తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv 3xo Launch : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ లాంచ్​.. ధర ఎంతంటే!

Mahindra XUV 3XO launch : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

30 April 2024, 6:37 IST

    • Mahindra XUV 3XO price : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ లాంచ్​ అయ్యింది. ఈ ఎస్​యూవీ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఇదిగో..
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఇదిగో..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఇదిగో..

Mahindra XUV 3XO launch date : గత కొన్ని రోజులుగా మహీంద్రా అండ్​ మహీంద్రా ఊరిస్తూ వస్తున్న మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ.. ఇండియా మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఇది.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​. ఈ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ ధర రూ.7.49 లక్షల వద్ద ప్రారంభమై.. రూ. 15.49 లక్షల వరకు వెళుతుంది. ఇవి ఎక్స్​షోరూం ధరలు. లాంచ్​ నేపథ్యంలో.. ఈమహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ డిజైన్​- ఫీచర్స్​..

మహీంద్రా ఎక్స్​యూవీ300తో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓని పోల్చితే.. డిజైన్​ పరంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఫ్రెంట్​ ఫాసియోలో గ్లాసీ బ్లాక్​ గ్రిల్​ విత్​ క్రోమ్​ స్లాట్స్​ వస్తున్నాయి. అవి మరింత అట్రాక్టివ్​గా ఉన్నాయి. ఇక ఎక్స్​యూవీ700 కనిపించే కొత్త ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ కూడా ఉన్నాయి.

మరోవైపు.. ఈ కొత్త ఎస్​యూవీ రేర్​ ఎండ్​ని పూర్తిగా రీ-డిజైన్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా. ఇందులో ఇప్పుడు.. కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​, బోల్డ్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ లెటరింగ్​, రేర్​ బంపర్​ మీద రీపొజీషన్డ్​ నెంబర్​ ప్లేట్​ హౌజింగ్​ వంటివి వస్తున్నాయి.

Mahindra XUV 3XO price in Hyderabad : సైడ్​ ప్రొఫైల్​ విషయానికొస్తే.. ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలో డార్క్​ క్రోమ్​ ఫినిషింగ్​తో సరికొత్త అలాయ్​ వీల్స్​ని చూడొచ్చు.

ఇక ఈ ఎస్​యూవీలో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో, స్లీక్​ సెంట్రల్​ ఏసీ వెంట్స్​, పానారోమిక్​ సన్​రూఫ్​, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కట్రోల్​ సెట్టింగ్స్​ వంటివి ఫీచర్స్​గా వస్తున్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ స్టీరింగ్​ వీల్​ డిజైన్​ మారలేదు. కానీ ఇందులో ఇప్పుడు గ్లాసీ బ్లాక్​ ఇన్​సర్ట్స్​ వస్తున్నాయి. వయర్​లెస్​ ఫోన్​ ఛార్జర్​, కనెక్టెడ్​ కార్​ టెక్​, 7 స్పీకర్​ హర్మాన్​ కార్డొన్​ సౌండ్​ సిస్టెమ్​లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ- ఇంజిన్​..

Mahindra XUV300 facelift : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 111 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

ఇందులో 1.5 డీజిల్​ ఇంజిన్​ కూడా ఉంది.ఇది 117 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఏఎంటీ ఆప్షన్స్​ ఉన్నాయి.

కొన్ని ఎంపిక చేసిన హైయ్యర్​ వేరియంట్స్​లో 1.2 లీటర్​ డైరక్ట్​ ఇంజెక్షన్​ టర్బో పెట్రోల్​ యూనిట్​ కూడా ఉంటుంది. ఇది 131 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో ఏఐఎస్​ఐఎన్​ సోర్స్​డ్​ 6 స్పీడ్​ టార్క్​ కన్వర్ట్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్​ ఉంటుంది.

Mahindra XUV 3XO price : ఇక మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీలో లెవల్​ 2 అడాస్​, క్రూజ్​ కంట్రోల్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, ఫ్రెంట్​- రేర్​ పార్కింగ్​ సెన్సార్​లు సేఫ్టీ ఫీచర్లుగా వస్తున్నాయి.

తదుపరి వ్యాసం