Types of savings account : సేవింగ్స్ అకౌంట్ ఎన్ని రకాలు? వాటి ఉపయోగాలేంటి?
Types of savings account : దేశంలో చాలా రకాల పొదుపు ఖాతాలు ఉన్నాయి. వాటి గురించి మీకు తెలుసా? మన అవసరాలకు తగ్గట్టు, వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు లబ్ధిచేకూరుతుంది.
Types of savings account : 'సేవింగ్స్'.. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం ఇది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా.. 'నేనున్నాను' అంటూ ధైర్యాన్ని ఇచ్చే పదం ఇది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలని పరిస్థితులివి. సేవింగ్స్ లేకుండా కష్టాలు వస్తే.. ఆ ఒత్తిడిని తట్టుకోవడం ఇంకా కష్టం! అందుకే చాలా మంది జీతాల్లో నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. బ్యాంక్‌కు వెళ్లి సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేస్తారు. వీటిల్లో వడ్డీ తక్కువ వస్తుందని అశ్రద్ధ వహించకూడదు. సేవింగ్స్ వేరు.. పెట్టుబడులను వేరుగా పరిగణించాలి. ప్రస్తుతం దేశంలో చాలా రకాల పొదుపు ఖాతాలు ఉన్నాయి. మన అవసరాలకు తగ్గట్టుగా వాటిని ఎంచుకోవాలి. అలాంటి వివిధ రకాల సేవింగ్స్ అకౌంట్‌ను ఓసారి చూద్దాం.
పొదుపు ఖాతాలు.. రకాలు..
సాధారణ పొదుపు ఖాతా..
షార్ట్ టర్మ్ సేవింగ్స్ కోసం ఈ తరహా అకౌంట్ ఉపయోగపడుతుంది. పెద్దగా వడ్డీ రేట్లను ఆశించని వారు.. ఇలాంటి అకౌంట్లను ఎంచుకుంటారు. సేవింగ్స్, విత్‌డ్రాలను సులభంగా చేసేందుకు ఈ తరహా ఖాతాలు ఉపయోగపడతాయి. దేశంలోని దాదాపు అన్ని రకాల బ్యాంక్‌లు.. ఈ తరహా అకౌంట్‌ను ఇస్తాయి. వీటిల్లో మినిమం డిపాజిట్లు తక్కువగా ఉంటాయి. విత్‌డ్రాలపై డైలీ లిమిట్లు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.
Savings account type : ఆన్లైన్లో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. సమీప బ్యాంక్ బ్రాంచ్‌కి కూడా వెళ్లి ఓపెన్ చేయవచ్చు. ఇలాంటి సేవింగ్స్ అకౌంట్.. అందరి వద్ద ఉండాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తూ ఉంటారు.
కార్పొరేట్ శాలరీ అకౌంట్..
దేశంలో పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ కార్పొరేట్ శాలరీ అకౌంట్లు ఇస్తారు. సంబంధిత సంస్థ, వ్యాపారాన్ని బట్టి వీటిని కస్టమైజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు.. బ్యాంక్‌లు కూడా కొత్త కొత్త ఆప్షన్లతో ఈ తరహా అకౌంట్లను ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఇదొక జీరో బ్యాలెన్స్ అకౌంట్. కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉంటే.. సంబంధిత బ్యాంక్‌లో రీటైల్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. లాకర్ రెంటల్స్‌పై డిస్కౌంట్లు లభిస్తాయి.
చిల్ట్రన్ సేవింగ్స్ అకౌంట్..
Different types of savings account in India : దీనిని మైనర్ సేవింగ్స్ అకౌంట్ అని కూడా అంటారు. 0-18ఏళ్ల మధ్య ఉన్న చిన్నారుల కోసమే ఈ సేవింగ్స్ అకౌంట్. ఇలాంటి సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే.. పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపుపై పాఠాలు చెబుతున్నట్టు, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నట్టు అవుతుంది.
ఉమెన్ సేవింగ్స్ అకౌంట్..
సాధారణంగా.. ఇళ్లల్లో మహిళలు డబ్బును చాలా పొదుపు చేస్తారు. వాటిని పోపుల డబ్బాల్లో, బియ్యం సంచుల్లో లేదా బీరువాల్లో పెడుతూ ఉంటారు. కానీ వాటిని ఉమెన్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టడం మంచి ఆప్షన్ అవుతుంది. వీటితో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇలా సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు పొదుపు చేస్తే.. ఎంతో కొంత వడ్డీ కూడా లభిస్తుంది. అదే సమయంలో.. మహిళలకు పెట్టుబడులు వంటి అంశాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవింగ్స్ అకౌంట్..
ఈ తరహా అకౌంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వినియోగిస్తుంటారు. వీటితో ఎన్నో రకాల వెసులుబాట్లు ఉంటాయి. ఆఫీసుల్లోనే వీటిని ఓపెన్ చేయవచ్చు.
రక్షణ సిబ్బందికి సేవింగ్స్ అకౌంట్..
Savings account in India : ఈ తరహా సేవింగ్స్ అకౌంట్‌తో జీవితకాల ఉచిత రూపై డెబిట్ కార్డ్ వస్తుంది. ఇందులో భారీ మొత్తంలో బీమా కవరేజీ కూడా ఉంటుంది. ఈ తరహా ఉద్యోగాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. యాక్సిడెంట్ కవరేజీ, మరణం తర్వాత ఇచ్చే బీమా వంటివి కూడా ఉంటాయి. పెళ్లి, పిల్లల ఉన్నత విద్య కవరేజీ కూడా ఈ సేవింగ్స్ ఖాతాలో ఉంటుంది. యాక్సిడెంట్ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వస్తే.. అందుకు కూడా కవరేజీ కాస్త ఎక్కువగా ఉంటుంది.
ఈ తరహా సేవింగ్స్ అకౌంట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ, రాష్ట్ర పోలీసు దళం, పారామిలిటరీ దళం సిబ్బందికి వర్తిస్తాయి. వివిధ విభాగాలకు బెనిఫిట్లు వేరువేరుగా ఉంటాయి.
జాయింట్ సేవింగ్స్ అకౌంట్..
జాయింట్ అకౌంట్లాగానే జాయింట్ సేవింగ్స్ అకౌంట్ కూడా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో.. ఒకరికి ఏమైనా జరిగితే, ఇంకొకరు ఈ ఖాతాను సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది.
పెన్షనర్స్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్..
Saving accounts interest rate : పింఛను బ్యాంక్‌లలో వేసుకునేందుకు ఈ తరహా అకౌంట్ ఉపయోగపడుతుంది. పలు బ్యాంక్‌లలో కేవలం రూ. 5 డిపాజిట్తోనే అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు.
సంబంధిత కథనం