AU Engineering Entrance 2024: ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ 2024 నోటిఫికేషన్ విడుదల.. మే 5న ఎంట్రన్స్ టెస్ట్…
AU Engineering Entrance 2024: ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 5న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
AU Engineering Entrance: ఆంధ్రా యూనివర్శిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పలు ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. AUET 2024 ద్వారా ఖాళీలను భర్తీ చేస్తారు.
AU Engineering Entrance: ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలోని ఇంజనీరింగ్ కాలేజీలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ AUEET 2024 విడుదలైంది. ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ద్వారా సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో AU Engg College పలు కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్ని అందిస్తున్నారు. వీటిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE విభాగంలో 360సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ECE 60సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్‌లో Mechanical 30, సివిల్ ఇంజనీరింగ్‌లో Civil Engineering 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ EEE ఇంజనీరింగ్‌లో 30 సీట్లు ఉన్నాయి.
కనీసం 45శాతం మార్కులతో ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంటర్ పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ పొందే సమయానికి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడు క్యాటగిరీ అభ్యర్థులకు 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సరిపోతుంది.
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను ఎంట్రన్స్ పరీక్ష ద్వారా కేటాయిస్తారు. ఏయూ ఎంట్రన్స్ టెస్ట్ 2024ను విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కడపల్లో నిర్వహిస్తారు.
ఏయూ ఎంట్రన్స్ టెస్ట్ 2024కు దరఖాస్తు రుసుముగా రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యరథులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులను ఏప్రిల్ 24వతేదీలోగా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. రూ.750 ఆలస్య రుసుముతో మే 1వరకు స్వీకరిస్తారు.
మే 3వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 5వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మే 7వ తేదీన ఫలితాలను విడుదల చేస్తారు.
ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కు సంబంధించిన వివరాల కోసం https://audoa.andhrauniversity.edu.in ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం