తెలుగు న్యూస్  /  Business  /  Swiggy Say This Dish Was The Most Ordered Food During Ipl 2023

Most ordered dish during IPL 2023 : ఐపీఎల్​ 2023 టైమ్​లో ఏ ఫుడ్​కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయో తెలుసా?

Sharath Chitturi HT Telugu

30 May 2023, 11:53 IST

  • Most ordered dish during IPL 2023 : ఐపీఎల్​ 2023 సమయంలో ప్రజలు ఏ డిష్​ను ఎక్కువగా ఆర్డర్​ ఇచ్చారో తెలుసా? స్విగ్గీ ప్రకారం.. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి.

ఐపీఎల్​ 2023 టైమ్​లో ఏ ఫుడ్​కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయో తెలుసా?
ఐపీఎల్​ 2023 టైమ్​లో ఏ ఫుడ్​కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయో తెలుసా? (Pic by Hemant Mishra/mint)

ఐపీఎల్​ 2023 టైమ్​లో ఏ ఫుడ్​కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయో తెలుసా?

Most ordered dish during IPL 2023 : సోమవారం జరిగిన నెయిల్​ బైటింగ్​ ఫైనల్​ మ్యాచ్​తో ఐపీఎల్​ 2023కు తెరపడింది. గుజరాత్​ టైటాన్స్​ను ఓడించిన చెన్నై సూపర్​ కింగ్స్​.. 5వ కప్​ను తన ఖాతాలో వేసుకుంది. కోట్లాది మంది ధోనీ అభిమానులు.. ఆ క్షణాలను ఎంజాయ్​ చేశారు. ఐపీఎల్​ 2023 జర్నీ మొత్తం క్రికెట్​ లవర్స్​కు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. చెన్నై గెలవడం సరే.. మరి ఈ ఐపీఎల్​ మొత్తంలో ఏ ఫుడ్​కు ఎక్కువ ఆర్డర్​లు లభించాయో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 155 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ ప్రాఫిట్స్​!

Gold and silver prices today : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

నిమిషానికి 212 ఆర్డర్లు..!

ఐపీఎల్​ 2023 షెడ్యూల్​ మొత్తంలో ఎక్కువ ఆర్డర్లు వచ్చిన ఫుడ్​గా నిలిచింది 'బిర్యానీ'. ఓవైపు తమ ఆటతో ప్లేయర్లు దుమ్మురేపుతుంటే.. మరోవైపు నిమిషానికి 212 ఆర్డర్లతో బిర్యానీ బౌండరీల మీద బౌండరీలు కొట్టేసింది! ఆర్డర్ల విషయంలో వార్​ వన్​ సైడ్​ అయిపోయిందని ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ చెప్పింది. అయితే.. ఇది వెజ్​ బిర్యానీ ఆ? లేక నాన్​వెజ్​ బిర్యానీ ఆ? అన్న నెటిజన్ల ప్రశ్నకు ఇంకా స్విగ్గీ నుంచి సమాధానం లభించలేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. బిర్యానీని ఎక్కడ ఎక్కువగా ఆర్డర్​ చేశారు? బిర్యానీ తర్వాత ఏ డిష్​ ఎక్కువగా అమ్ముడుపోయింది ? వంటి ప్రశ్నలకు స్విగ్గీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:- ONDC food delivery : జొమాటో, స్విగ్గీ కన్నా చాలా తక్కువ ధరకే ఫుడ్​ డెలివరీ పొందండి ఇలా..

ఈ వార్త తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ‘బిర్యానీ ఈజ్​ ఆన్​ ఎమోషన్​’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

IPL 2023 Final : బిర్యానీకి ఇండియా మంచి క్రేజ్​ ఉంది. అకేషన్​ ఏదైనా.. బిర్యానీ ఉండాల్సిందే! 2023 న్యూ ఇయర్​ ఈవ్​ రాత్రి.. ఏకంగా 3.5లక్షల బిర్యానీలు అమ్ముడుపోయాయి. మరే ఇతర వంటకాలు కూడా బిర్యానీ దరిదాప్పుల్లో లేవు! స్విగ్గీ బృందం ప్రకారం.. ఆ రోజు రాత్రి 61వేల పిజ్జాలు అమ్ముడుపోయాయి.

న్యూ ఇయర్​ ఈవ్​ నాడు.. ఒక్క హైదరాబాద్​ నుంచి 75.4శాతం బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ నిర్వహించిన ట్విట్టర్​ పోల్​లో తేలింది. ఆ తర్వాతి స్థానంలో లక్నో (14.2శాతం), కోల్​కతా (10.4శాతం) ఉన్నాయి.

తొలిసారిగా లాభాలు..

ఇక స్విగ్గీ విషయానికొస్తే.. ఈ సంస్థ తొలిసారిగా మార్చ్​లో లాభాలను నమోదు చేసింది. ఇది ఫుడ్​ డెలివరీ ఇండస్ట్రీలో ఒక మైలురాయి అని భావించవచ్చు. ఫుడ్​ డెలివరీ బిజినెస్​కు పెరుగుతున్న ఆదరణకు ఇది చిహ్నం అని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

టాపిక్