Swiggy platform fee : స్విగ్గీ మాస్టర్ ప్లాన్.. కొత్త 'ఫీజ్'తో రోజుకు రూ. 30లక్షల ఆదాయం!
Swiggy platform fee : ప్లాట్ఫార్మ్ ఫీజ్ భారాన్ని కస్టమర్లపై మోపింది ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ. ఫలితంగా సంస్థకు రోజుకు రూ. 30లక్షల ఆదాయం అదనంగా వస్తుందని తెలుస్తోంది.
Swiggy platform fee : ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. కస్టమర్లపై అదనపు భారం వేసేందుకు సిద్ధపడింది. యాప్‌లో కొత్తగా 'ప్లాట్ఫార్మ్ ఫీజ్'ను ప్రవేశపెట్టింది. ఫలితంగా ప్రతి ఆర్డర్ మీద రూ. 2ను అదనంగా పొందనుంది. ఈ ఒక్క చర్యతో.. స్విగ్గీ అదనంగా రూ. 30లక్షలు సంపాదించనుంది.
ప్లాట్ఫార్మ్ ఫీజ్..
ఫుడ్ డెలివరీ బిజినెస్ నెమ్మదించడం కారణంగా స్విగ్గీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలని స్విగ్గీ ఫిక్స్ అయినట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. కాస్ట్ కటింగ్ పేరుతో అనేక ఉద్యోగులను తొలగించింది. ఇక ఇప్పుడు కస్టమర్లపై ప్లాట్ఫార్మ్ ఫీజ్‌తో అదనపు భారాన్ని వేసింది.
Swiggy platform charges : ఈ ప్లాట్ఫార్మ్ ఫీజ్ అనేది కేవలం ఫుడ్ డెలివరీకే వర్తిస్తోంది. ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లకు ప్రస్తుతం ఈ ఛార్జీలు లేవు. ఈ ప్లాట్ఫార్మ్ ఫీజ్ అనేది.. హ్యాండ్లింగ్ ఫీజ్‌కు పూర్తిగా భిన్నం. ప్రస్తుతం ఈ కొత్త ఛార్జీలు బెంగళూరు, హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చాయి. త్వరలోనే ఢిల్లీ, ముంబైలోనూ ఇవి కనిపిస్తాయని తెలుస్తోంది.
రోజుకు రూ. 30లక్షలు...!
స్విగ్గీ రోజుకు 1.5 మిలియన్ ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. వీటిపై రూ. 2 అదనంగా వసూలు చేసినా.. ఆదాయం రూ. 30లక్షలు పెరుగుతుంది! ఫలితంగా సంస్థ నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయని స్విగ్గీ భావిస్తోంది.
Swiggy latest news : ఎఫ్వై22లో స్విగ్గీ ఆదాయం రూ. 5,704.9కోట్లుగా ఉంది. కాగా.. సంస్థ చేసే ఖర్చులు రూ. 3,900కోట్లకు చేరింది. మరో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోతో (రూ. 700కోట్లు) పోల్చుకుంటే.. ఇది చాలా ఎక్కువే.
స్విగ్గీకి గట్టిపోటీనిస్తున్న జొమాటో సైతం.. ఇటీవలే రెస్టారెంట్ల నుంచి వచ్చే కమిషన్లను పెంచుతామని చెప్పింది.
క్లౌడ్ కిచెన్ నుంచి ఔట్..
క్లౌడ్ కిచెన్ బిజినెస్ నుంచి వైదొలగాలని స్విగ్గీ ఇటీవలే నిర్ణయించుకుంది. తన క్లౌడ్ కిచెన్ బిజినెస్‌ను.. ఈ రంగంలో తమకు ప్రధాన పోటీదారుగా ఉన్న ‘కిచెన్స్ ఎట్ (Kitchens@)’ కు విక్రయించేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం