Hyundai Creta N Line : హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్ లాంచ్.. ధర ఎంతంటే..
Hyundai Creta N Line launched : హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్ ఎస్యూవీ వచ్చేసింది! ఈ ఎస్యూవీ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Hyundai Creta N Line launched in India : ఇండియాలో హ్యుందాయ్‌కు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న క్రేటాలో కొత్త ట్రిమ్‌ని లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. దీని పేరు హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్. ఈ ఎన్ లైన్ ట్రిమ్ వస్తున్న మూడో హ్యుందాయ్ కారు ఈ క్రేటా ఎస్యూవీ. ఇప్పటికే.. ఐ20, వెన్యూల్లో ఎన్ లైన్ ఉంది. ఈ నేపథ్యంలో.. కొత్త వెహికిల్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ చూసేద్దాము..
హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్- ఫీచర్స్..
స్టాండర్డ్ క్రేటా ఎస్‌యూవీతో పోల్చితే.. ఈ హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్ బంపర్స్, గ్రిల్లో స్వల్పంగా మార్పు కనిపిస్తుంది. పైగా దీనికి రెడ్ యాక్సెంట్స్ వస్తున్నాయి. 18 ఇంచ్ రీ-డిజైన్డ్ అలాయ్ వీల్స్, రేర్ స్పాయిలర్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా లభిస్తున్నాయి.
ఈ ఎస్‌యూవీలో మూడు మోనోటోన్, ఒక డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి.. అట్లాస్ వైట్, ఎబిస్ బ్లాక్, టైటాన్ గ్రే మాట్, అట్లాస్ వైట్ విత్ ఎబిస్ బ్లాక్ రూఫ్, థండర్ బ్లూ విత్ ఎబిస్ బ్లాక్ రూఫ్, షాడో గ్రే విత్ ఎబిస్ బ్లాక్ రూఫ్.
ఇక హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్ ఎస్యూవీ ఇంటీరియర్‌లో ఆల్ బ్లాక్ థీమ్ విత్ రెడ్ యాక్సెంట్స్, ఇన్సర్ట్స్ వస్తున్నాయి. గేర్ లివర్, స్టీరింగ్ వీల్, బ్లాక్ లెథరేట్ సీట్ అప్హోలిస్ట్రీల మీద ఎన్ లైన్ బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి.
Hyundai Creta N Line price in India : ఈ ఎస్‌యూవీలో.. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్ వస్తున్నాయి. యాంబియెంట్ లైటింగ్, వయర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉన్నాయి.
ఇక ఈ హ్యుందాయ్ కారులో బోస్ మ్యూజిక్ సిస్టెమ్, వయర్లెస్ ఛార్జర్, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, పానారోమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్యూయెల్ డాష్ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీట్, లెవల్ 2 అడాస్ సూట్ కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్- ఇంజిన్..
Hyundai Creta N Line : ఈ హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్ ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు ఉంటాయి. అవి.. ఎన్8, ఎన్10. ఈ రెండింటికీ ఒకటే ఇంజిన్ వస్తోంది. అది.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది.. 158 హెచ్‌పీ పవర్‌ని, 253 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. 0-100 కేఎంపీహెచ్ని 8.9 సెకన్లలో అందుకుంటుంది ఈ ఎస్యూవీ.
హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్- ధర..
ఇండియాలో హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్ ఎక్స్‌షోరూం ధరలు రూ. 16.82 లక్షలు- రూ. 20.3 లక్షల మధ్యలో ఉంటుంది.
మరి ఈ హ్యుందాయ్ కొత్త మోడల్ ఏమేరకు కస్టమర్లను ఆకర్షిస్తుందో చూడాలి.
సంబంధిత కథనం