How to save money with low income : తక్కువ జీతంతోనూ డబ్బును పొదుపు చేయండిలా!
How to save money with low income : మీకు రూ. 20వేల జీతం వస్తోందా? తక్కువ జీతంతో సేవింగ్స్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. తక్కువ జీతంతో సేవింగ్స్ చేసేందుకు పాటించాల్సిన టిప్స్ మీకోసం.
How to save money with low income : "మాకు వచ్చే తక్కువ జీతంతో నెలను గపడమే చాలా కష్టం. ఇక సేవింగ్స్ ఆలోచనే రాదు!" అని చాలా మంది మధ్యతరగతి ప్రజలు భావిస్తుంటారు. కానీ తక్కువ జీతంతో సేవ్ చేయడం అనేది అంత పెద్ద కష్టమేమీ కాదు. వాస్తవానికి జీతం చిన్నదైనా, పెద్దదైనా.. దానిని ఖర్చు చేస్తున్న విధానంతోనే మనం డబ్బులను వెనకేసుకుంటామా లేదా అన్నది తెలుస్తుంది. మన బడ్జెట్‌ను సరిగ్గా ప్లాన్ చేసి, అమలు చేస్తే సరిపోతుంది. అప్పుడు రూ. 10తో మీరు మొదలుపెట్టే సేవింగ్స్.. రూ. 100 అవుతాయి, రూ. 1000 అవుతాయి. వాటికి ‘ఇన్వెస్ట్మెంట్’ టచ్ ఇస్తే.. అవి రూ. లక్ష కూడా అవుతాయి. మరి తక్కువ జీతంతో సేవింగ్స్ చేయడం కోసం పాటించాల్సిన కొన్ని టిప్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాము..
బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్..
'బడ్జెట్' అన్న పదం సామాన్యుడి జీవితంలో చాలా ముఖ్యం. ప్రతి దానికి ఓ బడ్జెట్ వేసుకోవాలి. మన అవసరాలకు అయ్యే ఖర్చులు, పొదుపు చేయాల్సిన డబ్బుల విషయాల్లో చేయాల్సిన ఖర్చులు వంటివి ముందే ప్లాన్ చేసుకోవాలి. మన ఖాతాలో నెల జీతం పడడానికి 1,2 రోజుల ముందే ఈ ప్లాన్ వేసుకోవడం శ్రేయస్కరం.
How to save money with less salary : అయితే.. పేపర్లో బడ్జెట్‌ను రాసుకుంటే సరిపోదు! దానిని అమలు చేయాలి కూడా. చాలా మంది.. రాసుకుంటారు కానీ పాటించారు. మీరు కూడా అలాగే ఉంటే దీర్ఘకాలంలో మీ కుటుంబానికి ద్రోహం చేసిన వారు అవుతారు. అందుకే.. ఓ బడ్జెట్‌ను తయారు చేసుకుని దానికి తగ్గట్టుగా ఖర్చులు చేయండి.
సేవింగ్స్‌తోనే బంగారు భవిష్యత్తు!
బడ్జెట్ అనేది మన జీవితాల్లో ఓ ముఖ్యమైన పదం అని అనుకుంటే.. ఈ 'సేవింగ్స్' అనేది మన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది! సేవింగ్స్ చాలా అవసరం. నెల జీతం పడిన వెంటనే.. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, రెంట్ అంటూ.. డబ్బులు పంపించేస్తాము. అదే విధంగా.. సేవింగ్స్‌ను కూడా ఓ బిల్లులాగా భావించి.. వెంటనే పక్కన పెట్టేయాలి. 'ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత.. ఏదైనా మగిలితే అప్పుడు సేవ్ చేద్దాం' అన్న ధోరణ మంచిది కాదు. అది ఒక్క రూపాయి అయినా, లేదా 10 రూపాయలు అయినా.. ముందు సేవ్ చేయాల్సిందే. నెమ్మదిగా సేవింగ్స్ ఖాతాను పెంచుకోవచ్చు.
Types of savings account : సేవింగ్స్ అకౌంట్ ఎన్ని రకాలు? వాటి ఉపయోగాలేంటి? వంటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
How to save money to buy a house : ఎలాంటి లక్ష్యాలు లేకుండా సేవ్ చేస్తే.. కొంతకాలానికి మొత్తానికే ఆపేసే ప్రమాదం ఉంటుంది. అందుకే.. సేవింగ్స్ కోసం కూడా ఓ లక్ష్యం పెట్టుకోండి. పిల్లల చదువు కోసం పొదుపు, పిల్లల పెళ్లిళ్ల కోసం సేవింగ్స్ వంటి గోల్స్ మీ ముందు ఉంటే.. ఖచ్చితంగా సేవ్ చేయాలని మీకు గుర్తుంటుంది.
అనవసర ఖర్చులు తగ్గించుకోండి..!
భారతీయుడు తన రోజువారీ జీతంలో సగటు 3.5శాతం తిండికే ఖర్చు చేస్తాడు! అమెరికలో అది 0.6శాతంగా ఉంది. ఈ వివరాలను 'కాస్ట్ ఆఫ్ ఎ ప్లేట్ ఆఫ్ ఫుడ్' అనే పేరుతో యూఎన్ వరల్డ ఫుడ్ ప్రోగ్రామ్.. కొన్ని నెలల క్రితం చేసిన సర్వేలో తేలింది.
Financial tips to save money : ఒక్క తిండి విషయమనే కాదు. కొన్నిసార్లు మనం మన జీవనశైలిని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, అది నిజంగానే అవసరమా? అన్నది ఆలోచించుకోవాలి. బిందాస్‌గా ఖర్చులు చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి.
కొన్ని నెలలు మన స్టాండర్డ్స్‌ను తగ్గించుకుని సేవింగ్స్ చేస్తే.. భవిష్యత్తులో కచ్చితంగా ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తక్కువ జీతం వస్తున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. అనవసరమైన సబ్స్క్రిప్షన్స్, ఖరీదైన ఫోన్లు, ఫోన్ ప్లాన్స్, వినోదానికి అనవసరంగా పెడుతున్న ఖర్చులు వంటివి తగ్గించుకోవచ్చు.
బీమా.. ఎమర్జెన్సీ ఫండ్.. ఇన్వెస్ట్మెంట్..
Financial rules to save money : ఈ కాలంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న సమయాలు.. క్షణాల్లోనే బాధ కలిగించే విధంగా ఉంటాయి. వీటన్నిటి నుంచి మన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే.. బీమా తీసుకోవాల్సిందే. టర్మ్ లైఫ్ ఇన్ష్యూరెన్స్, లైఫ్ ఇన్ష్యూరెన్స్, హెల్త్ ఇన్ష్యూరెన్స్ వంటిపై ఫోకస్ చేయాలి. నేటి టెక్ యుగంలో.. వీటికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో సులభంగా లభిస్తున్నాయి. అన్నింటి కన్నా ముందు ఓ బీమా పాలసీ తీసుకోవడం అత్యావశ్యకం.
కోటీశ్వరులు అవ్వాలన్న మీ కలలను సాకారం చేసుకునేందుకు పాటించాల్సిన టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక తక్కువ జీతంతో సేవింగ్స్ చేస్తూనే.. ఓ ఎమర్జెన్సీ ఫండ్‌ను మెయిన్టైన్ చేయడం ఉత్తమం. బీమా వంటి వాటిల్లో లిక్విడిటీ ఉండదు. మనకు రెండీగా డబ్బు కావాలంటే.. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. అందుకే.. కొంత మొత్తంలో ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అయితే.. ఒక్కోసారి లిక్విడిటీ ఎక్కువ ఉండటం, సులభంగా ఖర్చు పెట్టేందుకు వీలుగా ఉండటం కూడా సరైన విషయం కాదు. అందుకే.. ఓ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్స్‌ను వేసి(ఎమర్జెన్సీ ఫండ్ నిధులను మినహాయించి).. ఆ అకౌంట్‌కు యూపీఐ ట్రాన్సాక్షన్ వెసులుబాటును ఇవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే.. బ్యాంక్ ఖాతాలోకి ఇన్కమింగ్ పెరుగుతంది, ఔట్‌గోయింగ్ తగ్గుతుంది.
Tips to invest in stock market : సేవింగ్స్‌తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఉండటం కూడా చాలా అవసరం. ఇన్ఫ్లేషన్ కారణంగా.. ఈరోజు రూ. 10కి దొరుకున్న వస్తువు రేపు రూ. 20, రూ. 30కి కూడా లభించకపోవచ్చు. ఇన్ఫ్లేషన్ భూతం నుంచి బయటపడాలంటే ఇన్వెస్ట్ చేయాల్సిందే. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. రిస్క్ వద్దు అనుకునే వారు.. ప్రభుత్వ ఆధారిత ఫండ్స్ (పీపీఎఫ్, ఎన్పీఎస్)లో పెట్టుబడులు పెట్టవచ్చు.
స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అటు బీమా తీసుకుని, ఇటు ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకుని, ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే చాలా కష్టమైన విషయంగా అనిపిస్తుంది. తొలినాళ్లల్లో ఇలాగే ఉంటుంది. కానీ కొంత కాలం గడిచేసరికి మీకు మీ ఫైనాన్షియల్స్పై పట్టు పెరుగుతుంది. ఆటోమెటిక్‌గా మీరు అవన్నీ చేసేస్తారు!
రూ. 20వేల జీతంతో నెల ఎలా గడపాలి?
How to save money for future : రూ. 20వేల జీతంతో నెల గడపాలంటే బడ్జెటింగ్ రూల్స్‌ను పాటించాల్సిందే. వీటిల్లో "50-20-30" రూల్ చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. అంటే.. మీ జీతంలో 50శాతం డబ్బులు అవసరాలకు ఖర్చు చేయాలి. మరో 30శాతం ఇష్టాల కోసం, మరో 20శాతం సేవింగ్స్, పెట్టుబడుల కోసం కేటాయించాలి. 30శాతం ఇష్టాల కోసం కేటాయించే నిధులను ఇంకాస్త తగ్గించుకుంటే.. మరీ మంచిది!