RBL Bank Savings Account Interest Rates : సేవింగ్స్​ అకౌంట్​పై 6.25శాతం వడ్డీ!-rbl bank savings account interest rates increased check details in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rbl Bank Savings Account Interest Rates : సేవింగ్స్​ అకౌంట్​పై 6.25శాతం వడ్డీ!

RBL Bank Savings Account Interest Rates : సేవింగ్స్​ అకౌంట్​పై 6.25శాతం వడ్డీ!

Sharath Chitturi HT Telugu
Sep 04, 2022 02:54 PM IST

RBL Bank Savings Account Interest Rates : ఆర్​బీఎల్​ బ్యాంకు.. సేవింగ్స్​ అకౌంట్​పై వడ్డీ రేట్లను పెంచింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

సేవింగ్స్​ అకౌంట్​పై 6.25శాతం వడ్డీ ఇస్తున్న ఆర్​బీఎల్​ బ్యాంకు!
సేవింగ్స్​ అకౌంట్​పై 6.25శాతం వడ్డీ ఇస్తున్న ఆర్​బీఎల్​ బ్యాంకు!

RBL Bank Savings Account Interest Rates : సేవింగ్స్​ అకౌంట్​పై వడ్డీ రేట్లను పెంచింది ఆర్​బీఎల్​ బ్యాంకు. ఆర్​బీఎల్​ బ్యాంకు డిపాజిట్లలోని సేవింగ్స్​ ఖాతాపై 6.25శాతం వడ్డీని ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇది సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది. దీనిపై ఆర్​బీఎల్​ బ్యాంకు.. ఇప్పటికే ఓ ప్రకటనను విడుదల చేసింది.

"కస్టమర్లకు, ప్రజలకు అలర్ట్​. 2022 సెప్టంబర్​ 5 నుంచి సేవింగ్స్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తున్నాము. 6.25శాతం వడ్డీని ఇస్తున్నాము," అని ఓ ప్రకటనలో పేర్కొంది ఆర్​బీఎల్​ బ్యాంకు.

రూ. 25లక్షలు- రూ. 1 కోటి నగదు ఉన్న సేవింగ్స్​ అకౌంట్​పై 6.25శాతం వడ్డీ ఇస్తోంది ఆర్​బీఎల్​ బ్యాంకు. గతంలో ఇది 6శాతంగా ఉండేది. అంటే.. తాజాగా 25బేసిస్​ పాయింట్లు పెంచినట్టు! రూ. 1కోటి- రూ. 3కోట్ల సవింగ్స్​ అకౌంట్​కు గతంలో 6శాతం వడ్డీ ఉండగా.. ఇప్పుడు అది 6.25శాతానికి పెంచింది.

RBL Bank : రూ. 3కోట్లు- రూ. 5కోట్లు నగదు ఉన్న సేవింగ్స్​ ఖాతాలో.. వడ్డీ రేటును 6శాతం నుంచి 6.25శాతానికి చేరింది. రూ. 5కోట్లు- రూ. 7.5కోట్ల అకౌంట్​కు వడ్డీ రేటును 5.75శాతం నుంచి 6.25శాతానికి పెంచింది. అదే సమయంలో రూ. 7.5కోట్లు- రూ. 10కోట్ల విలువ ఉన్న సేవింగ్స్​ ఖాతాకు.. 35బేసిస్​ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

రూ. 10కోట్లు- రూ. 50కోట్ల నగదు ఉన్న సేవింగ్స్​ అకౌంట్​కు 6.10శాతం వడ్డీ రేట్లు ఇస్తోంది ఆర్​బీఎల్​ బ్యాంకు. రూ. 50కోట్లు- రూ. 100కోట్లు ఉన్న ఖాతాలకు 5.25శాతం వడ్డీ రేటు కొనసాగుతోంది. రూ. 100కోట్లు- రూ. 200కోట్లు ఉన్న సేవింగ్స్​ అకౌంట్​కు గతంలో 5శాతం వడ్డీ ఇవ్వగా ఇప్పుడు దానిని 6శాతానికి పెంచేసింది. రూ. 200కోట్లు- రూ. 500కోట్లు విలువ చేసే సేవింగ్స్​ అకౌంట్​కుగాను 4శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 500కోట్లు- అంత కన్నా ఎక్కువ విలువ చేసే సేవింగ్స్​ ఖాతాకు 4.50శాతం వడ్డీని ఇస్తున్నట్టు స్పష్టం చేసింది ఆర్​బీఎల్​ బ్యాంకు.

RBL Bank Savings Account : ఇక.. మిగిలిన వాటికి మార్పులు చేయలేదు. రూ. 1 లక్ష లోపు నగదు ఉన్న సేవింగ్స్​ అకౌంట్​పై 4.25శాతం వడ్డీ రేటు కొనసాగుతోంది. రూ. 1 లక్ష- రూ. 10 లక్షలు ఉన్న సేవింగ్స్​ ఖాతాకు 5.50శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 10లక్షలు- రూ. 25లక్షల సేవింగ్స్​ అకౌంట్​కు 6శాతం వడ్డీని ఇస్తూ వస్తోంది ఆర్​బీఎల్​ బ్యాంకు.

ఆర్​బీఎల్​లో సేవింగ్స్​ అకౌంట్​ కలిగి ఉన్న వారికి.. ఇది కచ్చితంగా గుడ్​ న్యూస్​! 

పూర్తి వివరాలను ఈ కింద ఛార్ట్​లో తెలుసుకోండి.

<p>సేవింగ్స్​ అకౌంట్​పై వడ్డీ రేట్లను పెంచింది ఆర్​బీఎల్​ బ్యాంకు</p>
సేవింగ్స్​ అకౌంట్​పై వడ్డీ రేట్లను పెంచింది ఆర్​బీఎల్​ బ్యాంకు (rblbank.com)
IPL_Entry_Point