Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్‌పై స్పందించిన యూపీ క్లాస్ 10 టాపర్
Prachi Nigam UP topper : యూపీ క్లాస్ 10 టాపర్ ప్రాచీ నిగమ్.. తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. వాటిని పట్టించుకోనని తేల్చిచెప్పింది. ఈ విషయంలో ప్రాచీ తల్లిదండ్రులు కూడా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు.
Prachi Nigam trolled : ఉత్తర్ ప్రదేశ్ క్లాస్ 10 బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్‌పై ఇటీవలి కాలంలో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆమె ముఖ వెంట్రుకలను చూసి చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది ఆమెను ఎగతాళి చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా ప్రాచీ నిగమ్ స్పందించింది. చాలా మంది.. తనకు మద్దతుగా నిలిచారని, వారందరికి కృతజ్ఞతలు చెప్పింది.
‘చాణక్యుడిని కూడా..’
'యూపీ ఫలితాలు వెలువడినప్పుడు నా ఫొటో వైరల్ అయింది. చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. అదే సమయంలో నాకు సపోర్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు,' ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిగమ్ పేర్కొన్నారు.
“దేవుడు నన్ను ఎలా సృష్టిస్తే, నేను దానికి కట్టుబడి ఉంటాను. నాలో ఏదో తేడా ఉందని భావించినా నేను పట్టించుకోను. నాకు పర్లేదు. చాణక్యుడిని కూడా చాలా మంది ట్రోల్ చేశారు. ఆయన పట్టించుకోలేదు. అలాగే నేను కూడా పట్టించుకోను, చదువుపై దృష్టి పెడతాను,” అని యూపీ క్లాస్ 10 టాపర్ ప్రాచీ నిగమ్ చెప్పింది.
ఇదీ చూడండి:- ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్ఈ ఫలితాలు- ఇలా చెక్ చేసుకోండి..
Prachi Nigam UP class 10 topper : బీబీసీకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో నిగమ్ మాట్లాడుతూ.. 'నాకు కొన్ని తక్కువ మార్కులు వచ్చి ఉంటే టాపర్‌గా నిలిచి ఫేమస్ అయ్యేదానిని కాదు. ఫేమస్ అవ్వకపోయుంటే బహుశా ఇంకా బాగుండేది. నేను చాలా కాలంగా దీనిని ఎదుర్కొంటున్నాను. కాబట్టి పరిస్థితి గురించి నేను పెద్దగా పట్టించుకోను. జుట్టు ఉన్న అమ్మాయిలను చూసి ప్రజలు వింతగా ఫీలవుతారు. ఎందుకంటే వారు ఇంతకు ముందు దీనిని చూడలేదు," అని అంది.
ప్రాచీ నిగమ్‌కు ముఖంపై జుట్టు ఉండటానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణమని తెలుస్తోంది. చాలా మంది ఇదే విషయంపై తనను సంప్రదించారని ప్రాచీ నిగమ్ పేర్కొంది.
Prachi Nigam latest news : బీబీసీతో ప్రాచీ నిగమ్ తల్లి మమత మాట్లాడుతూ.. 'ప్రజలు ఆమెను ట్రోల్ చేసినప్పుడు, నేను దాని గురించి బాధపడ్డాను. చాలా మంది ఆమె గురించి చెడుగా మాట్లాడారు. అది ఆమె మనసుపై భారం పడనివ్వొద్దని ప్రాచీకి చెప్పాం," అని తన కూతురుకు అండగా నిలిచారు.
తన కూతురు ఎదుర్కొన్న ట్రోలింగ్‌పై యూపీ క్లాస్ 10 టాపర్ ప్రాచీ నిగమ్ తండ్రి విచారం వ్యక్తం చేశారు. విజయాలు సాధిస్తున్న విద్యార్థులను ఎగతాళి చేయకుండా వారికి సపోర్ట్ చేయాలని ఆయన అభిప్రాపడ్డారు.
సంబంధిత కథనం