Top ELSS Funds to invest : ట్యాక్స్ సేవింగ్స్‌తో పాటు మంచి రిటర్నులు కావాలా? ఇవి బెస్ట్..!
Top ELSS Funds to invest in 2023 : ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌తో ట్యాక్స్ కూడా సెవ్ చేసుకోవచ్చని తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
Top ELSS Funds to invest in 2023 : ఇన్వెస్ట్‌మెంట్‌తో నూతన ఏడాదిని ప్రారంభించాలని భావిస్తున్నారా? ఇది మీ న్యూ ఇయర్ రిసొల్యూషన్ ఆ? అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఇక 'ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు పన్ను ఆదా అయితే బాగుంటుంది కదా!' అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సరిగ్గా సూట్ అవుతుంది. ఐసీఐసీఐ డైరక్ట్ చెబుతున్న టాప్ 5 ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
ఈఎల్ఎస్ఎస్ మ్యూచవల్ ఫండ్స్ అంటే ఏంటి?
1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద.. పెట్టుబడుల మీద ట్యాక్స్‌ను ఆదా చేసుకోగలిగే వెసులుబాటు ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఈ 'ఈఎల్ఎస్ఎస్'. ట్యాక్స్ సేవింగ్స్‌తో పాటు దీర్ఘకాలంలో ఇండియా ఈక్విటీ మార్కెట్ నుంచి మంచి లాభాలు రాబట్టగలిగే సత్తా వీటికి ఉండటం విశేషం. 80సీ ఆప్షన్ ఉన్న పెట్టుబడి మార్గాల్లో.. అధిక రిటర్నులు తెచ్చిపెడుతుంది ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్. అయితే.. ఈ ఫండ్స్‌కు 3 ఇయర్ లాకిన్ పీరియడ్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
టాప్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్..
కెనెరా రోబెకో ఈక్విటీ ట్యాక్స్‌సేవర్ ఫండ్:-
Canara Robeco Equity Taxsaver fund : ఈ మ్యూచువల్ ఫండ్‌ను 2013 జనవరి 2న లాంచ్ చేశారు. వాల్యూ రీసెర్చ్.. ఈ ఫండ్‌కి 5స్టార్ రేటింగ్ ఇవ్వగా.. క్రిసిల్.. 4స్టార్ రేటింగ్ ఇచ్చింది. 2022 నవంబర్ 30 నాటికి ఈ మ్యూచవల్ ఫండ్ వద్ద రూ. 4,583కోట్ల ఏయూఎం(అసెట్ అండర్ మేనేజ్మెంట్) ఉంది. దీని ఎక్స్పెన్స్ రేషియో 0.61శాతం. ఎస్ అండ్ పీ బీఎస్ఈ 500 టీఆర్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఫైనాన్స్ సెక్టార్లో మెజారిటీ పెట్టుబడులు ఉన్నాయి. ఐటీ, ఆటో, ఆరోగ్య రంగాల్లోని స్టాక్స్ ఇందులో ఉన్నాయి. రూ. 500తో సిప్‌ను మొదలుపెట్టొచ్చు. లేదా రూ. 500తో లామ్సమ్ కూడా చేయవచ్చు.
ఈ రోబెకో ఈక్విటీ ట్యాక్స్‌సేవర్ ఫండ్.. ఏడాదిలో 7.9శాతం, రెండేళ్లల్లో 10.34శాతం, మూడేళ్లల్లో 20.21శాతం రిటర్నులు ఇచ్చింది.
ఫ్రాన్క్లిన్ ఇండియా ట్యాక్స్షీల్డ్ ఫండ్..
Franklin India Taxshiled fund 3 year returns : ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్‌ను 1999 ఏప్రిల్ 10న లాంచ్ చేశారు. క్రిసిల్, వాల్యూ రీసెర్చ్ నుంచి ఈ ఫండ్ 3స్టార్ రేటింగ్‌ని అందుకుంది. 2022 నవంబర్ 30 నాటికి.. ఈ మ్యూచువల్ ఫండ్ ఏయూఎం రూ. 5,096కోట్లుగా ఉంది. ఎక్స్పెన్స్ రేషియో 1.90శాతంగా ఉంది. ఫైనాన్షియల్, ఐటీ, కన్జ్యూమర్ స్టేపుల్స్ సెక్టార్, ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులు ఉన్నాయి. రూ. 500తో సిప్ లేదా లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.
ఈ ఫ్రాన్క్లిన్ ఇండియా ట్యాక్స్షీల్డ్ ఫండ్.. ఏడాదిలో 13.37శాతం, రెండేళ్లల్లో 13.98శాతం, మూడేళ్లల్లో 22.77శాతం రిటర్నులు ఇచ్చింది.
ఐడీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్..
IDFC Tax Advantage Fund returns : ఐసీఐసీఐ డైరక్ట్ రికమెండ్ చేస్తున్న మరో ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్.. ఈ ఐడీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్. క్రిసిల్ నుంచి 5 స్టార్, వాల్యూ రీసెర్చ్ నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది ఇది. 2008 డిసెంబర్ 26న దీనిని లాంచ్ చేశారు. 2022 నవంబర్ 30 నాటికి ఈ ఫండ్ ఏయూఎం రూ. 4,091కోట్లుగా ఉంది. ఎక్స్పెన్స్ రేషియో 0.75శాతంగా ఉంది. ఫైనాన్స్, ఆటో, ఐటీ, మెటీరియల్, ఆరోగ్య రంగాల స్టాక్స్‌లో పెట్టుబుడులు ఎక్కువగా ఉన్నాయి. రూ. 500తో సిప్ లేదా రూ. 1000తో లమ్సమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.
ఈ ఐడీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్.. ఏడాదిలో 10.61శాతం, రెండేళ్లల్లో 15.14శాతం, మూడేళ్లల్లో 27.05శాతం రిటర్నులు ఇచ్చింది.
మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్..
Mirae Asset Tax Saver funds 3 year returns : ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్‌కు క్రిసిల్ నుంచి 3స్టార్, వాల్యూ రీసెర్చ్ నుంచి 5స్టార్ రేటింగ్ దక్కింది. 2016 డిసెంబర్ 28న దీనిని ప్రారంభించారు. నిఫ్టీ500 టీఆర్ఐని ఇది ట్రాక్ చేస్తుంది. 2022 నవంబర్ 30 నాటికి దీని ఏయూఎం రూ. 14,255కోట్లు. ఎక్స్పెన్స్ రేషియో 0.55శాతంగా ఉంది. ఫైనాన్షియల్, ఎనర్జీ, ఐటీ, ఆటో, హెల్త్‌కేర్‌లో పెట్టుబడులు ఉన్నాయి. రూ. 500తో సిప్ లేదా రూ. 500తో లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.
ఈ మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్.. ఏడాదిలో 7.18శాతం, రెండేళ్లల్లో 7.18శాతం, మూడేళ్లల్లో 20.45శాతం రిటర్నులు ఇచ్చింది.
టాటా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్..
Tata Tax Savings Fund expense ratio : టాటా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్‌ను 2014 అక్టోబర్ 13న లాంచ్ చేశారు. దీనికి క్రిసిల్ నుంచి 3 స్టార్, వాల్యూ రీసెర్చ్ నుంచి 5 స్టార్ రేటింగ్ లభించింది. నిఫ్టీ500 టీఆర్ఐని ఇది ట్రాక్ చేస్తుంది. 2022 నవంబర్ 30 నాటికి ఈ ఫండ్ ఏయూఎం రూ. 3,280కోట్లు. ఫైనాన్స్, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ వంటి సెక్టార్లలో పెట్టుబడులు ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియో 0.75శాతంగా ఉంది. రూ. 500తో సిప్ లేదా, రూ.500తో లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.
ఈ టాటా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్.. ఏడాదిలో 13.26శాతం, రెండేళ్లల్లో 13.92శాతం, మూడేళ్లల్లో 21.11శాతం రిటర్నులు ఇచ్చింది.
* పైన చెప్పిన ఓపెన్ ఎండెడ్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి.
(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుందన్న విషయాన్ని మదుపర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.)
సంబంధిత కథనం