Flora electric scooter : ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ రీ-లాంచ్.. 100 కి.మీ రేంజ్- ధర ఎంతంటే!
Komaki Flora electric scooter : కొమాకి ఫ్లోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రీ-లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ చూసేయండి.
Flora electric scooter range : ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ని రీ-లాంచ్ చేసింది కొమాకి ఎలక్ట్రిక్ సంస్థ. ఈ ఈ- స్కూటర్ ఎలక్ట్రిక్ ఎక్స్‌షోరూం ధర రూ. 69,000. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్..
కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్లో రెట్రో స్టైల్ డిజైన్ కనిపిస్తుంది. మొత్తం మూడు కలర్స్‌లో ఈ-స్కూటర్ లభిస్తుంది. అవి.. గార్మెట్ రెడ్, జెట్ బ్లాక్, సాక్రామెంటో గ్రే.
ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్లో డిటాచెబుల్ ఎల్ఐపీఓ4 బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని రేంజ్ 80కి.మీ నుంచి 100కి.మీల మధ్యలో ఉంటుంది. 0-100శాతం ఛార్జింగ్‌కి 4 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది. ఇక 0-90శాతం ఛార్జింగ్‌కి 4 గంటల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది.
Komaki Flora electric scooter price : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫ్లోరింగ్ ఫ్లాట్‌గా ఉంటుంది. ఫలితంగా.. గ్రోసరీ, బ్యాగ్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. రేర్ పిలియన్ ప్యాసింజర్ కోసం డ్యూయెల్ ఫుట్‌రెస్ట్‌లు ఉండటం విశేషం. సీట్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇద్దరు మనుషులు సౌకర్యవంతంగా కూర్చుని జర్నీ చేయొచ్చు. 18 లీటర్ల బూట్ స్పేస్ కూడా వస్తుండటం విశేషం.
బ్లూటూత్ కనెక్టివిటీ, రేడీయో ఎఫ్ఎంతో కూడిన సౌండ్ సిస్టెమ్ కూడా ఈ కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉంది. కీలెస్ ఎంట్రీ, కీఫాబ్, ఎస్ఓఎస్ బటన్ వంటివి ఈ స్కూటర్ ఇతర ఫీచర్స్. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటివి ఉన్నాయి.
ఈ స్కూటర్లో పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో మొత్తం 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి.. ఈకో, స్పోర్ట్, టర్బో. మల్టిపుల్ సెన్సార్స్, వయర్లెస్ అప్డేట్స్, స్మార్ట్ డాష్‌బోర్డ్ వంటివి ఇతర ఫీచర్స్‌గా ఉన్నాయి.
ఓలా ఈ-స్కూటర్లపై డిస్కౌంట్లు..
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2024 ప్రారంభం నుంచి వినియోగదారులకు పలు ఆఫర్స్ లేదా ప్రయోజనాలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులకు మరో శుభవార్త తెలిపింది. తన లైనప్‌లోని ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై డిస్కౌంట్ , ఆఫర్స్‌ని ఈ నెలాఖరు (మార్చి 31) వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం