తో ప్రయోజనాలెన్నో! (MINT)
'ఎన్పీఎస్'తో మీ పెన్షన్ ప్లాన్ పదిలం- స్కీమ్‌తో ప్రయోజనాలెన్నో!
NPS scheme : నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం మద్దతున్న ఎన్పీఎస్ పెన్షన్ ప్లాన్‌లో పెట్టుబడుల ప్రవాహం.. ఇటీవలి కాలంలో పెరిగింది. ఈక్విటీ, డెట్ ఆప్షన్లు కలిగి ఉండటంతో ఈ ఎన్పీఎస్ స్కీమ్ మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎన్పీఎస్ పెన్షన్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న ఐదు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
ట్రెండింగ్ వార్తలు
- పెట్టుబడిలో స్వేచ్ఛ:- ఏడాదిలో ఒకసారి ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి చేయవచ్చు. లేదా.. నెలనెల కూడా డబ్బులు కట్టవచ్చు. టైర్ 1 కు రూ. 500, టైర్ -2 ఖాతాలకు రూ. 1000 మినిమమ్ లిమిట్‌గా ఉంది. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడుల మొత్తాన్ని మార్చుకోవచ్చు.
- పెట్టుబడులు పదిలం:- ఎన్పీఎస్కు ప్రభుత్వం మద్దతిస్తుండటం ఈ స్కీమ్‌కు అతిపెద్ద ప్రయోజనం. డబ్బులు నష్టపోతామన్న భయం అవసరం ఉండదు. పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షణ ఉండటంతో.. స్కీమ్‌కు మరింత పారదర్శకత లభిస్తుంది. అంతేకాకుండా.. మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. మరో 6-8 నెలల్లో కొత్త ప్రాడక్టు తీసుకొచ్చేందుకు ఎన్పీఎస్ ప్రయత్నిస్తోంది. రిటర్నులపై మరింత కచ్చితత్వంతో ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలుస్తోంది. అయితే.. మీరు దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఒకటే ఎన్పీఎస్ ఖాతా ఉంటుంది. హైదరాబాద్‌లో ఖాతా ఓపెన్ చేసి, ముంబైలో ఉద్యోగం కోసం వెళ్లినా.. ఏమీ మారదు. ఒకటే ఎన్పీఎస్ ఖాతా ఉంటుంది.
- ఫండ్ మేనేజర్:- పెట్టుబడి పెట్టిన తర్వాత.. ఆ నగదు ఎక్కడికి వెళ్లాలి? ఎవరు మేనేజ్ చేయాలి? అన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. మీ ఫండ్ మేనేజర్ పనితీరు పట్ల మీరు అసంతృప్తిగా ఉంటే.. మార్పులు చేసుకోవచ్చు. ఏడాదికి ఓసారి మీ ఫండ్ మేనేజర్‌ను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. వయస్సుకు తగ్గట్టు మీ రిస్క్ ఆఫ్షన్లు కూడా ఏడాదికోసారి మార్చుకోవచ్చు.
- ట్యాక్స్ బెనిఫిట్:- ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి ద్వారా రూ. 2లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. అయితే.. నెలవారీ పెన్షన్‌పై వార్షికంగా ట్యాక్స్ పడుతుంది.
- రిటైర్మెంట్ తర్వాత ప్రతినెల కచ్చితంగా ఆదాయం:- రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ స్కీమ్ నుంచి 60శాతం కార్పస్‌ను లంప్సమ్గా వెనక్కి తీసుకోవచ్చు. ఇది ట్యాక్స్ ఫ్రీ. అన్యూనిటీ ప్లాన్‌కు మరో 40శాతం వెళుతుంది. ఇలా రిటైర్మెంట్ తర్వాత నెలకు కచ్చితమైన ఆదాయం లభించే అవకాశం ఉంది.