Ola e-bike services : హైదరాబాద్​లో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ సేవలు లాంచ్​..-ola launches e bike services in delhi and hyderabad announces fares ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola E-bike Services : హైదరాబాద్​లో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ సేవలు లాంచ్​..

Ola e-bike services : హైదరాబాద్​లో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ సేవలు లాంచ్​..

Sharath Chitturi HT Telugu

Ola e-bike services : హైదరాబాద్​, దిల్లీలో ఈ-బైక్​ ట్యాక్సీ సేవలను ప్రారంభించింది ఓలా. ధరలను కూడా వెల్లడించింది. ఆ వివరాలు..

హైదరాబాద్​లో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ సేవలు లాంచ్​.. (REUTERS)

Ola e-bike services in Hyderabad : రైడింగ్​ సేవలు అందించే ఓలా సంస్థ..​ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్​లో.. ఈ-బైక్​ సేవలను ప్రారంభించింది. ఇది.. ఒక ఈ-బైక్​ సర్వీసుగా పని చేస్తుంది. హైదరాబాద్​తో పాటు దిల్లీలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఓలా ఈ-బైక్​ సేవల వివరాలు..

ఈ-బైక్ సేవల లాంచ్​తో పాటు ధరల వివరాలను కూడా కంపెనీ ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం, ఓలా ఈ-బైక్ ఛార్జీలు.. 5 కిలోమీటర్లకు రూ .25. 10 కిలోమీటర్లకు రూ .50. 15 కిలోమీటర్లకు రూ .75.

దిల్లీతో పాటు బెంగళూరులో కూడా ఈ-బైక్ సేవలను ప్రారంభించాలని ఓలా యోచిస్తోంది. బెంగళూరులో 200 ఛార్జింగ్ స్టేషన్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది.

Ola e-bike services latest news : వచ్చే రెండు నెలల్లో.. మూడు నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో సేవలను అందించాలని యోచిస్తోంది.

ఓలా ఈ బైక్​ ట్యాక్సీ పైలట్​ ప్రాజెక్ట్​ బెంగుళూరులో సక్సెస్​ సాధించింది. వినియోగదారుడు, డ్రైవర్​, ఓలా ఎకోసిస్టెమ్​ను కలుపుకుని ముందుకు వెళతాము. ఇక ఇప్పుడు బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్​లో ఈ-బైక్​ ట్యాక్సీ సేవలను మోహరించాలని చూస్తున్నాము,” అని ఓలా మొబిలిటీ సీఈఓ హేమంత్​ బక్షి తెలిపారు.

2023 సెప్టెంబర్​లో.. బెంగళూరులో ఈ-బైక్ సర్వీస్ కోసం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది ఓలా.

Ola e-bike services : 100 కోట్ల మంది భారతీయులకు సేవలందించడం, విద్యుదీకరణతో దేశవ్యాప్త వ్యాప్తికి అనుగుణంగా.. వచ్చే 2 నెలల్లో ఈ (దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు) నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను మోహరించాలని ఓలా యోచిస్తోంది. ఈ వాహనాల మోహరింపుతో.. దేశంలో అతిపెద్ద ఈవీ 2డబ్ల్యూ ఫ్లీట్​ కలిగి ఉన్న సంస్థ తమదేనని పేర్కొంది.

ఇప్పటి వరకు ఓలా 1.75 మిలియన్లకు పైగా రైడ్స్ సాధించినట్లు ఓలా పేర్కొంది. ఓలా తన ఈ-బైక్ ఫ్లీట్​కు సేవలందించడానికి బెంగళూరులో 200 ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది.

Hyderabad Ola e-bike services : రైడ్-హెయిలింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లాజిస్టిక్స్, ఈ-కామర్స్​ వృద్ధిపై కోసం ఇప్పటికే అనేక స్ట్రాటజీలను అనుసరిస్తోంది ఓలా.

సంబంధిత కథనం