Zomato Q3 results : జొమాటో షేర్లతో భారీ లాభాలు.. స్టాక్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!-zomato share price target should you buy after q3 results analysts see promising outlook ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Zomato Share Price Target : Should You Buy After Q3 Results? Analysts See Promising Outlook

Zomato Q3 results : జొమాటో షేర్లతో భారీ లాభాలు.. స్టాక్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu
Feb 10, 2023 10:33 AM IST

Zomato share price target : జొమాటో క్యూ3 ఫలితాల అనంతరం ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థలు స్టాక్​ ప్రైజ్​ టార్గెట్​ను వెల్లడించాయి. ఆ వివరాలు..

జొమాటో షేర్లతో భారీ లాభాలు.. స్టాక్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!
జొమాటో షేర్లతో భారీ లాభాలు.. స్టాక్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే! (REUTERS)

Zomato Q3 results : ఖర్చులు భారీగా పెరగడం, ఫుడ్​ డెలివరీ బిజినెస్​లో వృద్ధి నెమ్మదించడం కారణంగా.. 2023 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో జొమాటో సంస్థ నెట్​ లాస్​ మరింత పెరిగింది. అయితే.. అంచనాలకు మించిన ఆదాయం నమోదవడం సానుకూల విషయం. ఇక జనవరిలో తమ ఫుడ్​ డెలివరీ బిజినెస్​ వృద్ధి మళ్లీ పట్టాలెక్కిందని జొమాటో చెప్పింది. ఆర్డర్​ల సంఖ్య భారీగా పెరిగినట్టు వివరించింది. ఈ నేపథ్యంలో జొమాటో షేర్లను ఇప్పుడు కొనొచ్చా? అని మదుపర్లలో సందేహాలు నెలకొన్నాయి. వీటిపై స్టాక్​ మార్కెట్​ నిపుణులు స్పందించారు. ఆ వివరాలను తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

జొమాటో క్యూ3 ఫలితాలు..

క్యూ3లో జొమాటో యావరేజ్​ ఆర్డర్​ వాల్యూ 6శాతం పెరిగింది. మొత్తం మీద ఆర్డర్​ వాల్యూమ్​ 14శాతం వృద్ధి చెందింది. అడ్జెస్టెడ్​ ఎబిట్​డా.. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా పాజిటివ్​గా నిలిచింది.

Zomato share price target : "నష్టాలను తగ్గించుకునేందుకు జొమాటో తీవ్రంగా కృషిచేస్తోందని స్పష్టమవుతోంది. అడ్జెస్టెడ్​ ఎబిట్​డా (బ్లింకిట్​ను మినహాయిస్తే) రూ. 0.4 బిలియన్​ కన్నా తక్కువే ఉంది. బ్రేక్​ ఈవెన్​ టార్గెట్​ను చేరుకుంటామని సంస్థ చెబుతుండటంతో స్టాక్​ ఔట్​లుక్​ పాజిటివ్​గానే ఉంది. జొమాటో గోల్డ్​ కూడా ఉపయోగపడుతోంది. నష్టాలను తగ్గించుకుంటూ.. బ్లింకిట్​ సైతం పుంజుకుంటోంది," అని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్​ సంస్థ జెఫ్రీస్​ వెల్లడించింది.

LIC Q3 results : ఎల్​ఐసీ క్యూ3 ఫలితాల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ నేపథ్యంలో.. జొమాటో క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉన్నట్టు చెప్పిన జెఫ్రీస్​.. షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను రూ. 100గా పేర్కొంది. భవిష్యత్తులో జొమాటో వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇది సంస్థకు మంచి విషయం అని స్పష్టం చేసింది.

ఇక మరో అంతర్జాతీయ బ్రోకరేజ్​ సంస్థ మోర్గాన్​ స్టాన్​లీ.. జొమాటోకు ఓవర్​వెయిట్​ రేటింగ్​ ఇచ్చింది. జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను రూ. 82గా పేర్కొంది.

జొమాటో స్టాక్​ ధర..

Zomato share price : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ఉదయం 10 గంటల సమయంలో జొమాటో షేర్లు 1శాతం నష్టంతో రూ. 54 వద్ద ఉన్నాయి. ఇక ఐదు రోజుల్లో ఈ స్టాక్​ 10.3శాతం పెరిగింది. నెల రోజుల వ్యవధిలో మాత్రం 1.6శాతం పతనమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 10.8శాతం నష్టపోయింది జొమాటో స్టాక్​. ఆరు నెలల వ్యవధిలో 4శాతం, ఏడాది కాలంలో 43.2శాతం మేర నష్టపోయింది ఈ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో స్టాక్​.

WhatsApp channel