Ola prices reduced: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై రూ. 25 వేల వరకు ధర తగ్గింపు; ఏయే మోడల్స్ పై అంటే..?
Ola prices reduced: ఎలక్ట్రిక్ స్కూటర్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ .25,000 వరకు ధర తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ పై ఈ తగ్గింపు వర్తిస్తుందని ఓలా వెల్లడించింది.
Ola electric scooters prices reduced: ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి నెలలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ఎక్స్ ప్లస్ ఫోన్లపై రూ.25,000 వరకు ధరలు తగ్గాయి. ప్రస్తుతం వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1.30 లక్షలు, రూ.1.05 లక్షలు, రూ.85 వేలుగా ఉన్నాయి.
ఈ మోడల్స్ పై..
వివిధ మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై ధరలను తగ్గించిన తరువాత ఆయా మోడల్స్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- S1 Pro: ఎస్ 1 ప్రొ ధర ఇప్పటివరకు రూ. 1,47,499 ఉండగా, రూ. 17500 తగ్గింపు అనంతరం రూ. 1,29,999 లకు లభిస్తుంది.
- S1 Air: ఎస్ 1 ఎయిర్ ధర ఇప్పటివరకు రూ. 119,999 ఉండగా, రూ. 15000 తగ్గింపు అనంతరం రూ. 104,999 లకు లభిస్తుంది.
- S1 X+ (3kWh): 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎస్ 1 ఎక్స్ ప్లస్ ధర ఇప్పటివరకు రూ. 109,999 ఉండగా, గరిష్టంగా రూ. 25000 తగ్గింపు అనంతరం రూ. 84,999 లకు లభిస్తుంది.
గతంలో కూడా తగ్గించారు..
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. జనవరిలో, బ్రాండ్ ఎస్ 1 ఎక్స్ ప్లస్ పై ఫ్లాట్ రూ .20,000 తగ్గింపును ఓలా అందించింది. ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్ మోడల్స్ కు ఉచిత పొడిగించిన వారంటీని , అలాగే, ఎస్ 1 ప్రోపై రూ .6,999, ఎస్ 1 ఎయిర్ మోడల్ పై రూ .3,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ను అందించింది. అలాగే, ఎంపిక చేసిన బ్యాంక్ ల క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకంగా రూ. 5,000 వరకు తగ్గింపును కూడా అందించారు. అదనంగా, జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేట్లు 7.99 శాతం.. వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ప్రో లపై..
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాల / 80,000 కిలోమీటర్ల వారంటీని కూడా విడుదల చేసింది. అదనంగా రూ.5,000తో లక్ష కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ, రూ.12,500కు 1.25 లక్షల కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివర్లో ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. ఓలా ఎలక్ట్రిక్ డైమండ్ హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్, రోడ్ స్టర్ అనే నాలుగు మోటార్ సైకిళ్ల మోడల్స ను ఓలా ప్రదర్శించింది.
సాఫ్ట్ వేర్ అప్ డేట్
ఓలా ఎలక్ట్రిక్ సాఫ్ట్వేర్ ను కూడా అప్ డేట్ చేసింది. కొత్తగా మూవ్ఓఎస్ 4 పేరుతో అప్ డేటెడ్ వర్షన్ ను విడుదల చేసింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లలో కొన్ని అదనపు ఫీచర్లను జోడించింది. మూవ్ఓఎస్ 4 అప్ డేట్ లో టాంపర్ అలర్ట్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. గ్యారేజీ మోడ్, వేగవంతమైన హైపర్ ఛార్జింగ్, ప్రొఫైల్ కంట్రోల్స్, కేర్ మూడ్, కాన్సర్ట్ మోడ్, ప్రాక్సిమిటీ అన్ లాక్ వంటి ఇతర ప్రధాన ఫీచర్స్ ఈ అప్ డేట్ లో ఉన్నాయి. సగటు వేగం, బ్యాటరీ వినియోగం, పరిధి, సామర్థ్యం, ఆదా చేసిన డబ్బు, ప్రయాణించిన దూరాన్ని చూపించే కొత్త రైడ్ జర్నల్ ఫీచర్ ను కూడా ఓలా ప్రవేశపెట్టనుంది.