Paytm share price : దూసుకెళుతున్న పేటీఎం షేర్లు.. ఇప్పుడు కొనొచ్చా?
Paytm share price : పేటీఎం షేర్లు గత రెండు ట్రేడింగ్ సెషన్స్‌లో దూసుకెళుతున్నాయి. మరి ఇప్పుడు పేటీఎం స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చా?
Paytm share price : పేటీఎం షేర్లు వరుసగా రెండో రోజు దూసుకెళుతున్నాయి! మంగళవారం ట్రేడింగ్ సెషన్లో పేటీఎం స్టాక్ రూ. 669.95 వద్ద గరిష్ఠాన్ని టచ్ చేసి 20శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి మంగళవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 10శాతం లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. పేటీఎం షేర్లను ఇప్పుడు కొనొచ్చా? అన్న సందేహం మదుపర్లలో నెలకొంది. వీటిపై స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్‌లు స్పందించారు. ఆ వివరాలు..
పేటీఎం షేర్ల ర్యాలీకి కారణం ఇదే..
2023 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికం ఫలితాలను కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది పేటీఎం. నెంబర్లు అద్భుతంగా ఉన్నాయి. ఫలితంగా స్టాక్‌లో మంచి ర్యాలీ కనిపిస్తోంది. గత ఐదు రోజుల్లో ఈ పేటీఎం స్టాక్ 13.22శాతం వృద్ధిని సాధించింది. ఇక రెండు రోజుల్లో 27.55శాతం పెరిగింది.
Paytm Q3 results 2023 : క్యూ3లో పేటీఎం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. నికర నష్టం చాలా వరకు తగ్గి రూ. 392కోట్లకు చేరింది. 2021 క్యూ3లో అది రూ. 774.4కోట్లుగా ఉండేది. ఇక పేటీఎం రెవెన్యూ 42శాతం వృద్ధిచెంది రూ. 2,062.2కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాదిలో అది రూ. 1,456.1కోట్లుగా ఉండేది. ఈఎస్ఓపీ కాస్ట్‌ను మినహాయిస్తే.. క్యూ3లో ఆపరేషనల్ ప్రాఫిట్లో తాము అనుకున్న టార్గెట్‌ను సాధించినట్టు పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేకర్ తెలిపారు.
క్యూ3 ఫలితాల నేపథ్యంలో గోల్డ్‌మ్యాన్ సాక్స్‌తో పాటు పలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు పేటీఎంకు బై రేటింగ్ ఇచ్చాయి. ఇదే రంగంలోని ఇతర సంస్థలతో పేల్చుకుంటే పేటీఎం వాల్యుయేషన్ తక్కువగా ఉందని అభిప్రాయపడ్డాయి.
Paytm share price target : గోల్డ్‌మ్యాన్ సాక్స్.. పేటీఎం స్టాక్ ప్రైజ్ టార్గెట్ రూ. 1,120 నుంచి రూ. 1,150కి పెంచింది. ఇక మరో బ్రోకరేజ్ సంస్థ సిటీ.. పేటీఎం షేర్ ప్రైజ్ టార్గెట్‌ను రూ. 1,055 నుంచి రూ. 1,061కి చేర్చింది. మరో బ్రోకరేజ్ సంస్థ బోఫా సెక్యూరిటీస్ మాత్రం.. పేటీఎం స్టాక్‌కు న్యూట్రల్ కాల్ ఇచ్చింది.
పేటీఎం స్టాక్ ప్రైజ్..
ప్రస్తుతం పేటీఎం స్టాక్ రూ. 608 వద్ద ట్రేడ్ అవుతోంది. పేటీఎం షేర్లు గత నెల రోజుల్లో 7.9శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 14.5శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఆరు నెలల వ్యవధిలో మాత్రం పేటీఎం స్టాక్ ప్రైజ్ 27శాతం పతనమైంది. ఏడాది కాలంలో 36.4శాతం పడింది.
Paytm share price today : ప్రస్తుతం పేటీఎం మార్కెట్ వాల్యూ 39.58ట్రిలియన్ కోట్లుగా ఉంది.
(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం