తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nps-traders Pension Scheme | దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారికి పెన్షన్ స్కీం

NPS-Traders Pension Scheme | దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారికి పెన్షన్ స్కీం

03 January 2022, 19:55 IST

    • NPS-Traders Pension Scheme కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సామాజిక భద్రతా పథకంగా దుకాణదారులు, వ్యాపారులు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందుతున్న వారికి పెన్షన్ లభించేలా నేషనల్ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్ - ట్రేడర్స్) రూపొందించింది. ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు వచ్చాక పెన్షన్ పొందవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం: దుకాణాదారులు, ట్రేడర్ల కోసం పెన్షన్ స్కీమ్ (pc: unsplash)
ప్రతీకాత్మక చిత్రం: దుకాణాదారులు, ట్రేడర్ల కోసం పెన్షన్ స్కీమ్ (pc: unsplash) (unsplash)

ప్రతీకాత్మక చిత్రం: దుకాణాదారులు, ట్రేడర్ల కోసం పెన్షన్ స్కీమ్ (pc: unsplash)

జీవిత బీమా సంస్థ, సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సంస్థల సహకారంతో కేంద్ర కార్మిక శాఖ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్ - ట్రేడర్స్) పథకాన్ని నిర్వహిస్తోంది. జీవిత బీమా సంస్థ పెన్షన్ అందించే బాధ్యత తీసుకుంటుంది. అలాగే ఫండ్ మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

నేషనల్ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్ - ట్రేడర్స్) ప్రత్యేకతలు:

1. ఇది స్వచ్ఛంద, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం

2. లబ్ధిదారుని ప్రవేశ వయస్సును బట్టి నెలవారీ కంట్రిబ్యూషన్ రూ.  55 నుంచి రూ. 200 వరకు ఉంటుంది.

3. లబ్ధిదారుడు 50% నెలవారీ కంట్రిబ్యూషన్ చెల్లిస్తే సమాన మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

నేషనల్ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్ - ట్రేడర్స్) అర్హతలు

1. భారతదేశ పౌరుడు అయి ఉండాలి.

2. దుకాణదారులు, చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఏజెంట్లు తదితరులు

3. 18-40 సంవత్సరాల వయస్సు ఉండాలి.

4. ఈపీఎఫ్‌వో / ఈఎస్‌ఐసీ / పీఎం-ఎస్‌వైఎమ్) లో కవర్ అయి ఉండరాదు.

5. వార్షిక టర్నోవర్ రూ. 1.5 కోట్లకు మించరాదు.

నేషనల్ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్ - ట్రేడర్స్) ప్రయోజనాలు

1. ఈ పథకం కింద లబ్ధిదారులు 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కనీస నెలవారీ బీమా పెన్షన్ రూ. 3,000 పొందడానికి అర్హులు అవుతారు.

2. లబ్ధిదారుడు మరణిస్తే భార్య లేదా భర్త 50 శాతం మేర ఫ్యామిలీ పెన్షన్ పొందుతారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మాన్‌ధన్ వెబ్‌ పోర్టల్‌లో గానీ, సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లు లేదా డిజిటల్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతా తదితర వివరాలు అవసరమవుతాయి.

ఒకవేళ ఈ పెన్షన్ స్కీమ్ నుంచి వైదొలగాలనుకుంటే, ఎన్‌రోల్ చేసుకుని పదేళ్ల లోపు మాత్రమే అయితే మీరు చెల్లించిన చందాకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ఆధారంగా వడ్డీ లెక్కగట్టి వెనక్కి ఇస్తారు. ప్రభుత్వ చందాను ఇవ్వరు.

ఒక వేళ ఖాతా తెరిచి పదేళ్లు దాటి, వయస్సు 60 లోపు ఉంటే, ఫండ్ ద్వారా వచ్చిన ఆదాయం లేదా పొదుపు ఖాతా వడ్డీ రేటు లెక్కించి ఏది అధికంగా ఉంటే అది చెల్లిస్తారు.