తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Icse Results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

06 May 2024, 11:23 IST

    • ICSE, ISC Results 2024: ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్​సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్​సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల
ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్​సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల (Santosh Kumar )

ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్​సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల

ICSE 10th class results 2024 : సీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్​సీఈ). ఈ ఏడాది.. మొత్తం 2,43,617 మంది ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,42,328 మంది పాస్​ అయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్​ 12 పరీక్ష రాసిన 99,901 మంది విద్యార్థుల్లో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే.. ఐసీఎస్​ఈ పాస్​ పర్సెంటేజ్​ 99.47శాతం. ఐఎస్​సీ పాస్​ పర్సెంటేజ్​ 98.19శాతం.

ఐసీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాల్లో 99.65శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. 99.31శాతం మంది అబ్బాయిలు పాస్​ అయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు 2024ల 98.92శాతం మంది అమ్మాయిలు, 97.53శాతం మంది అబ్బాయిలు పాస్​ అయ్యారు.

క్లాస్​ 10, క్లాస్​ 12 ఫలితాలను చెక్​ చేసుకోవడానికి కావాల్సిన లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలను ఇలా చెక్​ చేసుకండి..

స్టెప్​ 1:- సీఐఎస్సీఈ - www.cisce.org అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

ISC class 12 results 2024 check online : స్టెప్​ 2:- ఫలితాల పేజీకి వెళ్లి, ఐసీఎస్​ఈ బోర్డు పరీక్షల ఫలితాలు 2024 లేదా ఐఎస్సీ బోర్డు పరీక్షల ఫలితాలు 2024 పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3:- ఐసీఎస్​ఈ / ఐఎస్సీగా కోర్సు కోడ్​ను ఎంచుకోండి. గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ వంటి మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.

ISC class 12 results 2024 : స్టెప్​ 4:- ఫలితాలను ఇప్పుడు స్క్రీన్​పై ప్రదర్శిస్తారు.

స్టెప్​ 5:- ఫలితాలను డౌన్​లోడ్ చేసుకోండి. ప్రింట్ అవుట్ తీసుకోండి.

డిజీలాకర్​లో ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:-  https://results.digilocker.gov.in లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- సీఐఎస్​సీఈ సెక్షన్​తో కూడిన డిజీలాకర్​ ల్యాండిగ్​ పేజ్​ కనిపిస్తుంది.

స్టెప్​ 3:- ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్​సీ క్లాస్​ 12 బటన్​ మీద ప్రెస్​ చేయండి.

స్టెప్​ 4:- ఇండెక్స్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ టైప్​ చేయండి

స్టెప్​ 5:- సబ్మీట్​ బటన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 6:- స్క్రీన్​ మీద కనిపించే మీ ఫలితాలను చెక్​ చేసుకోండి.

CISCE results 2024 : విద్యార్థులకు రీ-చెకింగ్, రీ- ఇవాల్యుయేషన్​​ వెసులుబాటును కల్పిస్తుంది సీఐఎస్​సీఈ. ఒక్కో సబ్జెక్ట్​కి రీ-చెకింగ్​కి రూ. 1000, రీ- ఇవాల్యుయేషన్​కి రూ. 1,500 చెల్లించాలి.

ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ కంపార్ట్​మెంట్​ పరీక్షలను డిస్కంటిన్యూ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు విద్యార్థులు, గరిష్ఠంగా రెండు సబ్జెక్ట్స్​లో ఇంప్రూవ్​మెంట్​ పరీక్షలు రాసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం సీఐఎస్​సీఈ వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చ్​ 28 వరకు, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. ఫిబ్రవరి 26న జరగాల్సిన 12వ తరగతి కెమిస్ట్రీ పరీక్షను రీషెడ్యూల్ చేసి మార్చ్​ 21న నిర్వహించారు.

తదుపరి వ్యాసం