Zomato gains: ఫౌండర్ చేసిన ట్వీట్ తో పరుగులు తీసిన జొమాటో షేర్; ఏముందా ట్వీట్లో?-zomato gains over 9 after founder deepinder goyal shapes this post on twitter ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Gains: ఫౌండర్ చేసిన ట్వీట్ తో పరుగులు తీసిన జొమాటో షేర్; ఏముందా ట్వీట్లో?

Zomato gains: ఫౌండర్ చేసిన ట్వీట్ తో పరుగులు తీసిన జొమాటో షేర్; ఏముందా ట్వీట్లో?

HT Telugu Desk HT Telugu
Feb 08, 2023 08:17 PM IST

Zomato gains: ఫౌండర్ దీపిందర్ గోయల్ చేసిన ఒక ట్వీట్ (tweet) జొమాటో (Zomato) షేర్ పైపైకి పరుగులు తీసింది. షేర్ వాల్యూ ఒకే రోజు 9% పెరిగేంతగా ఇంతకీ ఏముందా ట్వీట్లో?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

Zomato gains 9% in a day: జొమాటో (Zomato) ఫౌండర్ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) బుధవారం ఉదయం ఒక ట్వీట్ (tweet) చేశారు. ఆ ట్వీట్ కారణంగా జొమాటో షేర్ 9% పెరిగింది. బుధవారం ట్రేడింగ్ జొమాటో (Zomato) షేర్ రూ. 51.20 వద్ధ ప్రారంభమై, ఇంట్రాడేలో రూ. 55.30 కి చేరింది. చివరకు రూ. 53.80 వద్ద ముగిసింది. అంతకు ముందు రోజు జొమాటో క్లోజింగ్ ధర రూ. 49.35.

A tweet makes Zomato gain 9% in a day: ట్వీట్ రిజల్ట్

పేటీఎం (Paytm) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3)లో మెరుగైన ఫలితాలను సాధించింది. దాంతో పేటీఎం (Paytm) వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (Paytm founder Vijay Shekhar Sharma) ను అభినందిస్తూ జొమాటో (Zomato) ఫౌండర్ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఒక ట్వీట్ (tweet) చేశారు. ‘లాభదాయకంగా మారినందుకు కంగ్రాచ్యులేషన్స్ విజయ్ శేఖర్, పేటీఎం (Paytm). సారీ.. పార్టీకి కొంత ఆలస్యంగా వచ్చాను. మా సొంత సంస్థ లాభాల లెక్కలు చూసుకోవడంలో బిజీగా ఉండడంతో ఆ ఆలస్యమైంది’ అని దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఆ ట్వీట్ (tweet) లో పేర్కొన్నారు. దాంతో, జొమాటో కూడా Q3 లో లాభాలను ప్రకటించనుందని అర్థం చేసుకున్న మదుపర్లు ఒక్కసారిగా జొమాటో (Zomato) షేర్ల కొనుగోలు ప్రారంభించారు. దాంతో, షేరు విలువ ఒకే రోజులో 9.02% పెరిగింది. అంతేకాదు, ఒక్క రోజులోనే సుమారు 289,069,473 షేర్లు ట్రేడ్ అయ్యాయి.

Paytm results: పేటీఎం ఫలితాలు

Q3 లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో పేటీఎం షేర్ కూడా బుధవారం 15% పైగా పెరిగింది. డిసెంబర్ తో ముగిసిన Q3 లో పేటీఎం (Paytm) నికర నష్టాలు రూ. 392 కోట్లకు తగ్గాయి. గత సంవత్సరం Q3 లో లో పేటీఎం నికర నష్టాలు రూ. 778.4 కోట్లు. అలాగే, గత Q3 లో పేటీఎం (Paytm) ఆపరేటింగ్ రెవెన్యూ రూ. 1,456.1 కోట్లు కాగా, ఈ Q3 లో పేటీఎం (Paytm) ఆపరేటింగ్ రెవెన్యూ రూ. 2,062.2 కోట్లు. అంటే దాదాపు 42% వృద్ధి సాధ్యమైంది. ఫిబ్రవరి 8న పేటీఎం (Paytm) షేరు విలువ 15.53% పెరిగి రూ. 680.00 వద్ద ముగిసింది. జొమాటో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను ఫిబ్రవరి 9న విడుదల చేయనుంది.

Whats_app_banner