Ola discounts: మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఓలా స్కూటర్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్; ఈ స్కూటర్స్ పై మాత్రమే..
Ola discounts: ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్ లోని పలు స్కూటర్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ను ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం తన లైనప్ లో ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది.
Ola electric scooters discounts: ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2024 ప్రారంభం నుండి వినియోగదారులకు పలు ఆఫర్స్ లేదా ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పుడు, ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులకు మరో శుభవార్త తెలిపింది. తన లైనప్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై డిస్కౌంట్ ఆఫర్ ను ఈ నెలాఖరు (మార్చి 31) వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ఎక్స్ ప్లస్ లపై..
ఈ డిస్కౌంట్ ఆఫర్ పొడిగింపు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్ లోని ఎస్ 1 ప్రో (ola S1 pro), ఎస్ 1 ఎయిర్ (ola S 1 air), ఎస్ 1 ఎక్స్ ప్లస్ (3 కిలోవాట్) (ola S 1 X plus 3kw) లపై ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో డిస్కౌంట్ అనంతరం, ఎస్ 1 ప్రో రూ.1,29,999 లకు లభిస్తుంది. ఎస్ 1 ఎయిర్ రూ.1,04,999 లకు, ఎస్ 1 ఎక్స్ ప్లస్ రూ.84,999 ధరలకు లభిస్తాయి.ఈ అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ ధరలు అన్న విషయాన్ని గమనించాలి.
ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీ
ఎస్1 ఎక్స్ (4 కిలోవాట్) ధర రూ.1,09,999, ఎస్1 ఎక్స్ (2 కిలోవాట్) ధర రూ.79,999, ఎస్1 ఎక్స్ (3 కిలోవాట్) ధర రూ.89,999 లుగా ఓలా ఎలక్ట్రిక్ (Ola electric) నిర్ణయించింది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్. ఈ స్కూటర్స్ పై 8 సంవత్సరాలు / 80,000 కిలోమీటర్ల ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీని కూడా వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. అలాగే, వినియోగదారులు ఇప్పుడు యాడ్-ఆన్ వారంటీని ఎంచుకోవచ్చు. రూ .4,999 ప్రారంభ ధరతో 1,25,000 కిలోమీటర్ల గరిష్ట వారంటీ పరిమితిని పొందవచ్చు. పెంచుకోవచ్చు. అదనంగా, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్వర్క్ ను ప్రస్తుతం ఉన్న 414 సర్వీస్ సెంటర్ల నుండి 2024 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 600 కేంద్రాలకు విస్తరించాలన్న ప్రణాళికలను ఆవిష్కరించింది.
ఓలా ఎలక్ట్రిక్ బైక్స్
మరోవైపు, ఓలా ఎలక్ట్రిక్ నాలుగు కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. ఓలా ఎలక్ట్రిక్ డైమండ్ హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్, రోడ్ స్టర్ అనే నాలుగు ఎలక్ట్రిక్ బైక్స్ ను ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల ప్రదర్శించింది.
ఫిబ్రవరి సేల్స్
ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి 2024 లో 35,000 యూనిట్ల స్కూటర్లను అమ్మగలిగింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే దాదాపు 100 శాతం ఎక్కువ సేల్స్ ను సాధించింది. భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 42 శాతంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ గత మూడు నెలల్లో దాదాపు లక్ష రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో 30 వేలకు పైగా యూనిట్లు నమోదయ్యాయి.