LIC Q3 profits: ఎల్ఐసీకి Q3 లో అంచనాలకు మించిన లాభాలు
LIC Q3 profits: భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) గురువారం ఈ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను (Q3) ప్రకటించింది.
LIC Q3 profits: డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం (Q3FY23) లో ఎల్ఐసీ అంచనాలకు మించిన లాభాలను సాధించింది. ఈ Q3FY23 లో ఎల్ఐసీ నికర లాభాలు (LIC Q3 profits) రూ. 8,334 కోట్లు. ప్రీమియం చెల్లింపుల ద్వారా లభించిన ఆదాయం పెరగడంతో ఈ Q3 నికర లాభాలలో నుంచి రూ. 5,670 కోట్లను ఎల్ఐసీ షేర్ హోల్డర్స్ ఫండ్ లోకి పంపించింది. గత Q3 లో సంస్థ నికర లాభాలు రూ. 235 కోట్లు మాత్రమే. అలాగే, ఈ Q2 లో ఎల్ఐసీ నికర లాభాలు (LIC Q2 profits) రూ. 15,952 కోట్లు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ కాలానికి చెందిన తొలి త్రైమాసికంలో ఎల్ఐసీ (LIC) నికర లాభాలు 682.9 కోట్లు.
LIC Q3 profits: నికర ప్రీమియం ఇన్ కం
LIC నికర ప్రీమియం ఆదాయం ఈ Q3 లో గణనీయంగా పెరిగింది. ఈ Q3 లో ఎల్ ఐసీ నికర ప్రీమియం ఆదాయం రూ. 1.11 లక్షల కోట్లు. గత Q3 లో ఇది రూ. 97,620 కోట్లు. న్యూ బిజినెస్ ప్రీమియం లేదా ఫస్ట్ ఈయర్ ప్రీమియం ఆదాయం ఈ Q3 లో రూ. 9,724.71 కోట్లు కాగా, గత Q3 లో అది రూ. 8,748.55 కోట్లు. సింగిల్ ప్రీమియం ఆదాయం కూడా ఈ Q3 లో 31% పెరిగి రూ. 42,117 కోట్లకు చేరుకుంది.
LIC Q3 profits: ఇన్వెస్ట్మెంట్స్ ఆదాయం
ఇన్వెస్ట్మెంట్ల (investments) ద్వారా ఈ Q3 లో ఎల్ఐసీ రూ. 84,889 కోట్లను సంపాదించింది. గత Q3 లో అది రూ. 76,574 కోట్లు మాత్రమే. అలాగే, డిసెంబర్ 31, 2022 నాటికి ఎల్ఐసీ (LIC) నికర ఆస్తుల విలువ రూ. 44.34 లక్షల కోట్లకు చేరింది. గత Q3 లో అది రూ. 40.12 లక్షల కోట్లు.
LIC Q3 profits: త్వరలో ఆదానీ మేనేజ్మెంట్ తో సమావేశం
ఆదానీ (adani) ఆర్థిక అవకతవకల కారణంగా షేర్ విలువకు సంబంధించి అత్యంత ఎక్కువగా నష్టపోయిన కంపెనీల్లో ఎల్ ఐసీ ఒకటి. ఆదానీలో LIC పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో మదుపర్లలో ఆందోళన నెలకొంది. దాంతో, LIC షేర్లు దిగజారడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆదానీ మనేజ్మెంట్ (adani management) తో త్వరలో LIC చైర్మన్ సమావేశం కానున్నారు.