తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Q4 Results: కోలుకుంటున్న జొమాటో.. పెరిగిన ఆదాయం.. తగ్గిన నష్టాలు

Zomato Q4 results: కోలుకుంటున్న జొమాటో.. పెరిగిన ఆదాయం.. తగ్గిన నష్టాలు

HT Telugu Desk HT Telugu

19 May 2023, 19:22 IST

  • Zomato Q4 results: 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో శుక్రవారం ప్రకటించింది. ఈ Q4 లో సంస్థ నికర నష్టాలు రూ. 187.6 కోట్లకు తగ్గాయని వెల్లడించింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Zomato Q4 results: 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY23) ఫలితాలను ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) శుక్రవారం ప్రకటించింది. ఈ Q4 లో సంస్థ నికర నష్టాలు రూ. 187.6 కోట్లకు తగ్గాయని వెల్లడించింది. Q4FY23 ఆదాయం మెరుగుపడడంతో నష్టాలను కొంత మేర తగ్గించుకోగలిగామని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

Zomato Q4 results: ఆదాయంలో మెరుగుదల

2021- 22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY22) లో జొమాటో (Zomato) నికర నష్టాలు రూ. 359.7 కోట్లు. అంటే, Q4FY22 తో పోలిస్తే, Q4FY23లో జొమాటో నష్టాలు దాదాపు సగం వరకు తగ్గాయి. Q4FY23 లో జొమాటో (Zomato) ఆదాయం రూ. 2,056 కోట్లు కాగా, Q4FY22 లో జొమాటో ఆదాయం రూ. 1,211.8 కోట్లు మాత్రమే. అలాగే, మొత్తం వ్యయాన్ని లెక్కిస్తే, Q4FY23 లో జొమాటో (Zomato) మొత్తం వ్యయం రూ. 2431 కోట్లు కాగా, Q4FY22 లో అది రూ. 1,701.7 కోట్లు మాత్రమే.

Zomato Q4 results: మొత్తం ఆర్థిక సంవత్సరంలో..

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ స్టార్ట్ అప్ జొమాటో (Zomato) నికర నష్టాలు రూ. 971 కోట్లు గా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర నష్టాలు రూ. 1,222.5 కోట్లుగా ఉన్నాయి. FY23 లో జొమాటో (Zomato) ఆదాయం రూ. 7,079.4 కోట్లు కాగా, FY22 లో అది రూ. 4,192.4 కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జొమాటో (Zomato) లాభాల్లోకి వెళ్తుందన్న ధీమాను జొమాటో ఎండీ, సీఈఓ దీపేందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal) వ్యక్తం చేశారు. ఈ మేరకు షేర్ హోల్డర్లకు ఆయన ఒక లేఖ రాశారు. గత ఐదు త్రైమాసికాల్లో సంస్థ గణనీయమైన ఆదాయాన్ని సముపార్జిస్తూ, నష్టాలను తగ్గించుకుంటోందని ఆయన వివరించారు. ఫుడ్ డెలివరీ చార్జెస్ ను పోటీదారుల కన్నా తక్కువగా వసూలు చేయడం సంస్థ వ్యూహాల్లో ఒకటని వివరించారు.

తదుపరి వ్యాసం