ఆర్థిక స్వావలంబన కోసం మహిళలు ఇప్పుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొత్త ఉపాధి మార్గాల్లోకి అడుగుపెట్టడానికి వెనుకాడడం లేదు. గత సంవత్సరం స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) వంటి డెలివరీ సర్వీసుల్లో ఉద్యోగం కోసం సుమారు లక్ష మంది యువతులు దరఖాస్తు చేసుకున్నారు. టయర్ 2 నగరాల్లో చండీగఢ్, లక్నో నగరాలు ఈ విషయంలో టాప్ లో ఉన్నాయి.
స్వయం ఉపాధి, చిన్న తరహా కాంట్రాక్ట్ ఉద్యోగాలు, డెలివరీ, ఫ్రంట్ ఆఫీస్ సర్వీసులు మొదలైన వాటిని గిగ్ ఎకానమీ (gig economy) గా పరిగణిస్తారు. ఈ ఎకానమీ లో ఇప్పుడు పురుషుల ఆధిపత్యం తగ్గుతోంది. ఈ ఎకానమీ (gig economy) లో మహిళల సంఖ్య, ప్రభావం పెరుగుతోంది. డెలివరీ సర్వీస్, డ్రైవింగ్, ఫాక్టరీ వర్కర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, మెయింటెనెన్స్ సర్వీస్ .. తదితర రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం 34% పెరిగిందని అప్నా (Apna) అనే ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్ (professional networking platform) వెల్లడించింది. అలాగే, పార్ట్ టైమ్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య 67%, ఫుల్ టైమ్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య 34% పెరిగిందని Apna వెల్లడించింది. నైట్ షిఫ్ట్ ల్లో పనిచేయడానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపింది.
గతంలో పెద్ద నగరాలు, మెట్రోపాలిటన్ సిటీల నుంచే మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ముందుకు వచ్చేవారని, ఇప్పుడు పట్టణాల నుంచి కూడా మహిళలు ముందుకు వస్తున్నారని అప్నా వెల్లడించింది. గత సంవత్సరం టయర్ 1, టయర్ 2 పట్టణాల నుంచి 3.1 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. అలాగే, మహిళలకు వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించిన సంస్థల్లో పేటీెఎం, జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ మొదలైనవి ముందున్నాయని తెలిపింది. ర్యాపిడో (Rapido) లో ప్రస్తుతం 43,335 మంది, స్విగ్గీ (Swiggy)లో 23,120 మంది, జొమాటోలో (Zomato) లో 29,623 మంది మహిళా ఉద్యోగులున్నారు.