ONDC food delivery : జొమాటో, స్విగ్గీ కన్నా చాలా తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ పొందండి ఇలా..
ONDC food delivery : తరచూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తూ ఉంటారా? జొమాటో, స్విగ్గీ వేసే ఛార్జీల మోత భరించలేకపోతున్నారా? వాటి కన్నా చాలా రెట్లు తక్కువ ధరకే మీరు ఫుడ్ డెలివరీని పొందగలిగితే? అవును.. ఈ ఓఎన్డీసీ ఫుడ్ డెలివరీ గురించి తెలుసుకుందాము..
ONDC food delivery : ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ఫుడ్ డెలివరీ చేసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. జొమాటో, స్విగ్గీతో పాటు అనే సంస్థలు ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను సాగిస్తూ.. కస్టమర్ల కడుపు నింపుతున్నాయి! ఈ సెగ్మెంట్లో జొమాటో, స్విగ్గీల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తుంటుంది. అయితే వీటికి పోటీగా మరో కొత్త ఫుడ్ డెలివరీ ప్లాట్ఫార్మ్ వచ్చింది. ఇది వీటిని ఒకింత భయపెట్టే విషయమే! ఎందుకంటే.. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో జొమాటో, స్విగ్గీతో పోల్చుకుంటే.. చాలా రెట్లు తక్కువకే ఫుడ్ డెలివరీ జరుగుతోంది మరి. అదే.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓఎన్డీసీ ఫుడ్ డెలివరీ.
ఓఎన్డీసీ ఫుడ్ డెలివరీ అంటే..
ఓఎన్డీసీ అంటే.. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీనిని 2022 సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు దీనికి ఆదరణ పెరుగుతోంది. స్విగ్గీ, జొమాటోలాగా కాకుండా ఎలాంటి థర్డ్ పార్టీ సాయం లేకుండా ఫుడ్‌ను డెలివరీ చేయడంతో.. ఈ ఓఎన్డీసీలో ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి.
ONDC food delivery Hyderabad : రెస్టారెంట్లు.. నేరుగా కస్టమర్లకు ఫుడ్‌ను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వేదికే ఈ ఓఎన్డీసీ. ఫుడ్‌తో పాటు గ్రాసరీలు, హోం డెకర్స్, క్లీనింగ్ వస్తువులు వంటివి కూడా ఇది డెలివరీ చేస్తుంది. ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌లో ఉండే విధంగానే!
ఇదీ చదవండి:- Swiggy platform fee : స్విగ్గీ మాస్టర్ ప్లాన్.. కొత్త 'ఫీజ్'తో రోజుకు రూ. 30లక్షల ఆదాయం!
2022 సెప్టెంబర్‌లో దీనిని తొలిసారిగా బెంగళూరులో లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ ప్లాట్ఫార్మ్ వివిధ నగరాలకు విస్తరించి జొమాటో, స్విగ్గీలకు పోటీనిచ్చే విధంగా మారుతోంది.
ఉదాహరణకు.. జొమాటో, స్విగ్గీల్లో రూ. 210- రూ. 220గా అయ్యే బిల్లు.. ఈ ఓఎన్డీసీ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్‌లో సుమారు రూ. 150గా ఉంటోంది.
ఓఎన్డీసీని ఎలా ఉపయోగించాలి?
ONDC food delivery apps : పేటీఎం యాప్‌లో ఓఎన్డీసీని ఉపయోగించుకోవచ్చు. పేటీఎం యాప్ ఓపెన్ చేసి, సెర్చ్ బార్లో ఓఎన్డీసీ అని టైప్ చేయండి. గ్రాసరీల నుంచి ఫుడ్ డెలివరీ వరకు అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఓఎన్డీసీ ఫుడ్ మీద టాప్ చేయండి. మీకు కావాల్సిన ఫుడ్‌ను సెర్చ్ చేయండి. మీకు అనేక రెస్టారెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకుని చెక్ ఔట్ అయితే.. ఇతర యాప్స్లాగానే మీకు ఆన్లైన్ ఫుడ్‌డెలివరీ జరుగుంది!
How to use ONDC food delivery apps : ఓఎన్డీసీ అన్నది కొత్తగా ప్రారంభించినది. అన్ని రెస్టారెంట్లు ఇందులో అందుబాటులో ఉండకపోవచ్చన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఈ ఓఎన్డీసీ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది.
సంబంధిత కథనం