Tax saving FDs for senior citizens: 8% పైన రాబడి ఇచ్చే 2 టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలు-2 tax saving fixed deposits promising over 8 returns to senior citizens ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  2 Tax Saving Fixed Deposits Promising Over 8% Returns To Senior Citizens

Tax saving FDs for senior citizens: 8% పైన రాబడి ఇచ్చే 2 టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలు

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 04:40 PM IST

tax saving FDs for seniors citizens: ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనంలో పెట్టుబడి పెట్టడం అనేది పన్ను ఆదా కోసం బాగా సిఫార్సు అవుతోందన్న వాస్తవాన్ని వృద్ధులు గమనించాలి. ఇది స్థిర రాబడిని అందిస్తుంది.

8 శాతానికి మించి వడ్డీ రేటు ఇస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు (ప్రతీకాత్మక చిత్రం)
8 శాతానికి మించి వడ్డీ రేటు ఇస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు (ప్రతీకాత్మక చిత్రం)

tax saving Fixed Deposits for seniors: ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనం టాక్స్ సేవింగ్ కోసం బాగా ప్రాచుర్యం పొందింది. సీనియర్ సిటిజన్లు ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఇది స్థిర రాబడిని అందించడమే కాకుండా మీ పెట్టుబడులు రూ. 5 లక్షల వరకు సురక్షితంగా ఉన్నాయని డిఐసిజిసి ద్వారా హామీ ఉంటుంది. 5 సంవత్సరాలపాటు పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8% కంటే ఎక్కువ రాబడిని అందించే రెండు బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఆగస్ట్ 12, 2022న ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ ఇప్పుడు 5 సంవత్సరాల పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7.50%, సీనియర్ సిటిజన్‌లకు 8.25% వడ్డీ రేటును ఇస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రమే పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందజేస్తోంది. సీనియర్ సిటిజన్‌ల వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే 8.25%.

<p>Utkarsh Small Finance Bank FD Rates: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు</p>
Utkarsh Small Finance Bank FD Rates: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు (utkarsh.bank)

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చివరిసారిగా రూ. 2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను జూన్ 15, 2022న పెంచింది. బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్ సిటిజన్‌లకు 8.05% వడ్డీ రేటును అందిస్తోంది. 5 సంవత్సరాలలో (1825 రోజులు) మెచ్యూర్ అయ్యే పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్ వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకున్నప్పుడు పన్ను ఆదా చేసే డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందించే జాబితాలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండో బ్యాంక్‌గా నిలుస్తుంది. మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద జన బ్యాంక్ ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

<p>Jana Small Finance Bank FD: జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ</p>
Jana Small Finance Bank FD: జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ (janabank.com)

కానీ పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే ముందు, పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తాయని, అందువల్ల ముందస్తు ఉపసంహరణలు, పాక్షిక ఉపసంహరణ, డిపాజిట్లపై లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం వంటివి ఉండవని గుర్తుంచుకోవాలి. ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి ఇవి పనికొస్తాయి. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు మాత్రమే పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు.

పెట్టుబడిదారులు వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఉమ్మడి ఖాతా విషయంలో పన్ను ప్రయోజనాలు మొదటి లేదా ప్రాథమిక ఖాతాదారుకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకున్న వడ్డీ పెట్టుబడిదారు యొక్క పన్ను శ్లాబుపై ఆధారపడి పన్ను విధిస్తారు. కాబట్టి TDS తీసేస్తారు. వృద్ధులు అధిక రాబడిని అందుకోవడమే కాకుండా తమ పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ప్రస్తుతం పెరుగుతున్న వడ్డీ రేటు పెరుగుదల దృష్ట్యా పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు.

IPL_Entry_Point