Invest in US Stocks via Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులా? యూఎస్ స్టాక్స్ ట్రై చేయండి!
How to invest in US Stocks from Indian mutual funds : అమెరికా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారా? ఇండియాలోని కొన్ని మ్యూచువల్ ఫండ్స్.. మీకోసం ఆ పని చేసిపెడుతున్నాయి. ఆ వివరాలు తెలుసుకోండి.
US Stocks mutual funds in India : అమెరికా సూచీలు ఎంతటి శక్తివంతమైనవో.. స్టాక్ మార్కెట్ ప్రపంచానికి తెలుసు. అందుకే అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు మొగ్గుచూపుతూ ఉంటారు. భారతీయులు కూడా ఈ మధ్య కాలంలో అమెరికా మార్కెట్లపై విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ఇది భారీ క్యాపిటల్‌తో కూడుకున్న వ్యవహారం అని చాలా మంది వెనకడుగు వేస్తారు. అయితే.. చిన్న మొత్తంలో క్యాపిటల్ ఉండి.. అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఒక మంచి ఆప్షన్ ఉంది. అదే.. 'మ్యూచువల్ ఫండ్స్'! ఇండియాలోని మ్యుచువల్ ఫండ్స్‌తో అమెరికా స్టాక్స్‌లో కూడా పెట్టుబడులు చేయవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము.
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు.. లాభాలు..
ప్రపంచ స్టాక్ మార్కెట్లో.. మదుపర్లకు అద్భుతమైన రిటర్నులు తెచ్చిపెట్టిన చరిత్ర యూఎస్ సూచీలకు ఉంది. ఈ ఏడాదిని మినహాయిస్తే.. 10ఏళ్లల్లో.. 200శాతం పెరిగింది ఎస్ అండ్పీ 500 సూచీ. ఇక ఐదేళ్లల్లో ఎస్ అండ్ పీ 500, నాస్డాక్, డౌ జోన్స్ సూచీలు.. మదుపర్ల సంపదను రెట్టింపు చేశాయి.
US stocks investment India : ఇక అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా.. ఏడాది కాలంలో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఎన్నో విలువైన స్టాక్స్.. చాలా తక్కువ ధరకు దొరుకుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసేందుకు ఇదే రైట్ టైమ్ అని పిలుపునిస్తున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్ల టైమింగ్స్‌తో పాటు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సమయంలో.. చిన్న క్యాపిటల్ ఉన్న వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. నెలనెలగా సిప్ చేసుకుంటూ పోతే.. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
US stock market news : ఇండియాలోని యూఎస్ ఫోకస్డ్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌లో భారతీయులు పెట్టుబడులు పెట్టవచ్చు. ఒక్క అమెరికానే కాదు.. ఏ దేశ స్టాక్ మార్కెట్లోనైనా ఇండియా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే వెసులుబాటు ఉంది.
సాధారణంగా.. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ పేరుతో విదేశీ స్టాక్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా ఇది వర్తిస్తుంది. ఇండియా స్టాక్ మార్కెట్లు సరైన ప్రదర్శన చేయకపోయినా.. విదేశీ మార్కెట్లో చేసిన పెట్టుబడులు పెరగొచ్చు! ఈ తరహా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో రూపీపై హెడ్జింగ్ చేసినట్టు అవుతుంది.
US focused mutual funds in India : యూఎస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు.. ఇండియా మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న కొన్ని ఆప్షన్లను ఇప్పుడు చూద్దాము.
- ఫ్రాంక్లిన్ ఇండియ ఫీడర్ యూఎస్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్:- 3ఏళ్ల సీఏజీఆర్- 7.9శాతం
- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్:- 3ఏళ్ల సీఏజీఆర్- 11.9శాతం
- మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్:- 3ఏళ్ల సీఏజీఆర్ 16.3శాతం
- డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్:- 3ఏళ్ల సీఏజీఆర్ 13.6శాతం
- నిప్పాన్ ఇండియా యూఎస్ ఈక్విటీ ఆపర్చ్యూనిటీస్ ఫండ్:- 3ఏళ్ల సీఏజీఆర్ 7.2శాతం
- ఎడిల్వైజ్ యూఎస్ వాల్యూ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్:-3ఏళ్ల సీఏజీఆర్ 12.7శాతం.
ఇవి తెలుసుకోవాలి..
Indian mutual funds with US stocks : ఈ తరహా మ్యూచువల్ ఫండ్స్‌కు.. ఇండియా స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునే విధానం, గోల్స్ కూడా వేరుగా ఉంటాయి. అంతేకాకుండా.. విదేశీ మార్కెట్లు, అక్కడి నిబంధనలు, ఇక్కడి రూల్స్ వంటి అంశాలపై అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదు.
రిస్క్:- స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఇక ఇండియా నుంచి విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంటే.. ఆ రిస్క్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది! ఆయా దేశాలకు చెందిన ఆర్థిక, రాజకీయ పరిస్థితులు.. మన ఇన్వెస్ట్మెంట్లపై ప్రభావం చూపిస్తాయన్నది గుర్తుపెట్టుకోవాలి.
US Stock market risks : దీర్ఘకాలం కోసమే:- విదేశీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అంటే.. స్వల్ప కాలానికి పనికిరావు! దీర్ఘకాలం లక్ష్యాలను నిర్దేశించుకుని మాత్రమే పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది.
ఎక్స్ఛేంజ్ రేట్:- ఇతర దేశాల్లో పెట్టుబడులు అంటే.. కరెన్సీని మార్చాల్సి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ రేట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. మారుతూ ఉంటుంది. ఈ ప్రభావం కూడా మన గోల్స్‌పై ఉంటుంది.
డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో లేకపోవడం:- కొన్ని మ్యూచవల్ ఫండ్స్.. ఒకే సెక్టార్‌కు చెందిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో డైవర్సిఫికేషన్ ఉండదు. ఫలితంగా.. ఆ సెక్టార్ పతనమైతే.. మన పెట్టబడులు కూడా నష్టపోతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
International Mutual Funds : ట్యాక్స్:- అమెరికా మార్కెట్లో పెట్టుబడులకు ట్యాక్స్ ఒక విధంగా, ఇండియాలో పెట్టుబడులకు ఒక విధంగా ఉంటుంది. లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌కు చెందిన ట్యాక్స్ వివరాలను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక గోల్స్ పెట్టుకుని, ట్యాక్స్‌ను పరిగణలోకి తీసుకుని లెక్కలు వేసి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందనిపిస్తేనే.. ఈ తరహా మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా పెట్టుబడి చేసే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)