Layoffs: లేఆఫ్స్ కష్టాలు.. అమెరికాలో భారతీయుల వెతలు.. ఉద్యోగాల వేట, వాట్సాప్ గ్రూప్‍లు-layoffs hit indian it professionals struggle to stay in us h1b l1 visa holders musk need find jobs ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Layoffs Hit Indian It Professionals Struggle To Stay In Us H1b L1 Visa Holders Musk Need Find Jobs

Layoffs: లేఆఫ్స్ కష్టాలు.. అమెరికాలో భారతీయుల వెతలు.. ఉద్యోగాల వేట, వాట్సాప్ గ్రూప్‍లు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 23, 2023 05:09 PM IST

Layoffs effect on Indian IT Professionals: అమెరికాలోని సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొత్త ఉద్యోగం దొరకకపోతే దేశాన్ని విడిచిరావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. వివరాలివే..

Layoffs: లేఆఫ్స్ కష్టాలు.. అమెరికాలో భారతీయుల వెతలు
Layoffs: లేఆఫ్స్ కష్టాలు.. అమెరికాలో భారతీయుల వెతలు (HT_Photo)

Layoffs effect on Indian IT Professionals: అమెరికాలోని దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‍బుక్, అమెజాన్‍ లాంటి సంస్థలు తాజాగా లేఆఫ్స్ ప్రకటించాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. వీటితో పాటు అమెరికాలో అనేక సంస్థలు ఎంప్లాయిస్‍కు ఉద్వాసన పలికాయి. అయితే ఈ లేఫ్స్ కారణంగా ఎక్కువగా ప్రభావితమైంది భారత ఐటీ ఉద్యోగులేనని తేలింది. ప్రస్తుతం వర్క్ వీసాతో అమెరికాలో ఉంటూ ఉద్యోగం కోల్పోయిన ఇండియన్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పూర్తి వివరాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు

30శాతం మంది భారతీయులే

Layoffs effect on Indian IT Professionals: గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికాలోని సంస్థలు సుమారు 2లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించాయని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టు వెల్లడించింది. ఇందులోనే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‍బుక్, అమెజాన్ ఉన్నాయి. అయితే ఇందులో 30 నుంచి 40 శాతం వరకు భారత ఐటీ ఉద్యోగులే ఉన్నారని తెలుస్తోంది. ఉద్యోగాల కోల్పోయిన వారిలో.. హెచ్‍-1బీ (H-1B), ఎల్‍1 (L1) వీసాలతో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా ఉందని తెలుస్తోంది.

అమెరికాలో ఉండాలంటే ఉద్యోగం కావాల్సిందే..

Layoffs effect on Indian IT Professionals: హెచ్‍-1బీ, ఎల్1లు.. వర్క్ వీసాలు. అమెరికాలో ఉండాలంటే ఈ వీసాలపై వెళ్లిన వారికి ఉద్యోగం ఉండాల్సిందే. హెచ్‍1-బీ వీసాపై అమెరికాలో ఉంటూ ఉద్యోగం కోల్పోయిన వారికి సమస్య మరింత తీవ్రంగా ఉంది. 60 రోజులలోపు వీరు కొత్త ఉద్యోగాన్ని దక్కించుకోవాలి. లేనిపక్షంలో వీసాను మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం దక్కించుకోకపోతే.. తదుపరి 10 రోజుల్లోగా అమెరికాను విడిచివెళ్లాలి. దీంతో రెండు నెలల్లోగా అమెరికాలో కొత్త ఉద్యోగం దక్కించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

వాట్సాప్ గ్రూప్‍లతో..

Layoffs effect on Indian IT Professionals: అమెరికాలోని భారతీయ ఉద్యోగులు వాట్సాప్ గ్రూప్‍లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కఠిన పరిస్థితులకు పరిష్కారాన్ని కనుగొనేందుకు అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఓ వాట్సాప్ గ్రూప్‍లో 800 మందికి పైగా భారతీయ ఐటీ వర్కర్లు ఉన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల ఖాళీల గురించిన సమాచారాన్ని ఆ గ్రూప్‍లో పోస్ట్ చేస్తున్నారు.

ఇక మరో గ్రూప్‍లో వీసా ఆప్షన్‍లకు సంబంధించిన సమాచారాన్ని భారతీయులు షేర్ చేసుకుంటున్నారు. కొందరు ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా వారికి ఉచితంగా కన్సెల్టెన్సీ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నారు. “ఈ దేశానికి వలస వచ్చిన మాకు ఈ పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. టెన్షన్‍తో నరాలు తెగిపోతున్నాయి. చాలా నష్టపోతున్నాం” అని మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన ఓ భారతీయుడు చెప్పారు.

గ్లోబల్ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (GITPRO), ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియా డిసపోరా స్టడీస్ (FIIDS) సంస్థలు.. భారతీయ ఐటీ వర్కర్లకు సాయం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఉద్యోగ ఖాళీలు ఉన్న సంస్థలకు భారత ఐటీ వర్కర్ల సమాచారాన్ని చేరవేస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని ఇస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం