తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

Sharath Chitturi HT Telugu

29 April 2024, 18:18 IST

  • Google layoffs python team : తమ పైథాన్​ టీమ్​కి షాక్​ ఇచ్చింది గూగుల్​ సంస్థ. మొత్తం టీమ్​ని లేఆఫ్​ చేసేసింది! ఫలితంగా.. 2024లో గూగుల్​ లేఆఫ్స్​ కొనసాగుతున్నాయి.

పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్
పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్ (AFP)

పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్

Google layoffs python team : కంపెనీ ఉద్యోగులకు గత కొన్ని వారాలుగా షాక్​ ఇస్తోంది దిగ్గజ టెక్​ సంస్థ గూగుల్​. లేఆఫ్స్​తో అందరిని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఒక వార్త.. మరింత ఆందోళనకు గురి చేసే విధంగా ఉంది. పైథాన్​ టీమ్​ మొత్తాన్ని గూగుల్​ ఒకేసారి తొలగించినట్టు సమాచారం. అమెరికా బయట.. చౌకగా ఉద్యోగులు లభిస్తున్నారని, వారిపై ఫోకస్​ చేసేందుకే గూగుల్​ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. జర్మనీలోని మ్యూనిచ్​లో కొత్త టీమ్​ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తున్న వేళ.. పైథాన్​ టీమ్​ లేఆఫ్​కి గురవ్వడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

గూగుల్​లో లేఆఫ్స్​..

నివేదిక ప్రకారం, మాస్టోడాన్​ అనే సోషల్​ మీడియా సైట్​లో Social.coop పోస్ట్ ఒక పోస్ట్​ చేసింది.​ గూగుల్ పైథాన్ బృందంలోని మాజీ సభ్యుల్లో ఒకరు.. లేఆఫ్​పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్​ చేశారు. గూగుల్​లో తమ రెండు దశాబ్దాల కెరీర్ అత్యుత్తమమైనదని, కంపెనీ ఉద్యోగుల తొలగింపును ప్రారంభించడం అన్యాయమని ఆ ఉద్యోగి పేర్కొన్నారు. మేనేజర్​తో సహా తన టీమ్ మొత్తాన్ని తొలగించి.. వారి స్థానంలో విదేశాల నుంచి రిమోట్ వర్కర్లను నియమించడం బాధాకరమని మరో ఉద్యోగి అన్నారు.

Google layoffs 2024 : గూగుల్​ తాజాగా తొలగించిన యూఎస్​ పైథాన్ బృందంలో పది కంటే తక్కువ సభ్యులు ఉన్నారు. పైథాన్ ఎకోసిస్టెమ్​ నిర్వహణ, గూగుల్​లో పైథాన్ స్టెబులిటీ, వేలాది థర్డ్-పార్టీ ప్యాకేజీలతో అప్​గ్రేడ్స్​, టైప్-చెకర్ ను అభివృద్ధి చేయడంపై ఈ టీప్​ ఫోకస్​ చేసేది.

ఇదీ చూడండి:- Amit Shah investments : ఆ 180 కంపెనీల్లో అమిత్​ షా పెట్టుబడులు..

మరోవైపు రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల నుంచి కూడా గూగుల్ ఉద్యోగులను తొలగించిందని వార్తలు వచ్చాయి.

గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ లేఆఫ్స్​పై ఉద్యోగులకు మెయిల్​ చేశారు. కంపెనీ రీస్ట్రక్చరింగ్​ ప్రాసెస్​లో భాగంగా బెంగళూరు, డబ్లిన్​, మెక్సికో సిటీలపై ఫోకస్​ చేసినట్టు వివరించారు.

Google layoffs python team : గూగుల్ తన ఇంజనీరింగ్, హార్డ్​వేర్​, అసిస్టెంట్ బృందాలతో సహా అనేక బృందాల్లో వందలాది మంది కార్మికులను ఈ ఏడాది జనవరిలో తొలగించింది.

గూగుల్​ లేఆఫ్స్​పై ఉద్యోగులు.. సోషల్​ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం పోయినట్టు.. చివరి నిమిషం వరకు తమ మేనేజర్​కి కూడా తెలియదని అంటున్నారు. కంపెనీపై అందరు అసంతృప్తిలో ఉన్నట్టు చెబుతున్నారు. చాలా వరకు.. సిస్టెమ్​ లాగౌట్​ అయిపోయినా, తమకు ఏం జరుగుతోందో తెలియదని వివరించారు.

తదుపరి వ్యాసం