తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Clavis Suv : ఇండియాలోకి కియా కొత్త ఎస్​యూవీ.. త్వరలోనే 'క్లావిస్'​ లాంచ్​!

Kia Clavis SUV : ఇండియాలోకి కియా కొత్త ఎస్​యూవీ.. త్వరలోనే 'క్లావిస్'​ లాంచ్​!

Sharath Chitturi HT Telugu

12 March 2024, 7:20 IST

    • Kia Clavis SUV launch in India : ఇండియా కోసం ప్రత్యేకంగా ఓ ఎస్​యూవీని సిద్ధం చేస్తోంది కియా మోటార్స్​. ఈ ఎస్​యూవీ పేరు కియా క్లావిస్​. ఇది త్వరలోనే లాంచ్​ అవుతుందని సమాచారం.
కియా క్లావిస్​ ఎస్​యూవీ వచ్చేస్తోంది..!
కియా క్లావిస్​ ఎస్​యూవీ వచ్చేస్తోంది..! (Representative image)

కియా క్లావిస్​ ఎస్​యూవీ వచ్చేస్తోంది..!

Kia Clavis price in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇప్పటికే విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ఇక ఈ పోటీని మరింత పెంచేందుకు సరికొత్త ఎస్​యూవీని లాంచ్​ చేయడానికి సిద్ధమవుతోంది కియా మోటార్స్​. ఈ కాంపాక్ట్​ ఎస్​యూవీ పేరు కియా క్లావిస్​. ఇది.. సోనెట్​, సెల్టోస్​ లైనప్​లో యాడ్​ అవుతుంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​ లాంచ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కియా క్లావిస్​ లాంచ్​ ఎప్పుడు?

ఈ ఏడాది చివర్లో.. క్లావిస్​ ఎస్​యూవీని కియా మోటార్స్​ లాంచ్​ చేయనుంది. 2025 తొలినాళ్లల్లో.. అంతర్జాతీయ మార్కెట్​లోకి ఈ మోడల్​ వస్తుంది. ఆ వెంటనే.. ఇండియాలోకి కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ కియా క్లావిస్​లో పెట్రోల్​తో పాటు ఎలక్ట్రిక్​ వర్షెన్​ అందుబాటులో ఉంటుందని సమాచారం. పెట్రల్​ మోడల్​ లాంచ్​ అయిన 6 నెలలకు.. కియా క్లావిస్​ ఈవీని కూడా విడుదల చేయాలని సంస్థ భావిస్తోందట.

ఇక ఈ ఎస్​యూవీకి చెందిన ఫొటోలు ఇప్పటికే సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. చూస్తుంటే.. ఈ వెహికిల్​ సైజు ఎక్కువగానే ఉంది! గ్రౌండ క్లియరెన్స్​ కూడా ఎక్కువగానే ఉంది. రగ్​డ్​ డిజైన్​ ఎలిమెంట్స్​ ఇందులో కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:- Hyundai Creta N Line : హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​ లాంచ్​.. ధర ఎంతంటే..

Kia Clavis SUV : ఇక కియా క్లావిస్​లో ఫీచర్స్​కి కొదవ ఉండదని సమాచారం. భారీ టచ్​స్క్రీన్​, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్​ సీట్స్​, సన్​రూఫ్​తో పాటు ఇతర ఫీచర్స్​ ఇందులో ఉంటాయి.

సోనెట్​తో పోల్చుకుంటే.. కియా క్లావిస్​ ఇంటీరియర్​లో స్పేస్​ కాస్త ఎక్కువే ఉండొచ్చు! సోనెట్​లో ఉన్న ఏకైక నెగిటివ్​ విషయం స్పేస్​!

కియా క్లావిస్​ ఎస్​యూవీ ఇంజిన్​ వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ.. పెట్రోల్​, ఎలక్ట్రిక్​ వర్షెన్​లను ఒకటే ప్లాట్​ఫామ్​పై తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండూ.. ఫ్రెంట్​- వీల్​ డ్రైవ్​ ఓన్లీ అని సమాచారం. ఇండియా కోసమే ఈ మోడల్​ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

కియా క్లావిస్​ ఎస్​యూవీ- ధర ఎంత ఉండొచ్చు?

Kia new SUV launch in India : ఇండియాలో కియా క్లావిస్​ లాంచ్​తో పాటు ధర వివరాలపై ఇంకా క్లారిటీ లేదు. కానీ.. ఇది.. కియా సోనెట్​ ధర కన్నా కాస్త ఎక్కువ ఉండొచ్చని టాక్​ నడుస్తోంది. ఇండియాలో కియా సోనెట్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.99లక్షలుగా ఉంది.

ఇండియాలో కియా మోటార్స్​ వెహికిల్స్​కి మంచి డిమాండ్​ ఉంది. బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో కియా సెల్టోస్​ ఒకటి. సోనెట్​కి కూడా మంచి క్రేజ్​ ఉంది. అటు.. ఈవీ సెగ్మెంట్​పైనా సంస్థ ఫోకస్​ చేసింది. రానున్న రోజుల్లో కియా ఈవీ9ని ఇండియాలో లాంచ్​ చేయనుంది. ఇక కియా క్లావిస్​ ఎస్​యూవీ పెట్రోల్​, ఈవీ వర్షెన్​లు అందుబాటులోకి వస్తే.. ఇండియాలో లాభాలు పెంచుకోవచ్చని సంస్థ భావిస్తోంది.

తదుపరి వ్యాసం