Python learning apps : రూ. లక్షల్లో జీతం ఇచ్చే టెక్ జాబ్ కావాలా? ఇలా ‘పైథాన్’ నేర్చుకోండి!
Python learning apps : పైథాన్ నేర్చుకుని మంచి జాబ్ కొట్టాలని చూస్తున్నారా? అయితే ఈ యాప్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. వీటితో పైథాన్ నేర్చుకోవడం చాలా సులభమైపోతుంది!

Python learning apps : ఐటీ జాబ్ అనేది ఎవర్గ్రీన్ ఉద్యోగం అని చాలా మంది భావిస్తుంటారు. ఈ రంగంలో జీతాలు ఎక్కువగా వస్తాయని, అందుకే ఎలాగైనా జాబ్ సంపాదించాలని కలలు కంటుంటారు. చాలా తీవ్రంగా కృషిచేస్తుంటారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? భారీ వేతనంతో ఐటీ జాబ్ సంపాదించాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పైథాన్‌కు మంచి డిమాండ్ ఉంది. వెబ్ డెవలప్మెంట్ నుంచి సాఫ్ట్వేర్ క్రియేషన్ వరకు, టాస్క్ ఆటోమేషన్ నుంచి డేటా ఎనలటిక్స్ వరకు అన్నింట్లోనూ పైథాన్‌ను ఉపయోగిస్తుంటారు. అందుకే చాలా కంపెనీలు ఉద్యోగాల ఎంపికలో పైథాన్ సర్టిఫికేషన్‌ని కూడా చూస్తుంటాయి. ఈ నేపథ్యంలో పైథాన్‌ను నేర్చుకునేందుకు ఉపయోగపడే కొన్ని యాప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాము..
పైథాన్‌తో ఉపయోగాలివే..
స్టాక్ ఓవర్‌ఫ్లో డెవలపర్ సర్వే ప్రకారం.. డిమాండ్ ఉన్న మూడో ప్రోగ్రామింగ్ లాంగ్యువేజ్గా పైథాన్ నిలిచింది. ఈ ప్రోగ్రామ్ సులభంగా ఉండటంతో చాలా మంది దీనిని ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
- మెషిన్ లర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్‌లో పైథాన్‌ను వాడుకోవచ్చు. స్కైపై, పాండాస్ వంటి పైథాన్ లైబ్రరీలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.
- How to learn Python : డేటా ఎనలిటిక్స్‌లోని క్లిష్టమైన లెక్కలను పైథాన్ ద్వారా సులభతరం చేసుకోవచ్చు. డేటా విజ్యువలైజేషన్ సాధ్యమవుతుంది. మెషిన్ లర్నింగ్ ఆల్గొరిథమ్లు వంటివి కూడా చేసుకోవచ్చు.
- ఆటోమేషన్‌లో కూడా పైథాన్‌ని వాడుకోవచ్చు. అంతేకాకుండా బగ్ ట్రాకింగ్, బిల్డింగ్ కంట్రోల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్‌లోనూ పైథాన్ ప్రోగ్రామ్‌ను వినియోగించుకోవచ్చు.
ఇక ఇప్పుడు పైథాన్‌ను సులభంగా నేర్చుకునేందుకు అందుబాటులో ఉన్న కొన్ని యాప్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మిమో:- పైథాన్ గురించి లోతైన జ్ఞనాన్ని ఇస్తుంది ఈ మిమో యాప్. పైథాన్లోని చాలా టాపిక్స్‌ని ఇది కవర్ చేస్తుంది. రియల్ టైమ్ ప్రాజెక్టులపై పని చేసి గోల్స్‌ని పూర్తి చేసుకుని, ఎక్స్‌పీరియన్స్‌ని కూడా పొందవచ్చు. ఈ యాప్ ద్వారా యూజర్లు వెబ్ డెవలప్మెంట్ను కూడా చేసుకోవచ్చు.
ప్రోగ్రామింగ్ హీరో:- పైథాన్ లర్నింగ్ని ఆసక్తికరంగా మారుస్తుంది ఈ యాప్. గేమ్స్ ఆడుకుంటూ.. ప్రోగ్రామింగ్ నేర్చేసుకోవచ్చు! పిల్లలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. యాప్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్కు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి.
Python apps for beginners : ప్రోగ్రామింగ్ హబ్:- పైథాన్‌ను నేర్చుకోవడం మొదలుపెట్టిన వారికి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. టాపిక్స్‌ను మెరుగ్గా, వేగంగా అర్థం చేసుకోవచ్చు.
సోలోలర్న్:- ఈ యాప్‌తో కోడింగ్‌ను సులభంగా నేర్చుకోవచ్చు. పైథాన్లోని టాపిక్స్‌ను అర్థం చేసుకునేందుకు అనేక పజిల్స్ ఉంటాయి. అంతేకాకుండా టుటోరియల్స్ కూడా చాలా ఉంటాయి. వీటి ద్వారా పైథాన్‌ను ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
సంబంధిత కథనం