ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..-icse isc board exam results 2024 will class 10 12 results be out next month ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Icse Exam Results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Apr 28, 2024 10:25 AM IST

ICSE exam results 2024 date : ఐసీఎస్ఈ, ఐఎస్సీ ఫలితాలు 2024 త్వరలో విడుదలవ్వనున్నాయి. గత ఏడాది 2023లో 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు మే 12న విడుదలయ్యాయి.

ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ 12 ఫలితాలు త్వరలో విడుదలవ్వనున్నాయి..
ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ 12 ఫలితాలు త్వరలో విడుదలవ్వనున్నాయి..

ICSE 10th result 2024 date and time : ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ). ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు తమ 10, 12వ తరగతి స్కోర్లను.. results.cisce.org లో చెక్​ చేసుకోవచ్చు. ఐసీఎస్​ఈ ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారు? అన్న విషయంపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ మే మొదటి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గత ఏడాది 2023లో.. 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు మే 13న విడుదలయ్యాయి.

ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 28 వరకు, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న జరగాల్సిన 12వ తరగతి కెమిస్ట్రీ పరీక్షను రీషెడ్యూల్ చేసి మార్చి 21న నిర్వహించారు.

మీ ఐసిఎస్ఇ 10 వ తరగతి, ఐఎస్సి 12 వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- సీఐఎస్సీఈ - www.cisce.org అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

ISC class 12 results 2024 date : స్టెప్​ 2:- ఫలితాల పేజీకి వెళ్లి, ఐసీఎస్​ఈ బోర్డు పరీక్షల ఫలితాలు 2024 లేదా ఐఎస్సీ బోర్డు పరీక్షల ఫలితాలు 2024 పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3:- ఐసీఎస్​ఈ / ఐఎస్సీగా కోర్సు కోడ్​ను ఎంచుకోండి. గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ వంటి మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.

స్టెప్​ 4:- ఫలితాలను ఇప్పుడు స్క్రీన్​పై ప్రదర్శిస్తారు.

స్టెప్​ 5:- ఫలితాలను డౌన్​లోడ్ చేసుకోండి. ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఐసీఎస్​ఈ క్లాస్​ 10, 12 ఫలితాలు 2023..

2023లో 10 వ తరగతిలో ఉత్తీర్ణత శాతం 98.94గా ఉంది. 12వ తరగతిలో ఇది 96.93 శాతంగా నమోదైంది. ఐసీఎస్​ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో బాలురు కంటే బాలికలే పైచేయి సాధించారు. పదో తరగతిలో బాలికల ఉత్తీర్ణత 99.21 శాతంగా ఉంది. కాగా బాలురు ఉత్తీర్ణత 98.71 శాతంగా ఉంది. 12వ తరగతిలో బాలికల ఉత్తీర్ణత 98.01 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత 95.96 శాతంగా ఉంది.

సీబీఎస్ ఈ 10, 12వ తరగతి ఫలితాలుమే మొదటి వారంలో వెలువడే అవకాశం ఉందని మీడియా నివేదికలు వెల్లడించాయి. 2023లో సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు మే 12న విడుదలయ్యాయి. పదో తరగతి ఉత్తీర్ణత 93.12 శాతం కాగా, 12వ తరగతి ఉత్తీర్ణత 87.33 శాతంగా నమోదైంది.

సీబీఎస్​ఈ ఫలితాలు 2024 కూడా..

CBSE results 2024 : సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు, సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థుల నిరీక్షణ కొనసాగుతోంది. ఫలితాల విడుదలపై సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్జ్యుకేషన్​ సీబీఎస్​ఈ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత ట్రెండ్స్​ని పరిశీలిస్తే.. సీబీఎస్​ఈ ఫలితాలు.. ఏప్రిల్​- మేలో విడుదలవుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం